హన్మకొండ : కేంద్రప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఇ న్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూని యన్ జాతీయ ఉపాధ్యక్షుడు కె.వేణుగోపాల్ విమర్శించారు. హన్మకొండ బాలసముద్రంలో ని ఎల్‌ఐసీ డివిజన్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్(వరంగల్, ఖమ్మం) సమావేశం ఆది వారం జరిగింది. సమావేశంలో వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఫ్యాక్టరీల చట్టం, అప్రెంటిస్ చట్టాలకు సవరణలు చేసి కార్మికులు హక్కులను కాలరాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
యూపీఏ పాలనలో ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐల పెంపుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు యశ్వంత్‌సిన్హా ఎఫ్‌డీఐల పెంపును వ్యతి రేకించారని గుర్తు చేశారు. అయితే.. అదే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండగా.. పాత ప్రతి పాదననే తీసుకురావడం గర్హనీయమన్నారు. ప్రస్తుతం యూరప్ దేశాల కంటే మన దేశంలో నే బీమా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున.. విదేశీ పెట్టుబడుల అవసరం లేదన్నారు.
కాగా, ఎఫ్‌డీఐల పెంపును నిలిపివేయాలని, ఇన్సూరెన్స్ బిల్లును ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో మ హాధర్నా చేయనున్నామని వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ కూడా పాల్గొననున్న ఈ ధర్నాను ఇన్సూరెన్స్ ఉద్యోగులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యూనియన్ డివిజన్ అధ్యక్షుడు పి.శ్రీకాంత్, కార్యదర్శి జి.భాస్కర్, నాయకులు దాస్, రాజేంద్రకుమార్, జి.జగదీశ్వర్, జాన్, నాగభూషణం, రామకృష్ణ, పాపిరెడ్డి, సదాత్ అలీ పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
Published Mon, Oct 27 2014 4:22 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement