anti-nationals
-
ఏబీవీపీ విద్యార్ధుల తిరంగా ర్యాలీ
-
జాతి వ్యతిరేకులకు అడ్డాగా జేయూ: బీజేపీ
కోల్‌కతా: జాదవపూర్ యూనివర్సిటీ(జేయూ) జాతి వ్యతిరేకులకు అడ్డాగా మారిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మండిపడింది. 'సీపీఎంకి చెందిన విద్యార్థులు చట్టవిరుద్ధంగా సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. వారి భావజాలానికి వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి చర్యలకైనా వామపక్ష విద్యార్థులు తెగిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. దీన్ని మేము ఖండిస్తున్నాం' అని పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ గోష్ అన్నారు. జేయూ వైస్ ఛాన్స్లర్ కూడా వారికి అండగా ఉంటున్నారని ఆరోపించారు. శుక్రవారం జేయూలో సినిమా షూటింగ్ వివాదం జరిగిన విషయం తెలిసిందే. జాదవపూర్ యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ మద్ధతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏబీవీపీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ మూవీ 'బుద్ధా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' వివాదాస్పదమైంది. జాదవపూర్ వర్సిటీలో శుక్రవారం రాత్రి ఈ డైరెక్టర్ కు నల్లజెండాలతో నిరసన తెలిపడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వామపక్ష వర్గానికి చెందినవారు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ మూవీ యూనిట్ కు మద్ధతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
'ద్రోహులు నశించాలనే హోమాలు'
న్యూఢిల్లీ: పట్టుమని పదిరోజులు సజావుగా క్లాసులు నడిచాయో లేదో జేఎన్ యూలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనబోతోంది. ఈ దఫా నెలకొనే ఉద్రిక్తతలకు కారణం దేశద్రోహమో మరో వివాదమోకాదు.. విద్యార్థి సంఘం ఎన్నికలు! ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టుడెంట్ యూనియన్(జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నకలు సెప్టెంబర్ లో జరగనుండగా కోలాహలం అప్పుడే మొదలైంది. ప్రస్తుత జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ తదితరులు జేఎన్ యూలో నిర్వహించిన అఫ్జల్ గురు సంస్మరణ సభతో చెలరేగిన వివాదం ఆ తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాతి ఎన్నికలు కీలకంగా మారాయి. సీపీఐ అనుబంధ ఎస్ఎఫ్ఐకి కంచుకోట అయిన జేఎన్ యూలో పాగావేసేందుకు పలు సంఘాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జేఎన్ యూఎస్ యూ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు హిందూ విద్యార్థి సేన (హెచ్ వీఎస్) బుధవారం వెల్లడిచేసింది. ఈ సందర్భంగా జేఎన్ యూ హెచ్ వీఎస్ అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ జాతివ్యతిరేక అల్లర్లతో వర్సిటీ అపవిత్రమైందని, పెద్ద ఎత్తున నిర్వహిస్తోన్న ప్రార్థనల ద్వారా వర్సిటీ పవిత్రతతను కాపాడుతున్నామని అన్నారు. 'పవిత్రత కోసం ప్రార్థనలు చేస్తున్నట్లే దేశద్రోహులు నశించాలని హోమాలు కూడా నిర్వహించాం. ఇక ముందు కూడా అలాంటి క్రతువులు చేస్తూనేఉంటాం'అని విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. సైద్ధాంతి విబేధాలు ఉన్నప్పటికీ తాము నిర్వహిస్తున్న ప్రార్థనలు, హోమాలను ఇతర సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, హెచ్ వీఎస్ కార్యక్రమాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో కీలకంగా భావించే నాలుగు పదవులకు (అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి) తీవ్రమైన పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో అధ్యక్ష స్థానంతోపాటు రెండు పదవులను ఎస్ఎఫ్ఐ గెలుచుకోగా, కార్యదర్శి పదవి ఏబీవీపీకి దక్కింది. -
'జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు అవ్వరు'
మథుర: రాజద్రోహం కేసులో అరెస్టయి రెండు రోజుల కింద విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఖండించారు. హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తనకు ఆదర్శమని చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ తప్పుబట్టారు. జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు కానే కాదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుమ్ మెమన్ ఉరితీతను వేముల రోహిత్ వ్యతిరేకించాడు. ఆ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేములను తనకు ఆదర్శప్రాయుడిగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఎలా ఎంచుకుంటాడన్నారు. రోహిత్ దారిలోనే కన్హయ్య నడిచాడు. అతడిలాగానే పార్లమెంట్ దాడులకు పాల్పడ్డ కేసులో నిందితుడు అఫ్జల్ గురు ఉరితీత అంశాన్ని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించాడని మంత్రి వీకే సింగ్ గుర్తుచేశారు. ఆరు నెలల తాత్కాలిక బెయిల్ పై కన్హయ్య కుమార్ విడుదలయ్యాక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వర్సిటీలో ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.