Anuradha Rao
-
జింకల అమ్మ
కొన్ని బిరుదులు కోరుకోకపోయినా వస్తాయి. అనురాధరావు(Anuradha Rao)కు ‘డీర్ ఉమన్’ బిరుదు అలా వచ్చిందే. ‘జింక కనిపిస్తే కచ్చితంగా వేటాడాల్సిందే’ అన్నట్లుగా ఉండే ఆ దీవుల ప్రజలలో మార్పు తెచ్చింది అనురాధ. ఆమెకు జింకలు జంతువులు కాదు. కుటుంబ సభ్యులు. వాటితో ఆడుతుంది,పాడుతుంది. కబుర్లు చెబుతుంది. మేత నుంచి సంరక్షణ వరకు అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ఆమె డీర్ ఉమెన్.అండమాన్ నికోబార్ దీవులలో ఉంటున్న అనురాధరావుకు జింకలతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఆ విశిష్ఠ అనుబంధమే ఆమెను ‘డీర్ ఉమెన్’(Deer Woman) అని పిలుచుకునేలా చేసింది. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు అనురాధ పూర్వీకుల్ని అండమాన్‌కు బందీలుగా తీసుకెళ్లారు. ఈ ద్వీపంలో ఆమె నాల్గవ తరం నివాసి.‘చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. బాల్యం నుంచి జింకలు అంటే ఇష్టం. అవి మా కుటుంబ సభ్యులలాగే భావించేదాన్ని. ఈ ద్వీపంలోని జింకలతో నాకు మంచి అనుబంధం ఉంది’ అంటుంది అనురాధ. ఆహారం ఇవ్వడం నుంచి సంరక్షణ వరకు జింకల పట్ల ఆమె ఎంతో చొరవ చూపుతుంది. జింకల గురించి ఆమె చూపుతున్న ప్రేమ మనుషులు, జంతువుల మధ్య పరస్పర నమ్మకాన్ని నెలకొల్పేలా ఉంది.‘ఒకప్పుడు మనుషులను చూడగానే జింకలు భయపడిపారిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాటి నమ్మకాన్ని చూరగొనడానికి చాలా ఓపికగా పనిచేశాను. వాటితో ఎంతో సమయం గడిపాను. వాటికి దగ్గరై వాటి మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్నాను’ అంటుంది అనురాధరావు. జింకల సంక్షేమం పట్ల ఆమె అంకితభావం ద్వీపంపై బలమైన ప్రభావాన్ని చూపించింది. జంతువుల పట్ల దయగల ద్వీపంగా అండమాన్‌ను మార్చివేసింది. -
‘అనాథాశ్రమాన్ని పోలీస్‌కమిషనరేట్‌గా మార్చొద్దు’
ఎన్నో ఏళ్లుగా ఆనాథలకు నీడ నిస్తున్న సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ అనాథ గృహాన్ని పోలీసు కమిషనరేట్‌గా మార్చాలన్న ఆలోచనను విరమించుకోవాలని బాలలహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధారావు పేర్కొన్నారు. నైజాం హయాంలో ఖానాగా పిలువబడే ఈ విక్టోరియా మెమోరియల్ సంస్థను అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ సందర్శించారని తెలిపారు. కోల్‌కతాలో ఉన్న విక్టోరియా మహల్ రూపంలో ఈ నిర్మాణం ఉండాలని ఆకాంక్షించిన ఆయన ప్రస్తుతం విక్టోరియా మెమోరియల్ హోంను నిర్మించి పిల్లలకు చెందేలా నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. విక్టోరియా మెమోరియల్ హోంలో మొత్తం 94ఎకరాలు ఉండగా మధ్యలో రహదారివెళ్లడం, మరి కొంత స్థలం అన్యాక్రాంతం కావడం, మరి కొంత స్థలం ప్రభుత్వాలే ప్రైై వేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంతో కేవలం 64ఎకరాల స్థలం మిగిలిందని ఆమె వివరించారు. దీనిని కూడా పిల్లలకు దక్కకుండా చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు ఇవ్వచూపడంపై బాలల హక్కుల సంఘం తరఫున తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ హోమ్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకే చెందాలని... ప్రభుత్వం కమిషనరేట్‌కు ఇవ్వాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఆందోళన చేపడుతామని ఆమె హెచ్చరించారు.