apex bank
-
పంటలకు రుణ పరిమితి...'వరి, పత్తికి ఎకరాకు రూ. 45 వేలు'
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) పెరిగింది. కొన్ని కొత్త రకాల పంటలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. రానున్న వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 123 రకాల పంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి 2022–23లో రూ.36 వేల నుంచి రూ.40 వేల పంట రుణాలను ఇవ్వగా ఈసారి రూ. 42 వేల నుంచి రూ. 45 వేలకు పెంచింది. అలాగే శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ. 36 వేల నుంచి రూ. 38 వేలుగా ఖరారు చేసింది. ఇక వరి విత్తనోత్పత్తికి కూడా రూ.5 వేలు అదనంగా పెంచింది. 2022–23లో రూ. 45 వేలుండగా, ఇప్పుడు రూ. 50 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ. 38 వేల నుంచి రూ. 40 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ. 42 వేల నుంచి రూ. 45 వేల వరకు పెంచింది. ఆయిల్‌పాంకు ఎకరానికి రూ. 42 వేల రుణం... ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఆయిల్‌పాం పంటలు సాగు చేసే రైతులకు రుణ పరిమితి ఖరారు చేసింది. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి కూడా అంతే ఖరారు చేసింది. ఇక కీలకమైన మిర్చికి రూ. 75 వేల నుంచి రూ. 80 వేల వరకు పెంచింది. సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రీయ పద్ధతిలో పండించే మినుముకు రూ. 18–21 వేలు ఖరారు చేశారు. శనగకు రూ. 24 నుంచి రూ. 26 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 30–34 వేలుగా, నీటి వసతి లేనిచోట రూ. 26–28 వేలు ఖరారైంది. కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ. 21–24 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 18–21 వేలు ఖరారు చేశారు. సోయాబీన్‌కు రూ. 26 వేల నుంచి రూ. 28 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 34 వేల నుంచి రూ. 36 వేల వరకు ఇస్తారు. ఉల్లి సాగుకు రూ.45 వేలు ఉల్లిగడ్డ సాగుకు గతంలో ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ. 40 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. పట్టుకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలుగా ఖరారు చేశారు. ఇక పత్తి విత్తనాన్ని సాగు చేసే రైతులకు గణనీయంగా పెంచారు. గతంలో రూ. 1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు రూ. 1.30 లక్షల నుంచి రూ. లక్షన్నరకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 80 వేల నుంచి రూ. 85 వేల వరకు ఇస్తారు. టస్సర్ కల్చర్ (ఒకరకమైన పట్టు) సాగుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తారు. -
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి జీతం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. ఈ మేరకు టెస్కాబ్ ఎం.డి డాక్టర్ నేతి మురళీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ వివిధ దేశాలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్ల వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ తీసుకొని సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వీలుకాని వారు దానికి గల కారణాలు తెలుపుతూ డాక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. టెస్కాబ్‌లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించామని, అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
తప్పుడు ఆధార్‌తో ఖాతా తెరిచి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ. 1,96,88,136 కాజేసిన కేసులో సుప్రియ ఎలిజబెత్ హెడింగ్ కీలక నిందితురాలని స్పష్టమవుతోంది. సికింద్రాబాద్‌లోని బ్రాంచ్‌లో ఖాతా తెరిచేందుకు ఆమె సమర్పించిన ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసినదిగా తేలింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న సుప్రియ కోసం గాలిస్తున్నారు. అపెక్స్ బ్యాంక్‌ను ఆన్లైన్లో దోచే యడానికి స్కెచ్ వేసిన సైబర్ నేరగాళ్లు ఈ నెల 2న సుప్రియ ఎలిజబెత్ అనే మహిళతో సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఖాతా తెరిపించారు. అందులో పద్మారావునగర్ అడ్రస్ పొందుపరుస్తూ తన ఆధార్‌కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా ఇచ్చింది. దీన్ని సరిగ్గా పరిశీలించ కుండానే బ్యాంకు అధికారులు ఆమోదించేశారు. కర్ణాటకకు చెందిన ఆధార్‌కార్డును స్కాన్ చేసి, అందులో ముందు వైపు సుప్రియ పేరు, వెనుక వైపు చిరునామా ఉండే చోట పద్మారావునగర్ను చేర్చి ప్రింటౌట్ తీసినట్లు పోలీసులు తేల్చారు. కాజేసిన డబ్బు పది బ్యాంకుల్లోకి తరలించి.. అపెక్స్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని 102 లావాదేవీల్లో కాజేశారు. కొన్ని రోజులపాటు ఈ బదిలీలు జరిగాయి. అయితే రోజూ బ్యాంక్ అధికారులు తీసే బ్యాలెన్స్ షీట్లో తేడాలు కనిపించకుండా హ్యాకర్‌గా వ్యవహరించిన నైజీరియన్ జాగ్రత్తలు తీసు కున్నారు. ఆ లావాదేవీలు బ్యాలెన్స్ షీట్లోకి రాకుండా డిలీట్ చేసేయడంతో బ్యాంకు అధికారులు గుర్తించలేకపోయారు. కాజేసిన మొత్తంలో రూ.1.94, 88,136 హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్సీ, కోటక్ బ్యాంకుల్లో ఉన్న 10 ఖాతాల్లోకి మళ్లించి విత్ డ్రా చేసేశారు. వీటిలో బెంగళూరు, ఎర్నాకుళంలోని ఖాతాలు సుప్రియ పేరుతో, ఢిల్లీ లోని ఖాతా ఆమె తండ్రిగా ఆధార్‌కార్డులో పొందుపరిచి ఉన్న జార్జ్ హెడింగ్ పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరితోపాటు నగరంలో ఉండి వెళ్లిన నైజీరియన్ విల్సన్ కోసమూ ముమ్మరంగా గాలిస్తున్నారు. -
‘అపెక్స్’ చైర్మన్ అరెస్ట్
మరో ఇద్దరిని కూడా 18కి పెరిగిన అరెస్ట్‌ల సంఖ్య డీసీసీ బ్యాంక్‌లో రూ. కోట్లు గోల్మాల్ వ్యవహారం వైద్య పరీక్షలకు తరలింపు శివమొగ్గ : డీసీసీ బ్యాంకు స్థానిక శాఖలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించి రాష్ర్ట అపెక్స్ బ్యాంకు చైర్మన్, శివమొగ్గ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు ఆర్ఎం. మంజునాథ గౌడను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీసీఐబీ (జిల్లా నేర పరిశోధన విభాగం) ఇన్స్పెక్టర్ జైరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనతో పాటు డీసీసీబీ చీఫ్ మేనేజర్ నాగభూషణరావు, ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న కుంసి గ్రామానికి చెందిన బసప్పలను కూడా అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి పెరిగింది. మంజునాథ గౌడ ఆరెస్టు శివమొగ్గ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర సహకార రంగంలో సంచలనాన్ని సృష్టించింది. నకిలీ బంగారు నగలను తాకట్టుగా పెట్టి స్థానిక డీసీసీబీ శాఖలో రూ.62 కోట్ల వరకు పలువురు రుణం తీసుకున్నారు. రుణ మంజూరు విధి విధానాలను కూడా పట్టించుకోలేదని దర్యాప్తులో వెల్లడైంది. గత నెల 17న స్థానిక శాఖలో రూ.2.79 కోట్ల మేరకు అవతవకలు జరిగాయని బ్యాంకు జనరల్ మేనేజర్ దొడ్డపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న సమయంలో భారీ కుంభకోణం బయట పడింది. మరింత లోతైన దర్యాప్తు కోసం ఇన్స్పెక్టర్ జైరాజ్ నాయకత్వంలో ప్రత్యేకృ బందాన్ని ఏర్పాటు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ప్రత్యేకృ బందం దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. కాగా ఈ కుంభకోణంలో మంజునాథ గౌడ ప్రత్యక్ష పాత్ర ఉందని, ఆయనపై మోసం, వంచన, బ్యాంకు విశ్వాసానికి ద్రోహం లాంటి ఆరోపణలపై ఐపీసీ 420, 406, 408, 409, 134 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ కౌశలేంద్ర కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు.