21న సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం
గొల్లగూడెం(ఉంగుటూరు): దేశంలోనే తొలిసారిగా కాలువ గట్టుపై గొల్లగూడెం పోలవరం గట్టు వద్ద ఏర్పాటు చేసిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ పథకం పూర్తయ్యింది. దీనిని ఈనెల 21న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ జెన్కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరావు, సలహాదారుడు జి.ఆదిశేషు తెలిపారు. పోలవరం గట్టుపై రూ.34 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయన్నారు. ఉత్పత్తిని గొల్లగూడెం 33 కేవీ విద్యుత్ సబ్‌సేష్టన్‌కు అనుసంధానం చేయనున్నారు. మంగళవారం సోలార్ పథకాన్ని వారు పరిశీలించారు. ట్రయిల్ రన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట సోలార్ ప్రాజెక్ట్ ఏఈ కొలగాని వీవీఎస్ మూర్తి, డీఈఈ కె.కోటేశ్వరారవు, ఏఈఈలు ఎం.రామకృష్ణ, బ్రహ్మానంద్, పోటాన్ సంస్థ ఎండీ గౌతం ఉన్నారు.