జర్నలిస్టుపై టీడీపీ నేత దౌర్జన్యం!
విశాఖపట్నం: విశాఖలో పచ్చ తమ్ముళ్లు దాష్టీకానికి పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో ఓ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగాడు. స్థానిక చెరువులో మట్టి తవ్వి అక్రమంగా ఇసుక రవాణా వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సాక్షి టీవీ ప్రతినిధి చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను చిత్రీకరించేందుకు యత్నించాడు.
ఆగ్రహించిన టీడీపీ నేత అప్పలనాయుడు తన భాగోతాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై దాడికి దిగి అతడ్ని గాయపరిచారు. తనపై టీడీపీ నేత అప్పలనాయుడు దాడికి పాల్పడ్డాడంటూ బాధిత విలేకరి గొలుగొండ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.