ప్రకృతి వ్యవసాయవిధానాలు ఆచరణలో రావాలి
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులు ఆచరించేలా చర్యలు తీసుకోవాలని జేసీ–2 ఖాజామొహిద్ధీన్, జేడీఏ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. స్థానిక టీటీడీసీ ఆవరణలోని సీఎల్ఆర్సీ హాలులో మంగళవారం జిల్లా స్థాయి ఎన్పీఎం శిక్షకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, తరచూ కరువు పరిస్థితులు ఏర్పడుతుండటంతో 'అనంత' లాంటి మెట్ట వ్యవసాయం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పెట్టుబడి లేని వ్యవసాయాన్ని (జెడ్బీఎన్ఎఫ్) విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి శిక్షకులు, ఎన్పీఎం విభాగం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎన్పీఎం డీపీఎం రవీంద్రారెడ్డి, టెక్నికల్ ఏవో లక్ష్మానాయక్, ఎన్పీఎం క్లస్టర్ రీసోర్స్పర్సన్లు, ఎన్జీఓలు పాల్గొన్నారు. బుధ, గురువారం కూడా శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.