22న ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈనెల 22న విడుదల కానున్నాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలను ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఫలితాలను http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in, www.sakshieducation.com వెబ్ సైట్ల ద్వారా పొందవచ్చు. కాగా ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈనెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫలితాలను పొందేందుకు మరిన్ని సదుపాయాలు :
విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌ఫోన్ ద్వారా 1100 (పరిష్కారం కాల్ సెంటర్) నెంబరుకు, మరే ఇతర ల్యాండ్‌ఫోన్/మొబైల్ ద్వారా అయినా 18004251110 నెంబరుకు ఫోన్ చేసి పొందవచ్చు.
అలాగే ఏపీ ఆన్లైన్ కేంద్రాలు, ఈసేవా/మీసేవా/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్ల్లోనూ పొందవచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా పొందాలంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇంటర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రూల్ నెంబరు టైప్ చేసి 53346 నెంబరుకు ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు.
ఏ నెట్వర్క్ వినియోగదారులైనా ఇంటర్మీడియట్ జనరల్ ఫలితాల కోసం ఐపీఈ2 అని టైప్ చేసి(క్యాపిటల్ లెటర్స్) స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నెంబరు టైప్ చేసి 54242 నెంబరు ఎస్ఎంఎస్ పంపించి పొందవచ్చు.
ఒకేషనల్ విద్యార్థులైతే ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నెంబరు టైప్ చేసి 54242 నెంబరుకు ఎస్ఎంఎస్ చేసి ఫలితాలను పొందవచ్చు.
ప్రిన్సిపాళ్లు తమ కళాశాలల వారీ ఫలితాలను http://bietelangana.cgg.gov.in అనే వెబ్సైట్లో తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఫలితాలను పొందవచ్చు.