April 28 th of 2017
-
బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా?
-
ఆ రోజు జవాబు తెలుస్తుంది!
మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస కట్టప్ప ‘బాహుబలి’ని ఎందుకు చంపాడు? ఎందుకు? ఎందుకు? అని డాల్బీ డీటీఎస్ సౌండ్‌లో ఎన్నిసార్లు అడిగినా దర్శకుడు రాజమౌళి సమాధానం చెప్పలేదు. సెకండ్ పార్ట్ విడుదల వరకూ వెయిట్ చేయమని చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే ఏడాది వేసవిలో అందరికీ తెలుస్తుంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రాన్ని హిందీలో డిస్ట్రిబ్యూషన్ చేసిందీయనే. అప్పట్లో ఆ చిత్రం విడుదల తేదీని కూడా కరణ్ జోహారే ప్రకటించారు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్.. ఇలా ఫస్ట్ పార్ట్‌లో నటించిన ప్రధాన పాత్రదారులందరూ సెకండ్ పార్ట్‌లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. -
బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా?
ముంబై: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకు ఎదురుచూడకతప్పదు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి 2 సినిమా ఆ రోజు విడుదల కానుంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రకటించారు. కాగా ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించాల్సివుంది. బాహుబలి మొదటి పార్ట్ హిందీ వర్షెన్‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్ జోహార్.. రెండో పార్ట్ బాహుబలి-ది కన్‌క్లూజన్ హిందీ వర్షెన్‌ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు. తన సంస్ధ ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మ్స్‌తో కలసి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి చేర్చిన బాహుబలి సినిమా రికార్డులు కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. రెండో పార్ట్‌లోనూ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నటిస్తున్నారు. బాహుబలి రెండో పార్ట్ పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. .@BaahubaliMovie The Conclusion releases on the 28th of April 2017 @arkamediaworks @Shobu_ #Prasad @dharmamovies — Karan Johar (@karanjohar) 5 August 2016 Dharma Productions and AA films are honored and proud to associate once again with the genius @ssrajamouli 's vision — Karan Johar (@karanjohar) 5 August 2016