
బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా?
ముంబై: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకు ఎదురుచూడకతప్పదు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి 2 సినిమా ఆ రోజు విడుదల కానుంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రకటించారు. కాగా ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించాల్సివుంది.
బాహుబలి మొదటి పార్ట్ హిందీ వర్షెన్ను డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్ జోహార్.. రెండో పార్ట్ బాహుబలి-ది కన్క్లూజన్ హిందీ వర్షెన్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు. తన సంస్ధ ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మ్స్తో కలసి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి చేర్చిన బాహుబలి సినిమా రికార్డులు కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. రెండో పార్ట్లోనూ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నటిస్తున్నారు. బాహుబలి రెండో పార్ట్ పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
.@BaahubaliMovie The Conclusion releases on the 28th of April 2017 @arkamediaworks @Shobu_ #Prasad @dharmamovies
— Karan Johar (@karanjohar) 5 August 2016
Dharma Productions and AA films are honored and proud to associate once again with the genius @ssrajamouli 's vision
— Karan Johar (@karanjohar) 5 August 2016