Aptitude Test
-
7, 10 తరగతులకు ‘ఈఈఎంటీ’ ప్రతిభా పరీక్ష
సాక్షి, అమరావతి: విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్) పరీక్ష తోడ్పడుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటీ షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతి విద్యార్థులకు గత 11 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఈ ఉచిత టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా ఈ పోటీలు ఉంటాయన్నారు. జనవరి 23న ప్రిలిమనరీ, 31న మెయిన్స్ పరీక్ష ‘కోడ్ తంత్ర’ సాఫ్ట్వేర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. 162 మంది విజేతలకు రూ.9 లక్షల బహుమతులు 7, 10 తరగతుల్లో డిసెంబర్ వరకు పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జిపై మరో 20 శాతం ప్రశ్నలు ఉంటాయి. కాగా, ఈ పోటీల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. మరో 1,752 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ప్రకటించారు. ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందిస్తారు. ఈ పరీక్షకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి.నభీ కోఆర్డినేటర్లుగాను, వి.ఎస్.సుబ్బారావు పరీక్షా కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.https:// educationalepiphany.org/eemt 2024/registration.php లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు https:// educationalepiphany.org/ వెబ్సైట్లో గాని, 96667 47996 నంబర్‌లోగాని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. గెలుపు మంత్రం!
ఏ కంపెనీ అయినా ముందుగా వందల మంది విద్యార్థుల నుంచి అనర్హులను వడపోయడానికి మొదట స్క్రీనింగ్ టెస్ట్/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ ఆధారంగా ఆయా కంపెనీలు తమకు అవసరమున్న ఖాళీల సంఖ్యకు 1:5 లేదా 1:6 నిష్పత్తిలో విద్యార్థులను తదుపరి దశల్లోకి అనుమతిస్తాయి. ప్రాంగణ నియామకాలైనా, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయినా.. చాలామంది వివిధ కారణాల వల్ల మొదటి దశ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను అధిగమించలేక పోతున్నారు. కాబట్టి ఇందులో రాణించాలంటే ఏయే అంశాలపై దృష్టి సారించాలి? ఏయే అంశాలపై ప్రశ్నలుంటాయో తెలుసుకుందాం.. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి చదివిన చదువుకూ, నేర్చుకున్న స్కిల్స్‌కు ఫలితం తేలే సమయం. ఇన్ని రోజులు కుస్తీపట్టిన పుస్తకాలు, అలవర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్‌తో కొలువుదీరే అవకాశం కల్పిస్తున్నాయి ప్రాంగణ నియమాకాలు. కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఆప్టిట్యూడ్ టెస్ట్/టెక్నికల్ ఇంటర్వ్యూ/హెచ్ఆర్ ఇంటర్వ్యూ/సిస్టమ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కంపెనీల ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో బృంద చర్చలు, జామ్ (జస్ట్ ఎ మినిట్) సెషన్స్ కూడా ఉంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లాంటి కంపెనీలైతే మరో అడుగు ముందుకేసి మేనేజీరియల్ రౌండ్ కూడా నిర్వహిస్తున్నాయి. కొన్ని సంస్థలు టెక్నికల్ దశలోనే రెండు మూడు రౌండ్లు జరుపుతున్నాయి. సాధారణంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ 45 నిమిషాలు లేదా గంట పాటు నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో టైమ్ అండ్ వర్క్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, సగటు, నంబర్ సిస్టమ్స్, నిష్పత్తులు, లాభనష్టాలు, ట్రైన్స్, లాగారిథమ్, కసాగు, గసాభా మొదలైన అంశాలపై ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితోపాటుగా వడ్డీలపై ప్రశ్నలు, భాగస్వామ్యం, ఎత్తు - దూరం తదితర అంశాలపై ప్రశ్నలడిగే అవకాశం ఉంది. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి బార్గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్టులు, నెట్ డయాగ్రమ్స్, ట్యాబులర్ డేటా ఇచ్చి సమస్యలు పరిష్కరించమని కోరుతున్నారు. లాజికల్ రీజనింగ్ ఈ విభాగం నుంచి కోడింగ్ డీకోడింగ్, డెరైక్షన్స్, క్లాక్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, లాజికల్ ప్రాబ్లమ్స్, క్యాలెండర్స్, క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్, అనాలజీస్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ తదితర విభాగాల్లో విద్యార్థుల ప్రతిభ పరీక్షిస్తారు. వెర్బల్ ఎబిలిటీ వోకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్, అనాలజీస్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్, గ్రామర్ కాన్సెప్ట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయానికి.. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు సదరు కంపెనీలు గతంలో నిర్వహించిన ప్రశ్నపత్రాలను సేకరించుకొని ప్రాక్టీస్ చేయాలి. వివిధ వెబ్సైట్లల్లో గత సంస్థలు నిర్వహించిన ప్రశ్నపత్రాలను పొందొచ్చు. పరీక్ష విధానం, దానికి కేటాయించే సమయం కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము హాజరు కాబోయే కంపెనీ అనుసరించే పరీక్ష విధానాన్ని ముందుగానే తెలుసుకోవాలి. థర్డ్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఇప్పటి నుంచే ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. సమస్యను సాధించడం, పజిల్ టెస్టులకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలేజీలో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ (సీఆర్టీ) తరగతులకు తప్పనిసరిగా హాజరవ్వాలి. సందేహాలు వస్తే ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలి. సమయపరిమితిని నిర్దేశించుకుని ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి సమాధానాలు గుర్తించడం సులువనేది నిపుణుల సూచన. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లను జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానాన్ని గుర్తించవచ్చు. రిఫరెన్స్ బుక్స్ ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్ ఎబిలిటీ, నాన్ వెర్బల్), వొకాబులరీ కోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ - నార్మన్ లూయీస్, జీఆర్ఈ బారోన్స్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. -
ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో భారీ మార్పులు
కేంద్రానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ♦ 2017 తర్వాతే మార్పులను అమలు చేయాలి ♦ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ల కోసం ఎన్టీఎస్ ఏర్పాటు ♦ పాత పద్ధతిలోనే జేఈఈ-2016 పరీక్ష న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల ప్రక్రియలో భారీ మార్పులు చేయాలని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నాలుగు లక్షల మంది విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేసే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) పరీక్ష కోసం ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఎన్టీఎస్)ను ఏర్పాటు చేయాలని సూచించింది. జేఈఈ పరీక్షల ప్రక్రియలో మార్పులను 2017 తర్వాతే చేపట్టాలని సూచించింది. కాగా, 2016 జేఈఈ పరీక్ష 2015లో మాదిరిగానే జరగనుంది. అయితే జేఈఈ(అడ్వాన్స్డ్) స్టేజ్‌లో పోటీపడేవారి సంఖ్యను 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచింది. ఈ మేరకు ప్రొఫెసర్ అశోక్ మిశ్రా నేతృత్వంలోని ఎమినెంట్ పర్సన్స్ కమిటీ(సీఈపీ) గత వారంలో తమ నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఐఐటీల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడకుండా ఉండేందుకుగానూ పలు కీలక మార్పులు చేయాలని సూచించింది. కమిటీ సిఫార్సుల ప్రకారం.. 2016 ప్రారంభంలో ఎన్టీఎస్ను ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనా సామర్థ్యం పరీక్షించేందుకు ఎన్టీఎస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు ఏడాదికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా జేఈఈ పరీక్షల్లో సుమారు నాలుగు లక్షల మందిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. జేఈఈ(అడ్వాన్స్డ్) మాదిరిగానే ఐఐటీలే నిర్వహించే ఈ పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వీటి ఆధారంగా కామన్ కౌన్సెలింగ్‌లో ఐఐటీల్లోని 40 వేలకుపైగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకుగానూ విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. విద్యార్థులను కోచింగ్ సెంటర్ల నుంచి బయటకు రప్పించేం దుకుగానూ ఐఐటీలు మాక్ జేఈఈ పరీక్షలకు నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కూడా కమిటీ సూచించింది. అలాగే ఈ ఏడాది ఎన్ఐటీలు, సీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం ఇచ్చే ర్యాంకుల్లో బోర్డు మార్కులను పరిగణనలోకి తీసుకోవద్దని మరో కీలక సూచన చేసింది. కాగా, కమిటీ సిఫార్సులపై విస్తృత సంప్రదింపుల నిమిత్తం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. -
మే మూడున గీతం బీబీఏ ఆప్టిట్యూడ్ టెస్ట్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ-ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి మే మూడో తేదీన ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు గీతం మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.శివరామకృష్ణ తెలిపారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు మూడేళ్ల బీబీఎం (ఆనర్స్) కోర్సులో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. బీబీఎం కోర్సులో అంతర్భాగంగా చార్టర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ (సీమా) కోర్సును అందిస్తున్నామని వివరించారు. సీమా అకడమిక్ రిలేషన్స్ జాతీయ అధిపతి అయ్యన్ మహాపాత్రా మాట్లాడుతూ సీమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వృత్తి నిపుణుల సంస్థ అని, ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 177కు పైగా దేశాల్లో గుర్తింపు పొందిన సీమా కోర్సులో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో 4,500 కార్పొరేట్, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీమా కోర్సును అందిస్తుండగా రాష్ట్రంలో గీతం విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజమెంట్ అడ్మిషన్స్ చైర్పర్సన్ డాక్టర్ కేపీ కిషన్ మాట్లాడుతూ బీబీఏ (ఆనర్స్) ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు www.g-it-am.-ed-u/gim లో దరఖాస్తు చేయాలని సూచించారు. -
సివిల్స్ విజయానికి కీలకం.. ఆప్టిట్యూడ్ టెస్ట్
సీశాట్ పేపర్-2 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు ఇస్తారు. ఇందుకు కేటాయించిన మొత్తం మార్కులు 200. ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి 2 గంటల సమయం కేటాయించారు. అంటే ప్రతి ప్రశ్నకు 90 సెకన్ల సమయం లభిస్తుంది. ముందుగా: సివిల్స్ ఆశాహహులు ముందుగా పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)పై దృష్టి పెడితే సమయం, ఫలితం పరంగా ఆశాజనకంగా ఉంటుంది. కారణం ఆప్టిట్యూడ్ టెస్ట్ సిలబస్‌లోని అంశాలు నిర్దిష్టంగా ఉండటమే. ప్రతి రోజూ పేపర్-2కు నాలుగైదు గంటల సమయం కేటాయించాలి. మిగతా సమయాన్ని జనరల్ స్టడీస్‌కు వినియోగించాలి. అనుకూలమనే వాదన! ప్రిలిమ్స్ రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విషయంలో టెక్నికల్, మ్యాథ్స్ నేపథ్యం వారికి అనుకూలమనే భావన ఉంది. కానీ గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఇవన్నీ అపోహలే. కాంప్రెహన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ అంశాలతో ఉండే ఈ పేపర్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ మాత్రమే మ్యాథ్స్ సంబంధం. అవి కూడా ప్యూర్ మ్యాథ్స్ కాకుండా పదో తరగతి స్థాయిలో అర్థమెటిక్, న్యూమరికల్ స్కిల్స్ ఉన్న ప్రతి విద్యార్థి సాధించే విధంగానే ఉన్నాయి. అంతేకాకుండా వాటి ప్రశ్నల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. నిరంతర ప్రాక్టీస్: రెండో పేపర్లో ఎక్కువ వెయిటేజీ లభిస్తున్న విభాగాలు కాంప్రహెన్షన్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇంగ్లిష్ వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్, సమయస్ఫూర్తి వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్ కోసం నిరంతరం ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలు, వాటిలో వ్యాసాలు, వాక్య నిర్మాణా లు, వినియోగించిన పదాలు గుర్తించి, వీలైతే సొంతంగా సారాంశాన్ని రాసుకోవడం మేలు చేస్తుంది. కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్‌కు సంబంధించి అడిగే ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ప్రశ్న లోని కీలక పదాన్ని గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీనికి మార్గం నిరంతర ప్రాక్టీసే. ఈ క్రమంలో విభాగాల వారీగా ప్రిపరేషన్ క్రమం.. రీడింగ్ కాంప్రెహెన్షన్: రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. 2011లో 27 ప్రశ్నలు, 2012లో 32 ప్రశ్నలు, 2013లో 23 ప్రశ్నలు ఇచ్చారు. అంటే దాదాపుగా 23 నుంచి 30 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. ఇందులో ఇచ్చిన పేరాగ్రాఫ్ ఆధారంగా సమాధానాలను గుర్తించాలి. కొద్దిపాటి సాధనతో ఇందులో మెరుగైన మార్కులు స్కోర్ చేయవచ్చు. ముందుగా పేరాగ్రాఫ్ చదివి, వాటికి సమాధానాలు వెతకడం వల్ల ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. అలా కాకుండా ముందుగా ప్రశ్నలు చదివి, వాటిని గుర్తుంచుకొని..పేరాగ్రాఫ్ చదువుతూ సమాధానాలను కనుక్కోవడం ఉత్తమం. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ఇచ్చిన అంశాన్ని వేగంగా చదవగలగాలి. చదివేటప్పుడే అంశాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. చదివేటప్పుడు కొంత మంది ప్రతి పదానికి మధ్య స్వల్ప విరామం తీసుకుంటారు. మరికొందరు ప్రతి రెండు పదాలకు విరామం తీసుకుంటారు. అలా కాకుండా, విరామం లేకుండా ఒక లైను చదివే విధంగా సాధన చేయాలి. తద్వారా ఈ విభాగాన్ని స్వల్ప సమయంలో పూర్తి చేసే వీలుంటుంది. ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రశ్నలు కూడా చాలా సులువుగానే ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన వస్తుంది. అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్: అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి దాదాపు 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రీజనింగ్ అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని తెలుపుతుంది. క్లిష్ట సమయాల్లో అభ్యర్థి ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకోగలరో తెలుసుకోవడానికి ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా సిల్లాయిజమ్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. సిల్లాయిజమ్లో రెండు గాని అంతకంటే ఎక్కువ గాని స్టేట్మెంట్స్ ఇస్తారు. అవి సత్యం కావచ్చు, కాకపోవచ్చు. అయినప్పటికీ వాటిని సత్యంగానే భావించి తర్వాత ఇచ్చిన వాటిలో ఏది సరైందో కనుక్కోవాలి. ఇచ్చిన అంశాలనే జాగ్రత్తగా పరిశీలిస్తే అందులోనే సమాధానాలు కనిపిస్తాయి. ఈ అంశం నుంచి గతంలో వచ్చిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే.. Consider the following statements . All machines consume energy . Electricity provides energy . Electricity operated machines are cheap to maintain . Electricity operated machines do not cause pollution Which of the following inferences can be drawn from the above statements?) All machines are run by electric energy) There is no form of energy other than electricity) Most machines are operated on electric energy) Electricity operated machines are preferable to use సరైన సమాధానం: d డెసిషన్ మేకింగ్: డెసిషన్ మేకింగ్ నుంచి 6 లేదా 7 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సందర్భం ఇచ్చి.. ఆ సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించే సందర్భంలో న్యాయబద్ధంగా ఉన్న వాటికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ విభాగానికి సమాధానం ఇచ్చే క్రమంలో.. ప్రశ్నలో ఇచ్చిన విషయంపై అవగాహన కలిగి ఉండాలి. దాని ప్రాముఖ్యత ఏమిటి? అది అతి ముఖ్యమైన విషయమా? కాదా? అత్యవసరమైన విషయమా కాదా? లేదా రెండూనా?వీటికి సంబంధించి ఏ సమాచారం అందుబాటులో ఉంది?ఇచ్చిన సమస్యకు సంబంధించి అనుకూలమైన అంశాలు ఏమేమి ఉన్నాయి? ప్రతి అనుకూల అంశానికి మెరిట్స్, డీమెరిట్స్ పరిశీలించి వీటి ఆధారంగా సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిత్యజీవితంలో ఎదురయ్యే ఏదో ఒక సమస్య ఇచ్చి, ఆ సందర్భంలో మీరు (అభ్యర్థి) ఉంటే ఏం చేస్తారని అడిగి, నాలుగు ఆప్షన్స ఇస్తారు. అవి నాలుగు కూడా సరైన సమాధానాలుగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు అందులో బెస్ట్‌గా ఉన్న సమాధానాన్ని ఎన్నుకోవాలి. బేసిక్ న్యూమరసీ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ: బేసిక్ న్యూమరసీ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి దాదాపు 25 నుంచి 30 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో బేసిక్ న్యూమరసీ అంటే 10వ తరగతిలోపు గణిత శాస్త్రంలో ఉన్న అంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. దీనికోసం ప్రాథమిక సంఖ్యావాదం, భాజనీయత సూత్రాలు, 35 వరకు వర్గాలు, 15 వరకు ఘనాలు, కాలం-దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, లాభం-నష్టం, భాగస్వామ్యం, సాధారణ వడ్డీ (బారు వడ్డీ), చక్రవడ్డీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వీటికోసం ముందుగా హైస్కూల్ గణితంలోని సూత్రాలను, ప్రాథమిక భావనలను అవగాహన చేసుకోవాలి. తర్వాత వాటి ఆధారంగా సమస్యలను సాధించే ప్రయత్నం చేయాలి. ఈ విభాగం కోసం బ్యాంక్ పీఓ ప్రీవీయస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్: డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి కనీసం రెండు లేదా మూడు ప్రశ్నలు రావచ్చు. ఇందులో ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, ఎక్స్-వై చార్ట్స్, పై చార్ట్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఇచ్చిన సమాచారాన్ని వీలైనంత వేగంగా అవగాహన చేసుకోవాలి. ఈ విభాగం కోసం బ్యాంక్ పీఓ ప్రీవీయస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ: జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది అకాడమీ పుస్తకాల్లో లేని కొత్త అంశం. ఇందులో పజిల్స్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు రక్త సంబంధాలు, దిక్కులు, సీటింగ్ అరేంజ్మెంట్స్ మొదలగు అంశాలను నేర్చుకోవాలి. ఈ విభాగం కోసం ఆర్ఎస్ అగర్వాల్ రాసిన అ కౌఛ్ఛీట అఞఞట్చౌఛిజి ౌ్ట గ్ఛటఛ్చ ఖ్ఛ్చటౌజీజ పుస్తకం చదవాలి. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్: ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించాలనుకుంటున్న ప్రతి అభ్యర్థికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవి. అయితే గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడం గమనార్హం. పాత ప్రశ్న పత్రాలు.. గెలుపు సాధనాలు: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశ్నల తీరులో గత రెండేళ్లుగా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. అభ్యర్థులు గత పదేళ్ల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపయుక్తం. దీనివల్ల ఒక నిర్దిష్ట అంశంపై ప్రశ్నలు అడిగే తీరులో మార్పులు, ఎన్ని కోణాల్లో సదరు అంశం నుంచి ప్రశ్నలు అడగొచ్చు వంటి విషయాల్లో అవగాహన ఏర్పడి.. ప్రిపరేషన్‌ను సరైన గాడిలో నడిపించడానికి వీలవుతుంది. సంవత్సరాల వారీగా వచ్చిన ప్రశ్నలు విభాగం ప్రశ్నల సంఖ్య 2012 2013 Comprehension 32 23 Decision making and problem solving 7 6 Logical reasoning and analytical ability 14 24 General mental ability