సీశాట్ పేపర్-2 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు ఇస్తారు. ఇందుకు కేటాయించిన మొత్తం మార్కులు 200. ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి 2 గంటల సమయం కేటాయించారు. అంటే ప్రతి ప్రశ్నకు 90 సెకన్ల సమయం లభిస్తుంది.
ముందుగా:
సివిల్స్ ఆశాహహులు ముందుగా పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)పై దృష్టి పెడితే సమయం, ఫలితం పరంగా ఆశాజనకంగా ఉంటుంది. కారణం ఆప్టిట్యూడ్ టెస్ట్ సిలబస్‌లోని అంశాలు నిర్దిష్టంగా ఉండటమే. ప్రతి రోజూ పేపర్-2కు నాలుగైదు గంటల సమయం కేటాయించాలి. మిగతా సమయాన్ని జనరల్ స్టడీస్‌కు వినియోగించాలి.
అనుకూలమనే వాదన!
ప్రిలిమ్స్ రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విషయంలో టెక్నికల్, మ్యాథ్స్ నేపథ్యం వారికి అనుకూలమనే భావన ఉంది. కానీ గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఇవన్నీ అపోహలే. కాంప్రెహన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ అంశాలతో ఉండే ఈ పేపర్‌లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ మాత్రమే మ్యాథ్స్ సంబంధం. అవి కూడా ప్యూర్ మ్యాథ్స్ కాకుండా పదో తరగతి స్థాయిలో అర్థమెటిక్, న్యూమరికల్ స్కిల్స్ ఉన్న ప్రతి విద్యార్థి సాధించే విధంగానే ఉన్నాయి. అంతేకాకుండా వాటి ప్రశ్నల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది.
నిరంతర ప్రాక్టీస్:
రెండో పేపర్‌లో ఎక్కువ వెయిటేజీ లభిస్తున్న విభాగాలు కాంప్రహెన్షన్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇంగ్లిష్ వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్, సమయస్ఫూర్తి వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్ కోసం నిరంతరం ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలు, వాటిలో వ్యాసాలు, వాక్య నిర్మాణా లు, వినియోగించిన పదాలు గుర్తించి, వీలైతే సొంతంగా సారాంశాన్ని రాసుకోవడం మేలు చేస్తుంది. కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్‌కు సంబంధించి అడిగే ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ప్రశ్న
లోని కీలక పదాన్ని గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీనికి మార్గం నిరంతర ప్రాక్టీసే. ఈ క్రమంలో విభాగాల వారీగా ప్రిపరేషన్ క్రమం..
రీడింగ్ కాంప్రెహెన్షన్:
రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. 2011లో 27 ప్రశ్నలు, 2012లో 32 ప్రశ్నలు, 2013లో 23 ప్రశ్నలు ఇచ్చారు. అంటే దాదాపుగా 23 నుంచి 30 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. ఇందులో ఇచ్చిన పేరాగ్రాఫ్ ఆధారంగా సమాధానాలను గుర్తించాలి. కొద్దిపాటి సాధనతో ఇందులో మెరుగైన మార్కులు స్కోర్ చేయవచ్చు. ముందుగా పేరాగ్రాఫ్ చదివి, వాటికి సమాధానాలు వెతకడం వల్ల ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. అలా కాకుండా ముందుగా ప్రశ్నలు చదివి, వాటిని గుర్తుంచుకొని..పేరాగ్రాఫ్ చదువుతూ సమాధానాలను కనుక్కోవడం ఉత్తమం. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ఇచ్చిన అంశాన్ని వేగంగా చదవగలగాలి. చదివేటప్పుడే అంశాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. చదివేటప్పుడు కొంత మంది ప్రతి పదానికి మధ్య స్వల్ప విరామం తీసుకుంటారు. మరికొందరు ప్రతి రెండు పదాలకు విరామం తీసుకుంటారు. అలా కాకుండా, విరామం లేకుండా ఒక లైను చదివే విధంగా సాధన చేయాలి. తద్వారా ఈ విభాగాన్ని స్వల్ప సమయంలో పూర్తి చేసే వీలుంటుంది. ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రశ్నలు కూడా చాలా సులువుగానే ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన వస్తుంది.
అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్:
అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి దాదాపు 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రీజనింగ్ అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని తెలుపుతుంది. క్లిష్ట సమయాల్లో అభ్యర్థి ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకోగలరో తెలుసుకోవడానికి ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా సిల్లాయిజమ్, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. సిల్లాయిజమ్‌లో రెండు గాని అంతకంటే ఎక్కువ గాని స్టేట్‌మెంట్స్ ఇస్తారు. అవి సత్యం కావచ్చు, కాకపోవచ్చు. అయినప్పటికీ వాటిని సత్యంగానే భావించి తర్వాత ఇచ్చిన వాటిలో ఏది సరైందో కనుక్కోవాలి. ఇచ్చిన అంశాలనే జాగ్రత్తగా పరిశీలిస్తే అందులోనే సమాధానాలు కనిపిస్తాయి. ఈ అంశం నుంచి గతంలో వచ్చిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే..
Consider the following statements
. All machines consume energy
. Electricity provides energy
. Electricity operated machines are cheap to maintain
. Electricity operated machines do not cause pollution
Which of the following inferences can be drawn from the above statements?) All machines are run by electric energy) There is no form of energy other than electricity) Most machines are operated on electric energy) Electricity operated machines are preferable to use
సరైన సమాధానం: d
డెసిషన్ మేకింగ్:
డెసిషన్ మేకింగ్ నుంచి 6 లేదా 7 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సందర్భం ఇచ్చి.. ఆ సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించే సందర్భంలో న్యాయబద్ధంగా ఉన్న వాటికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ విభాగానికి సమాధానం ఇచ్చే క్రమంలో.. ప్రశ్నలో ఇచ్చిన విషయంపై అవగాహన కలిగి ఉండాలి. దాని ప్రాముఖ్యత ఏమిటి? అది అతి ముఖ్యమైన విషయమా? కాదా? అత్యవసరమైన విషయమా కాదా? లేదా రెండూనా?వీటికి సంబంధించి ఏ సమాచారం అందుబాటులో ఉంది?ఇచ్చిన సమస్యకు సంబంధించి అనుకూలమైన అంశాలు ఏమేమి ఉన్నాయి? ప్రతి అనుకూల అంశానికి మెరిట్స్, డీమెరిట్స్ పరిశీలించి వీటి ఆధారంగా సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిత్యజీవితంలో ఎదురయ్యే ఏదో ఒక సమస్య ఇచ్చి, ఆ సందర్భంలో మీరు (అభ్యర్థి) ఉంటే ఏం చేస్తారని అడిగి, నాలుగు ఆప్షన్‌స ఇస్తారు. అవి నాలుగు కూడా సరైన సమాధానాలుగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు అందులో బెస్ట్‌గా ఉన్న సమాధానాన్ని ఎన్నుకోవాలి.
బేసిక్ న్యూమరసీ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ:
బేసిక్ న్యూమరసీ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి దాదాపు 25 నుంచి 30 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో బేసిక్ న్యూమరసీ అంటే 10వ తరగతిలోపు గణిత శాస్త్రంలో ఉన్న అంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. దీనికోసం ప్రాథమిక సంఖ్యావాదం, భాజనీయత సూత్రాలు, 35 వరకు వర్గాలు, 15 వరకు ఘనాలు, కాలం-దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, లాభం-నష్టం, భాగస్వామ్యం, సాధారణ వడ్డీ (బారు వడ్డీ), చక్రవడ్డీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వీటికోసం ముందుగా హైస్కూల్ గణితంలోని సూత్రాలను, ప్రాథమిక భావనలను అవగాహన చేసుకోవాలి. తర్వాత వాటి ఆధారంగా సమస్యలను సాధించే ప్రయత్నం చేయాలి. ఈ విభాగం కోసం బ్యాంక్ పీఓ ప్రీవీయస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
డేటా ఇంటర్‌ప్రిటేషన్:
డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి కనీసం రెండు లేదా మూడు ప్రశ్నలు రావచ్చు. ఇందులో ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, ఎక్స్-వై చార్ట్స్, పై చార్ట్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఇచ్చిన సమాచారాన్ని వీలైనంత వేగంగా అవగాహన చేసుకోవాలి. ఈ విభాగం కోసం బ్యాంక్ పీఓ ప్రీవీయస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
జనరల్ మెంటల్ ఎబిలిటీ:
జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది అకాడమీ పుస్తకాల్లో లేని కొత్త అంశం. ఇందులో పజిల్స్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు రక్త సంబంధాలు, దిక్కులు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ మొదలగు అంశాలను నేర్చుకోవాలి. ఈ విభాగం కోసం ఆర్‌ఎస్ అగర్వాల్ రాసిన అ కౌఛ్ఛీట అఞఞట్చౌఛిజి ౌ్ట గ్ఛటఛ్చ ఖ్ఛ్చటౌజీజ పుస్తకం చదవాలి.
ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్‌క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్:
ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించాలనుకుంటున్న ప్రతి అభ్యర్థికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవి. అయితే గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడం గమనార్హం.
పాత ప్రశ్న పత్రాలు.. గెలుపు సాధనాలు:
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశ్నల తీరులో గత రెండేళ్లుగా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. అభ్యర్థులు గత పదేళ్ల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపయుక్తం. దీనివల్ల ఒక నిర్దిష్ట అంశంపై ప్రశ్నలు అడిగే తీరులో మార్పులు, ఎన్ని కోణాల్లో సదరు అంశం నుంచి ప్రశ్నలు అడగొచ్చు వంటి విషయాల్లో అవగాహన ఏర్పడి.. ప్రిపరేషన్‌ను సరైన గాడిలో నడిపించడానికి వీలవుతుంది.
సంవత్సరాల వారీగా వచ్చిన ప్రశ్నలు
విభాగం ప్రశ్నల సంఖ్య
2012 2013
Comprehension 32 23
Decision making and
problem solving 7 6
Logical reasoning and
analytical ability 14 24
General mental ability