Arabs
-
ఇజ్రాయెల్ X పాలస్తీనా వందేళ్ల కుంపటి..!
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్‌కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూరీ్వకులకు చెందిన ప్రాంతమని తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్బులు అదే తమ మాతృభూమి అని దానిని వదల్లేమని కరాఖండీగా చెబుతూ వచ్చారు. 1920–40 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యూరప్‌లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదులు సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆరంభమైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు యూదులు, అరబ్బుల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇచ్చి జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఇజ్రాయెల్ ఆవిర్భావంతో యుద్ధవాతావరణం ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. దీంతో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకంచడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోయారు. అప్పట్నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. హమాస్ ఏర్పాటుతో సంక్షోభం 1987లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ హమాస్ సంస్థ ఆవిర్భావం తర్వాత సంక్షోభం మరింత ముదిరింది. పాలస్తీనాకు చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించిన హమాస్ తొలుత రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. 2000 సంవత్సరంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతల నివారణకు క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనియన్లకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం గాజా సిటీ హమాస్ ఆ«దీనంలో ఉంది. వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ అ«దీనంలో ఉండడంతో తరచూ ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో మరోసారి ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలవంతంకాలేదు. దీంతో సమస్య అలాగే ఉండిపోయింది. కొలిక్కి రాని సమస్యలివే..! ఇజ్రాయెల్ జెరూసలేం మొత్తాన్ని తన రాజధానిగా ప్రకటించుకుంటే, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను తమ భవిష్యత్ రాజధానిగా ప్రకటించుకున్నారు. ► 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగినప్పటికీ ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే చూస్తోంది. ► వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం ఇప్పటికి ఇంకా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉంది. ► ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ మారాయి. ► వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనల్ని తోసిరాజని ఎన్నో అక్రమ కట్టడాలను నిర్మించింది. వాటిని తొలగించే అంశంలో వివాదం నెలకొంది. ► పాలస్తీనా శరణార్థుల భవిష్యత్‌పై ఆందోళనలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం'
ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఏడు నగరాల్లోకెల్లా అత్యధిక జనసాంద్రత గల నగరం దుబాయ్. అద్భుతమైన నిర్మాణ కౌశలానికి ఇది మారుపేరు. దుబాయ్ అంటే చప్పున గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా (భమ్మీద అత్యంత ఎత్తయిన 830 మీటర్ల భవనం) వంటి ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన జీవనశైలే తప్ప.. వ్యవసాయం అసలు కాదు. అయితే, అది పాత సంగతి. ఇప్పుడు దుబాయ్ సిగలో ‘రూఫ్‌టాప్ సేద్యం’ తళుక్కుమంటోంది. పచ్చదనం, పర్యావరణ హితమైన జీవనం వైపు ఈ ప్రత్యేక ఉద్యమం దుబాయ్ పట్టణ వాతావరణాన్ని క్రమంగా పునర్నిర్మిస్తోంది. కాంక్రీటు అరణ్యానికి ఆకుపచ్చని సొబగులు అద్దుతోంది. ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలను భవనాల పైకప్పులపైనే నగరవాసులు పండించుకుంటున్నారు. అర్బన్ అగ్రికల్చర్ భావన అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆకుపచ్చని పంటలతో నిండిన సుస్థిరమైన జీవనాకాంక్షను నెరవేర్చటం, వీలైనంత వరకు ఆహార భద్రతకు తోడ్పడడంతో పాటు.. నగరపు రొద మధ్యలో మనోల్లాస వాతావరణాన్ని కల్పిస్తోంది. రఫ్‌టాప్ కిచెన్ గార్డెనింగ్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. ఇంటిపైన ఆహారాన్ని పండించుకునే సదుపాయాన్ని కల్పించే భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసమే వెతుకుతున్నారంటే ఆశ్చర్యం లేదు! తీవ్రమైన ఎడారి వాతావరణం కారణంగా యూఏఈ.. ఆహారం మొత్తాన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తామరతంపరగా విస్తరిస్తున్న మిద్దె తోటల వల్ల ఆహార దిగుమతి కొంతమేరకైనా తగ్గే అవకాశం కనపడుతోంది. ఈ ట్రెండ్ వెనుక.. పర్యావరణానికి మేలు చేసే పనులను ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్త విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. 2050 నాటికి సుస్థిర జీవనం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా మారాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో యూఏఈ ముందడుగేస్తోంది. ఆహారాన్ని స్థానికంగా పండించుకోవటం, కాంక్రీటు భవనాల ద్వారా విడుదలయ్యే వేడిని తగ్గించుకోవడం వంటి పనులకు లభిస్తున్న ప్రభుత్వ తోడ్పాటుతో దుబాయ్ వాసుల్లో మిద్దె తోటలపై అవగాహన, ఆసక్తి నానాటికీ ఇనుమడిస్తోంది. రఫ్‌టాప్ సేద్యం అంటే కేవలం పరిసరాలను పచ్చగా వర్చడం లేదా పంటలు పండించడం మాత్రమే కాదు. నలుగురూ కలసికట్టుగా పనిచేసే సంస్కృతికి నారు పొయ్యటం కూడా. నగరవాసులు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని దుబాయ్ వాసులు సంతోషపడుతున్నారు. ఎడారిలో సాధ్యమేనా? ఎడారి పరిస్థితులు ఉన్నప్పటికీ మిద్దెపైన ప్రత్యేక నిర్మాణాల ద్వారా కూరగాయలు, ఔషధ మొక్కలు సాగు చేసుకునేందుకు హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ వంటి అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు దోహదం చేస్తున్నాయి. తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు.. పాలకూర, చార్డ్, లెట్యూస్ వంటి పంటలను సులభంగా పండిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఈ పద్ధతులతో పోల్చితే అతి తక్కువ నీరే ఖర్చవుతోంది. నీటి కొరత పెద్ద సమస్యగా ఉన్న దుబాయ్ వంటి ప్రాంతంలో ఈ సాగు పద్ధతులు ఉపయోగకరం. నివాస భవనాలపై ప్రత్యేక శ్రద్ధతో రఫ్గార్డెన్లు నిర్మిస్తున్నందు వల్ల ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ను తగ్గించడంలో తోడ్పడుతోంది. శీతలీకరణ అవసరాలు తగ్గుతున్నాయని భవన నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. సొంత రఫ్‌టాప్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారికి వర్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘రియల్’ ఆకర్షణ... నూతన సాంకేతిక ఆవిష్కరణలు, భవన నిర్మాణంలో జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ మద్దతు, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర జీవనశైలిపై పెరుగుతున్న సామాజిక అవగాహన.. దుబాయ్‌లో రఫ్‌టాప్ ఫార్మింగ్ విస్తరణకు దోహదపడుతున్నాయి. దీని వల్ల పట్టణ జీవవైవిధ్యం మెరుగుపడుతుంది. కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతోంది. రఫ్‌టాప్ ఫార్మింగ్ సదుపాయాన్ని జోడించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పర్యావరణ స్పృహతో ఉన్న కొనుగోలుదారులను, ఆరోగ్యకరమైన జీవనానికి విలువనిచ్చే అద్దెదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ కేవలం రెసిడెన్షియల్ భవనాలకే పరిమితం కాలేదు. వాణిజ్య భవనాలపై కప్పులపై కూడా పంటల సాగు ఏర్పాట్లు నిర్మించటం సామాజిక బాధ్యతగా బిల్డర్లు భావిస్తున్నారు. ఇది సానుకల ప్రభావాన్ని కలిగిస్తోంది. స్మార్ట్ ఇరిగేషన్, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ ద్వారా రఫ్‌టాప్ ఫార్మింగ్ మెరుగైన ఫలితాలను ఇవ్వడమే కాక, నేర్చుకునే వారికి ఆకర్షణీయంగా వరింది. విలాసాలను త్యాగం చేయకుండా నగరాలు ఆహార స్వావలంబన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎలా స్వీకరించవచ్చో చెప్పడానికి దుబాయ్‌లో పెరుగుతున్న మిద్దె తోటల ధోరణి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. (చదవండి: 14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం) -
‘విధి’ క్రీడలో ఓ సౌజన్యమూర్తి!
నిజాం హయాంలో ఆత్మసాక్షిగా విధినిర్వహణ చేసిన అరుదైన వ్యక్తుల్లో మెహదీ అలీ ఒకరు. అలీగఢ్‌లో విద్యాభ్యాసం చేసిన మెహదీ అలీ 24వ ఏట 1941లో హైదరాబాద్ స్టేట్ సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 1948లో ఖమ్మం జిల్లాలోని మధిరలో డిప్యూటీ కలెక్టర్‌గా నియుక్తులయ్యారు. రజాకార్ల ఆగడాలకు హద్దుల్లేని రోజులు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ప్రభావం చూపుతున్నారు. రైలులో ఒక మార్వాడీ బృందాన్ని పట్టుకున్నారు. పచ్చళ్ల జాడీల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని అభియోగం మోపారు. తనిఖీల్లో బంగారం లేదని తెలిసినా, డిప్యూటీ కలెక్టర్ హోదాలో వారిని విడిచి పెట్టమన్నా పోలీసులు రజాకార్ల ఒత్తిడి మేరకు 12 గంటల పాటు వ్యాపారులను హింసించారు. మెహదీ అలీ బాస్ వరంగల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అరబ్ వ్యక్తి హబీబ్ మొహమ్మద్. మంచివాడే! రజాకార్ల ప్రభావం పెరిగేకొద్దీ కరడు తేలాడు, హిందువుల రక్తాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తా అనేంతగా! బాస్ అతి ధోరణి నచ్చకపోయినా కింది స్థాయి ఉద్యోగిగా మెహదీ అలీ ఏం చేయగలడు? భయవిహ్వలమైన హిందూ మతస్తులు నైజాం స్టేట్ చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు. అరబ్‌ల దోపిడీ! తాలూకాల్లో జిల్లాల్లో నిజాం కోశాగారాలను అరబ్‌లు కాపలా కాసేవారు. ఖజానాపై కన్నేసేందుకు ఎవ్వరూ సాహసించనంత నిబద్ధతతో పనిచేసేవారు. పరిస్థితులు విషమిస్తున్న కొద్దీ అరబ్ కాపలాదారులు తామే చట్టంగా వ్యవహరించారు. మధిరకు ఐదు కిలోమీటర్ల దూరంలోని దిందుకూరు అనేగ్రామంపై ఒకరోజు అరబ్ కాపలాదారులు దాడి చేశారు. లూటీ.. దోపిడీ.. బలాత్కారాలు.. మహిళల మంగళసూత్రాలు సైతం తెంచుకుపోయారు. మహిళలు మౌనప్రదర్శన చేసి, దుండగులపై చర్యతీసుకోవాలని మెహదీ అలీని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ మెహదీ ఇంటి ఎదురుగానే ఉంది. ఆగడాలు చేసిన అరబ్లపై చర్యతీసుకోవాలని ఆ సమయంలో తన పక్కనే ఉన్న సంబంధిత పోలీసు అధికారి హబీబుల్లాతో అన్నాడు. ఊ కొట్టిన అధికారి, పోలీసులు మిన్నకుండి పోయారు. రజాకార్లు లూటీ చేసిన సొమ్ముతో రైల్వేస్టేషన్లో విహారం చేస్తూ రైలొచ్చాక తాపీగా వెళ్లిపోయారు. క్షోభించిన మెహదీ అలీ పై అధికారికి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ కలెక్టర్ తన సోదర విశ్వాసులతో సవ్యంగా లేని నేపథ్యంలో అతడిని బదిలీ చేయాలని కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. పద్ధతులు మార్చుకోకపోతే ‘విపరీత’ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ‘అసహజ లైంగిక కృత్యాల కేంద్రా’నికి బదిలీ కావాల్సి ఉంటుందనే అంతరార్థంతో ఖాసిం రజ్వీ.. మెహదీ అలీకి లేఖ రాశాడు. మెహదీ అలీకి బదిలీ అయ్యింది కూడా! అదే సమయంలో ‘పోలీస్ చర్య’ జరగడం, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారతంలో భాగమైంది. ‘విపరీత పరిణామాల’ను ఎదుర్కొనే ప్రమాదం మెహదీ అలీకి తప్పిపోయింది! ప్రమోషన్లకు ఫుల్స్టాప్! తనతో సహా ఎనిమిది మంది అధికారులకు కలెక్టర్‌గా పదోన్నతి రావాల్సిన లిస్ట్‌లో మెహదీ అలీ పేరు లేదు! పదోన్నతులందరూ హిందువులే! నిజాం ధోరణి నచ్చని ఏడుగురు మీర్జాలలో ఒకరైన ముల్లా బాసిత్ అలీ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కలసి స్వయంగా వివరించారు. నెహ్రూ వెంటనే నమ్మలేదు. ఉత్తర్వుల కాపీ చూసి చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ బాక్లేకు వెంటనే ఫోన్ చేశారు. సంభాషణా సారాంశం ఏమిటి? ‘గతంలో హిందువులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని ప్రయత్నించాం, సర్’ అని బాక్లే సమాధానం! ‘నిదానంగా వెళ్లండి, ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనే భావనను కలిగించకండి’ అని నెహ్రూ హితవు పలకడంతో ఎనిమిది మందిలో ముగ్గురు ముస్లింలు కలెక్టర్లుగా నియుక్తులయ్యారు అందులో మెహదీ అలీ ఒకరు! ఎదుగూ బొదుగూ లేని స్థితి! కలెక్టరయ్యారు కాని, అక్కడ మెహదీ అలీ పదోన్నతులు ఆగిపోయాయి. తోటి వారంతా పదోన్నతులు పొందుతున్నారు. తనకు రావడం లేదు? కారణం! ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు ‘ఇతని విధేయతలు పలు రకాలు’ అని రాసేవారు! రాజ్య పాలకుడైన నిజాం సైతం రజాకార్లకు జడిసిన వాతావరణంలో న్యాయం వైపు ధర్మం వైపు ఉన్న మెహదీ అలీ పట్ల స్వతంత్ర భారత ప్రభుత్వంలో ఎంతటి అమానుష ధోరణి? పోలీస్ చర్య తర్వాత వేలాది ముస్లింలు పాకిస్థాన్ వెళ్లారు. తనలా వెళ్లలేదు. క్షుభితుడైన మెహదీ అలీ మౌనంగా ఉన్నాడు. ‘విధి’విలాసంగా భావించారు! పదేళ్ల కిందట పరమపదించారు. అంతకు కొన్నేళ్ల క్రితం ఎనభయ్యో వడిలో ఉన్న మెహదీ అలీని కలుసుకున్నాను. ప్రశాంతంగా ఉన్నారు. గతంలో తాను అనుభవించిన క్లేశానికి సంబంధించిన ఆచూకీ ఎక్కడా కనపడలేదు. మత్సరాలను తొలగించుకోలేని మనుషులను క్షమించే దయాసాగరుని నవ్వు! -
‘అరబ్బు’ ఆధిపత్య పోరులో సమిధ ఈజిప్ట్
ఈజిప్ట్‌లో ఇటీవల వందలాది మంది ‘ముస్లిం బ్రదర్హుడ్’ మద్దతుదార్లకు విధించిన సామూహిక మరణశిక్షల వెనుక సౌదీ హస్తం ఉంది. అరబ్బు ప్రపంచంపై బీటలు వారుతున్న ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో అది బ్రదర్‌హుడ్‌పై కత్తిగట్టింది. ఈజిప్ట్ రాజధాని కైరో నగరం బుధవారం బాంబు దాడులతో మారుమోగింది. గత ఏడాది జూలైలో మొహ్మద్ ముర్సీ పదవీచ్యుతుడైనప్పటి నుంచి అలాంటి పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అలా ఇంత వరకు 500 మంది హతమైపోయారు. వారిలో పోలీసు, సైనికాధికారులే ఎక్కువ. కాకపోతే బుధవారం మరణించినది పోలీసు బ్రిగేడియర్ జనరల్ కావడమే విశేషం. ‘ఉగ్రవాదం భయమే లేకుండా ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హామీని కల్పించడానికి పోరాడుతూనే ఉంటాను’ అని ఈజిప్ట్ సైనిక పాలకునిగా అబ్దెల్ అల్ ఫతా సిసీ సరిగ్గా వారం క్రితం (మార్చి 26) తెహ్రీర్ స్క్వేర్‌లో అభయమిచ్చారు! అదే రోజునే ఆయన సైనిక దుస్తులను విడిచేసి ‘ప్రజాభీష్టం’ మేరకు మే 26-27లలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు సెలవిచ్చారు. అంతకు సరిగ్గా రెండు రోజుల ముందు మార్చి 24న కైరోలోని ఓ న్యాయస్థానం ముందే తయారుచేసిన తీర్పును చదివి వినిపించింది. 528 మంది ముస్లిం బ్రదర్హుడ్ మద్దతుదార్లకు మరణశిక్షలు విధించింది. ఒక రోజు వాయిదా, ఒక రోజు తీర్పుతో సామూహిక విచారణను క్షణాల్లో ముగించిన ఘనత సిసీకే దక్కింది. జైళ్లలో మగ్గుతున్న రెండు వేల మందికి పైగా బ్రదర్హుడ్ ఖైదీలలో మిగతా వారిపై ఇంకా ‘విచారణ’ జరగాల్సి ఉంది. ఈజిప్ట్ విప్లవంలో కీలక పాత్ర వహించిన ట్రేడ్ యూనియన్లు, లౌకికవాద, ఆధునిక యువత నుంచి దేశాన్ని ‘కాపాడటం కోసం’... విప్లవంలో మరో కీలక భాగస్వామి బ్రదర్‌హుడ్‌పై అమెరికా మిత్ర భేదాన్ని ప్రయోగించింది. ప్రజల్లో 30 నుంచి 35 శాతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే ముస్లిం బ్రదర్హుడ్ నేత మొహ్మద్ ముర్సీ అధ్యక్ష పీఠం దక్కించుకునేలా చేసింది. అలాంటి అమెరికా ఈ సామూహిక మరణశిక్షల తదుపరి అల్ సిసీ ప్రభుత్వంపై ఏ ఆంక్షలు విధించింది? అసలు సిసీ సైనిక కుట్రను అణచివేసి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’కు ఎందుకు నడుం బిగించలేదు? ‘తలలను మార్చే’ నైపుణ్యంలో తనకు సాటేలేరనుకున్న అమెరికా తన కీర్తి కిరీటానికి ఆప్త మిత్రులే ఎసరు పెడతారని ఊహించలేకపోవడాన్ని ‘అర్థం చేసుకోవచ్చు.’ ముర్సీ తలను మార్చి అల్ సిసీ తలపై ఈజిప్ట్ మకుటం పెట్టినది సౌదీ అరేబియా. 528 మందికి సామూహిక మరణశిక్షలకు కర్త, కర్మ, క్రియ అదే. అందుకే ‘ఇలాంటి విచారణలను, మర ణశిక్షలను ఆమోదించలేం’అంటూ తనకే వినిపించనంత మెల్లగా గొణగడానికి మించి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఏమీ చేయలేకపోయారు. ఈజిప్ట్ ప్రజాస్వామ్యానికి పరిరక్షకునిగా అది ఎంచుకున్న ముర్సీ సహా మొత్తంగా బ్రదర్‌హుడ్‌ను సౌదీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అదే అడుగుజాడలో సిసీ దేశంలోని అత్యంత సంఘటిత రాజకీయ పార్టీ బ్రదర్‌హుడ్‌ను నిషేధించారు. బ్రదర్‌హుడ్‌పై సౌదీ అక్కసు ఈనాటిది కాదు. ఈజిప్ట్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సున్నీ ఇస్లామిక్ ప్రపంచంలో బ్రదర్‌హుడ్‌కు శాఖలున్నాయి. సున్నీ ప్రపంచంపై తిరుగులేని ఆధిపత్యం తనదేనని భావిస్తున్న సౌదీ... బ్రదర్‌హుడ్‌ను తనకు ప్రత్యర్థిగా భావిస్తోంది. ఉదారవాద ఇస్లామిస్ట్ సంస్థగా ఉండే బ్రదర్హుడ్ ఆధునిక ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది. సరిగ్గా అదే సౌదీ, దాని మిత్ర దేశాలకు ప్రాణాంతకంగా మారింది. తమ దేశాలలోని రాచరిక వ్యవస్థలకు అది ఎసరు తెస్తుందనే భయం పట్టుకుంది. పైగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా సౌదీ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే సున్నీ ఇస్లామిక్ మత భావజాలానికి పట్టుగొమ్మగా భావించే అల్ అజర్ విశ్వవిద్యాలయం ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉంది. ముర్సీ ఆ విశ్వవిద్యాలయంపై ఆధిపత్యం కోసం కూడా ప్రయత్నించారు. వీటన్నిటికీ మించి ఆయన అటు టర్కీ, ఖతార్‌లతో కలిసి సున్నీలకు, షియాలకు మధ్య ఉన్న దీర్ఘకాలిక వైరాన్ని అధిగమించి ఇస్లామిక్ ప్రపంచ ఐక్యతను సాధించే ప్రయత్నాలు చేశారు. మొత్తం ఇస్లామిక్ ప్రపంచంపై ఆధిపత్యం కోసం సౌదీ ఎప్పటి నుంచో షియా ఇరాన్ పై కత్తికట్టింది. ఇరాన్ షియా ఇస్లామిస్టులతో చేయి కలిపి బ్రదర్హుడ్ చివరికి తమ రాచరికం కాళ్ల కింద అరబ్బు విప్లవం మంటలు రేపుతుందనే భయం దానికి పట్టుకుంది. ఈజిప్ట్‌లోని బ్రదర్హుడ్ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టనిదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాని శాఖలను అదుపులో పెట్టలేమని భావించింది. బ్రదర్హుడ్ ఈజిప్షియన్లను షియాలుగా మార్చేస్తుందని, సున్నీ మనుగడకు ముప్పు రానున్నదని ప్రచారం సాగిస్తూ సిసీ సౌదీ బంటుగా బ్రదర్‌హుడ్‌ను ఏరిపారేస్తున్నారు. మే ఎన్నికల్లో గెలిచి సైనిక పాలనకు ప్రజాస్వామ్యం ముసుగు తొడుగుతారు. సౌదీ పెట్రో డాలర్లతో పెరిగిన సినాయ్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా బాంబులు పేలుస్తూనే ఉంటారు. పి.గౌతమ్