చార్మినార్‌లో హెరిటేజ్ డే సందడి
యాకుత్‌పురా: వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తాహేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చార్మినార్‌తో పాటు నగరంలోని చారిత్రాత్మక కట్టడాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలికి చెందిన అవైస్ పాఠశాల విద్యార్థులు సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించారు.
చారిత్రక కట్టడాల ఫోటోలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అధికారులు బాబ్జీరావు, అనిల్ కుమార్, సిహెచ్. పెద్దింటి, జిలానీ పాషా, గోపాల్ రావు, సిహెచ్. అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని చార్మినార్‌ను తిలకించేందుకు సందర్శకులకు సోమవారం ఉచిత ప్రవేశం కల్పించారు. అయితే దీనిపై ముందస్తు ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్పందన లభించలేదు.