Archana Shastry
-
'మగధీర'లో ఆఫర్ వచ్చింది, కానీ నో చెప్పా: అర్చన
హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన అర్చన ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని బుల్లితెర ప్రేక్షకులక సైతం చేరువైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమాలో తాను బాలకృష్ణకు డ్యాన్స్ నేర్పించానంది. బాలయ్య బృందావనంలో గోపికలతో కలిసి డ్యాన్స్ చేసే ఒక బిట్ నేర్పించినట్లు వెల్లడించింది. ఇక పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్లిన తాను పెగ్గులు ఎక్కువవడంతో ఆసుపత్రికి వెళ్లానని చెప్పింది. రాజమౌళిగారు మగధీరలో చేయమని ఆఫర్ ఇచ్చారు, కానీ అప్పుడంత లౌక్యం లేకపోవడంతో చేయలేదని తెలిపింది. నిజంగా ఆ సినిమా చేసుంటే ఇప్పుడు ఇంకోలా ఉండేదేమోనని పేర్కొంది. కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయంటూ ఎమోషనలైంది అర్చన. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ పావురాల వ్యర్థాల వల్లే మీనా భర్త మృతిచెందాడా?..షాకింగ్ రీజన్ -
వైభవంగా నటి అర్చన వివాహం
బిగ్‌బాస్ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంల వివాహం గురువారం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం అక్టోబర్ 3న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి ప్రముఖ ఫంక్షన్హాల్లో పెళ్లి రిసెప్షన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు అర్చన(వేద), జగదీశ్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అర్చన క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ నటించి వెండితెరపై మెరిసింది. అయితే సరైన హిట్ లేకపోవటంతో అడపాదడపా చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరికీ సుపరిచితురాలయ్యింది. ఈ షోతో తగిన గుర్తింపు తెచ్చుకున్న అర్చన పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. తాజాగా వజ్రకవచధర గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భయపెట్టే జెస్సీ
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి.అశ్వినికుమార్ దర్శకత్వంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేసి రెండేళ్లు అవుతోంది. అప్పటికీ.. ఇప్పటికీ చాలా మంది మారిపోయారు. ఇది నా మొదటి సినిమాగా విడుదల కావాల్సింది. కొన్ని కారణాలతో ఆలస్యం కావడంతో రెండో సినిమాగా విడుదవుతోంది. ఈ చిత్రంలో మెయిన్‌లీడ్‌గా మంచి క్యారెక్టర్ చేశాను’’ అన్నారు. ‘‘హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా మా సినిమా విడుదలవుతోంది’’ అన్నారు శ్వేతా సింగ్. ‘‘ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అశ్వినికుమార్. ‘‘ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని ఎంజాయ్ చేశాను’’ అని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల అన్నారు. ‘‘మంచి చిత్రం చేశాం. ఇందులో హారర్ కంటే ఇద్దరు సిస్టర్స్ మధ్య మంచి సెంటిమెంట్ మెప్పిస్తుంది’’ అన్నారు నటుడు విమల్ కృష్ణ. అభినవ్ గోమటం పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్.ఎన్.