arial survey
-
త్వరలో సాకారంకానున్న హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్!
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్–ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు రూట్ సర్వే/నిర్మాణం కోసం చేపట్టిన గూగుల్ మ్యాపింగ్ తుది దశకు చేరుకుంది.వారం, 10 రోజుల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. జీపీఎస్ ఆధారిత ఏరియల్ సర్వే కోసం ప్రస్తుతం నవీ ముంబై నుంచి హైదరాబాద్ వరకు పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా వికారాబాద్– తాండూరు మధ్య దిమ్మెల నిర్మాణం కూడా పూర్త యింది. ఏరియల్ సర్వే నెల రోజుల్లో పూర్తి కావొ చ్చని తెలుస్తోంది. సాంకేతిక ప్రక్రియ పూర్తయిన తర్వాత హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ‘ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయి బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు కనీసం 3 నుంచి నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది’ అని ద.మ«. రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మొత్తం 711 కిలోమీటర్ల మార్గం.. ప్రస్తుతం ముంబైలో రైల్వే టర్మినళ్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా నవీ ముంబై నుంచి హైదరాబాద్ వరకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తున్నారు. మొత్తం 711 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ పట్టాలపైన బుల్లెట్ రైలు గం టకు 320 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. మూడున్నర గంటల సమయంలోనే హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. ప్రస్తుత రైళ్లు హైద రాబాద్ నుంచి ముంబైకి చేరుకునేందుకు 13 నుంచి 14 గంటల సమయం పడుతోంది. కాగా, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 6 కారిడా ర్లలో 4,109 కి.మీ. మేర హైస్పీడ్ ట్రాక్‌లను నిర్మిం చనుంది. ముంబై– అహ్మ దాబాద్, ముంబై– నాసి క్– నాగ్‌పూర్, చెన్నై– బెంగళూరు– మైసూరు, ముంబై– హైదరా బాద్, ఢిల్లీ– వారణాసి, ఢిల్లీ– అహ్మదాబాద్, ఢిల్లీ– అమృత్సర్ మార్గాలు ఉన్నాయి. -
టౌటే బీభత్సం: ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని ఏరియల్ సర్వే
అహ్మదాబాద్: అత్యంత తీవ్ర తుపాను ‘టౌటే’ పెను విధ్వంసం సృష్టించింది. ఇక తీర ప్రాంత జిల్లాల్లో పెను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అహ్మదాబాద్ సహా గుజరాత్ రాష్ట్రంలోని 35 తాలూకాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అతి భీకరంగా విరుచుకుపడ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, డయూలో పర్యటించారు. ఉనా, డయూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇందులో ప్రధాని వెంట గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. తుఫాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. తదుపరి సహాయక చర్యలు, తుఫాను కారణంగా వాటిల్లిన నష్టానికి సంబంధించి మరికాసేపట్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ( చదవండి: CycloneTauktae: గుజరాత్ అతలాకుతలం ) #WATCH | Prime Minister Narendra Modi conducts an aerial survey of the #CycloneTauktae affected areas of Gujarat and Diu The PM is conducting an aerial survey of areas such as Una, Diu, Jafarabad, and Mahuva today. He will also hold a review meeting in Ahmedabad later. pic.twitter.com/B3C4qamBwp — ANI (@ANI) May 19, 2021 -
గోదావరి ప్రాజెక్ట్‌లపై ఏరియల్ సర్వే
ఏటూరునాగారం: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటా మేరకు జలాల పూర్తిస్థారుు విని యోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గోదావరి ప్రాజెక్టులకు వాస్తవ నీటి కేటారుుంపు, లభ్యతనీరు, నిర్దేశించుకున్న ఆయకట్టు, ప్రాజెక్ట్‌ల పరిధిలో చేపట్టాల్సిన రిజర్వాయర్, పంప్ హౌస్‌ల నిర్మాణం తదితర అంశాలపై నిపుణుల కమిటీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద చొక్కారావు ఎత్తిపోతల పథకం పరిధిలోని నీటి నిల్వలు, గోదావరి పొడవునా సర్వే చేశారు. కంతనపల్లి బ్యారేజ్ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. దేవాదుల 60 టీఎంసీలు, కంతనపల్లి 50 టీఎంసీలు, కాల్వ పరిసరాల్లోనూ పర్యటించారు. -
సీఎం గాలి మాటలు చెబుతున్నారు: నాగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన కరువు తో రైతులు, పాలన గాడితప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆకాశహర్మ్యాలు, ఆకాశమార్గాలు అంటూ గాలిలో తిరుగుతూ గాలిమాటలు చెబుతున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలతో ఇంధనం వృథా అవటం మినహా ప్రయోజనం లేదని, ఆయనను భూమ్మీదకు దింపాల్సిన బాధ్యతను ప్రజలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా పడింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆయన శనివారం ఏరియల్ సర్వే చేయాల్సి ఉండగా...అది ఆదివారానికి వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ వర్గాలు ప్రకటన చేశాయి. కాగా కేసీఆర్ రేపు వనస్థలిపురం, నారపల్లిలోని అభయారణ్యాలను పరిశీలించనున్నారు.