సీఎం గాలి మాటలు చెబుతున్నారు: నాగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన కరువు తో రైతులు, పాలన గాడితప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆకాశహర్మ్యాలు, ఆకాశమార్గాలు అంటూ గాలిలో తిరుగుతూ గాలిమాటలు చెబుతున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలతో ఇంధనం వృథా అవటం మినహా ప్రయోజనం లేదని, ఆయనను భూమ్మీదకు దింపాల్సిన బాధ్యతను ప్రజలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.