1 కోసం 32కోట్లు!
దుబాయ్: అధునాతన కారుకు ‘1’ నంబర్ ప్లేటు కోసం ఏకంగా రూ.32 కోట్లు వెచ్చించిన వింత ఘటన ఇది. శనివారం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో జరిగిన వేలంలో యూఏఈ వ్యాపారి ఆరిఫ్ అహ్మద్ అల్-జరౌనీ నంబర్1 ప్లేటును రూ.32 కోట్లకు దక్కించుకున్నారు.
‘ఎప్పుడూ నంబర్ వన్‌గా ఉండటమే నా లక్ష్యం. షార్జాలో రిజిస్ట్రేషన్ చేసిన కారు కోసం ఈ నంబర్ కొన్నాను’ అని ఆయన చెప్పారు. 12, 22, 50, 100, 777, 1000, 2016, 2020 ఇలా మొత్తం 60 నంబర్ప్లేట్లను వేలం వేసి నిర్వహణ సంస్థ రూ. 91 కోట్లు మూటగట్టుకుంది.