aruku
-
అరుకు లోయలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు
-
ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి
-
జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి
-
చంద్రబాబుపై ఆ కుటుంబం తిరుగుబాటు..
-
తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి సీజన్లో పర్యాటకులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్( ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–అరకు–విశాఖపట్నం (రైల్ కం రోడ్ ప్యాకేజీ): ఈ టూర్ ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ(ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, థింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరుతారు. అక్కడ నుంచి అన్ని ప్రాంతాలను చూపించి తిరిగి అరకు నుంచి రోడ్ మార్గం ద్వారా అదేరోజు రాత్రి విశాఖపట్నం చేరుస్తారు. ఈ టూర్ ప్యాకేజీ చార్జీలు విశాఖ నుంచి అరకు వరకు విస్టాడోమ్ కోచ్‌లో వెళ్లాలనుకుంటే పెద్దలకు రూ.3,060, పిల్లలకు రూ.2670, స్లీపర్ క్లాస్ కోచ్ అయితే పెద్దలకు రూ.2,385, పిల్లలకు రూ.2,015, సెకండ్ సిటింగ్ పెద్దలకు రూ.2,185, పిల్లలకు రూ.1,815(ఈ చార్జీలు సైట్‌సీయింగ్, రానుపోను ప్రయాణఖర్చులు, అల్పాహారం, మ«ధ్యాహ్నం భోజనం, సాయంత్రం హై టీ, బోర్రా ప్రవేశచార్జీలు, అన్ని పన్నులు కలుపుకుని) తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతీ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. థర్డ్ ఏసీ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.17,860, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 11,720, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.10,495, స్లీపర్ క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.15,765, డబుల్ ఆక్యుపెన్సీ రూ.9,625, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.9,400.. వసతి, రవాణా, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం చార్జీలు, కాణిపాకం, తిరుచానూర్ టికెట్ చార్జీలు, టోల్ గేట్స్, పార్కింగ్, జీఎస్టీ వంటి అన్ని చార్జీలతో కలిపి ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నెంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 0891–2500695, 8287932318 నెంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. (చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలే టార్గెట్) -
అరుకులో 9న జరిగే ఆదివాసీ దినోత్సవం
పెదవాల్తేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆరుకు పర్యటన ఖరాౖరైనట్టు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈనెల 9వతేదీన విశాఖకు చేరుకుంటారు. అరుకుతోపాటు పలు కార్యక్రమాలులో సిఎం పాల్గొంటారు. ఆరోజు ఉదయం 11.30గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు కు బెంగళూరు నుంచి చేరుకుని, 12.30గంటలకు హెలికాప్టర్లో అరుకు చేరుకుంటారని కలెక్టర్‌తెలిపారు. తొలిత ఆధునీకరించిన పద్మాపురం ప్రారంభిస్తారు.అనంతరం హరిత రిసార్టులో గోష్టి సమావేశ మందిరంలో పెదలబుడు ప్రజలతో ముఖాముఖి లో పాల్గొంటారని చెప్పారు, అక్కడి నుంఇచ ఎన్టీఆర్గార్డెన్స్ చే రుకుని పంచాయితీరాజ్ ,గ్రామీణ నీటి సరఫరా ,గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివద్ది పనులు ప్రారంభోత్సవం చేస్తారు. శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సమాజంలో ఆదివాసీల పాత్ర వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అంశాలుంటాయన్నారు. ఆదివాసీ సంస్కతినిప్రతిబింబించే సాంస్కతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చే యనున్నట్లు పేర్కొన్నారు. సిఎం పర్యటనపై జిల్లా అధికారులతో కలెక్టర్‌సమీక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా నఅన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పెదలబుడు గ్రామస్థులతోముఖాముఖీ పంచాయతీ పరిధిలో 22 గ్రామాల ప్రతినిధులు, మండలస్థాయి అధికారులంతా పాల్గొనాల్సి వుంటుందన్నారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి 12 నుంచి 15వేల మంది గిరిజనులు హాజరయ్యే అవకాశం వుందని భావిస్తూ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. సి ఎం పర్యటనలో భాగంగా ఎన్టీ ఆర్ మైదానం లో పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏపీడీ ఆర్పి ,గ్రామీణ ఉపాధిహామీ ,నబార్డు, సి ఆర్ ఆర్ నిధులతో గిరిజన ప్రాంతాలలో చూ.38.36 కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన లకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆశాఖ ఎస్ఈ గజేంద్ర వివరించారు. పి ఎంజీ ఎస్ వై నిధులతో పాడేరు ఏజన్సీలో రూ.29.14కోట్ల తో నిర్మించిన 10రోడ్లను కూడా సి ఎం చేతుల మీదుగా ప్రారంభిస్తారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో ఏజన్సీ ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ.14.30కోట్ల వ్యయంతో చేపట్టనున్న పథకాలను శంకుస్థాపన చేసుందకు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ ఈ ప్రభాకరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నమని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చెప్పారు. అరకు నుంచి తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 5.30గంటలకు చేరుకుని అక్కడ పలు కార్యక్రమాలు పాల్గొంటారని తెలిపారు. నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగర పోలీసులకు సమకూరుస్తున్న జీపిఎస్అనుసంధానం చేసిన 25 మోటరు సైకిల్ ప్రారంభం ,బ్రిక్స్ సదస్సు నిర్వహణ లో భాగంగా రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం విజయనగరం కలెక్టర్ ఆధ్వర్యం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసిత రైతులు మాట్లాడుతారని తెలిపారు. ఎయిర్‌పోర్టులలో కార్యక్రమాలు ఆర్డివో సమన్వయం చేస్తారని పేర్కొన్నారు. మండలాల నియమితుౖలైన నోడల్ అధికారులంతా వచ్చే గురువారం నుంచి తమకు కేటాయించిన మండాలలోగ్రామ సందర్శన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో నిర్వహించాలని, అనంతరం తనకు నివేదికలు సమర్పించాలన్నారు.ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ –2 డి.వెంకటరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కిడారి దురాక్రమణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అవినీతి, అక్రమాలు తవ్వేకొద్దీ కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. అనంతగిరి మండలం గరుగుబిల్లిలో గిరిజనుల డీఫారం భూములను కాజేయడం, వాలాసి పంచాయతీలో అక్రమంగా కాలె్సౖట్ మైనింగ్ చేపట్టడం, సర్కారు నిధులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు సోకులు చేయించుకోవడం, బినామీ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా క్వారీ తవ్వకాలు.. గంజాయి అక్రమ రవాణాదారులకు తెరవెనుక వెన్నుదన్నుగా ఉండటం... ఇలా మన్యంలో అడ్డగోలు దందాలతో రెచ్చిపోతున్న కిడారి అక్రమాల పర్వంలో మరో మజిలీ బయటపడింది. పాడేరులో ఖాళీ స్థలాన్ని అక్రమించేసి అడ్డగోలుగా భవనాన్ని నిర్మించేసుకుంటున్న వైనంపై స్థల హక్కుదారులు కోర్టుకు వెళ్లినా కిడారి వెనక్కి తగ్గలేదు. ఎంచక్కా భవనం నిర్మించేసుకుంటున్నారు. ఈ వ్యవహరం పూర్వాపరాలిలా ఉన్నాయి. పాడేరు మెయిన్‌రోడ్డులోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న 6 సెంట్ల ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆక్రమించేశారు. ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం పిల్లర్స్ నిర్మాణం చేపట్టారు. తమకు పిత్రార్జితంగా లభించిన స్థలాన్ని ఎమ్మెల్యే దురాక్రమణ చేశారంటూ స్థలం వారసులు కొట్టగుళ్లి కోటిబాబు, భరత్‌నాయుడు గత నెల 6న జిల్లా కలెక్టర్ యువరాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో పాడేరు సబార్డినేట్ జడ్జి కోర్టులో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణంపై బాధితులు సివిల్ కేసు (ఏఓఎస్13/2016), (ఐఏ 2/2016) వేశారు. కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కిడారి ఇంటి నిర్మాణం మాత్రం ఆగలేదు. పాడేరుకు చెందిన కొట్టగుళ్లి అప్పల నాయుడుకు స్వాతంత్య్రానికి పూర్వం ముఠాదారీవ్యవస్థలో భాగంగా భూమి కేటాయించారు. కాలక్రమేణా ఈ స్థలాన్ని పాడేరులోని గిరిజనేతరుడైన సత్యవరపు సత్యానందం అనే ఆసామి ఆక్రమించి భవనం నిర్మించాడు. దీనిపై అప్పట్లో కొట్టగుళ్లి అప్పలనాయుడు ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులరైజేషన్ (ఎల్టీఆర్) కింద కేసు వేశారు. ఎల్టీఆర్ యాక్టు (భూబదలాయింపు చట్టం 1/70) ప్రకారం గిరిజనులు, గిరిజనేతరుల మధ్య క్రయవిక్రయాలు లేవు. ఈ కేసు విచారణ అనంతరం అనకాపల్లి సెటిల్మెంట్ అధికారి ఇచ్చిన పట్టా ఆధారంగా పాడేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్... అప్పలనాయుడుకు అనుకూలంగా తీర్పునిచ్చారు. స్థలాన్ని ఆయనకు అప్పగిస్తూ 19.11.1982 లో ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సదరు గిరిజనేతరుడు అక్కడ నిర్మించిన భవనాన్ని కూల్చివేసి స్థలం వదిలేశారు. దీని తరువాత అప్పలనాయుడు వారసులైన కోటిబాబు, భరత్‌నాయుడు తాత పేరిట ఉన్న స్థలంలో ఉన్న భవనం శిథిలాలను తొలగించి బాగు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ స్థలం వారి స్వాధనంలోనే ఉంది. అయితే మెయిన్‌రోడ్డులో ఖాళీగా ఉన్న విలువైన స్థలంపై అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కన్ను పడింది. అంతే.. దీన్ని ఆక్రమించేసి భవననిర్మాణం చేపట్టేశారు. ఆ స్థలం మాదే... ఆ స్థలం మాదే.. ఎమ్మెల్యే కిడారికి ఎటువంటి హక్కు లేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టులో కేసు కూడా వేశాం. విచారణ కొనసాగుతోంది. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. అయినా సరే ఆయన భవన నిర్మాణాన్ని ఆపలేదు. ఎమ్మెల్యే అధికారం, ధనబలంతో అక్రమ నిర్మాణం చేపట్టేశారు. – స్థలదారుడు కొట్టగుళ్లి కోటిబాబు విచారణ జరుగుతోంది.. పాడేరులో తమ భూమిని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆక్రమించేసి ఇల్లు నిర్మిస్తున్నారంటూ కొట్టగుళ్లి కోటిబాబు, భరత్ నాయుడులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాల్సిందిగా పాడేరు సబ్ కలెక్టర్ ఎల్.శివశంకర్‌ను ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయి. –కలెక్టర్ యువరాజ్ -
కడగళ్ల వాన
కనీవినీ ఎరుగని బీభత్సం మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత ఉధృతం ఈదురుగాలులతో భారీ వర్షం అడుగు ఎత్తున పేరుకుపోయిన వడగళ్లు కాశ్మీర్‌ను తలపించిన అరకులోయ అంధకారంలో టౌన్షిప్ పిడుగు పాటుకు అనంతగిరిలో70 మేకలు మృతి: ఒకరికి అస్వస్థత అరకులోయ, న్యూస్‌లైన్: ఏకధాటిగా వర్షం పడితేనే, వానకు హోరుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు తోడైతేనే భయమేస్తుంది. గుండె జలదరిస్తుంది. మరి అంత భారీ వర్షానికి బీభత్సకర రీతిలో వడగళ్లు తోడైతే.. ఆ పరిస్థితి ఎంత కలవరపెడుతుం ది! వెన్నులో ఎలా వణుకు పుడుతుంది! శనివారం అరకు వాసులకు ఈ ఆందోళనకర పరి ణామం అనుభవమైంది. అరకులోయను శనివా రం నాటి వడగళ్లవాన అతలాకుత లం చేసింది. అరకులోయతో పాటు పరిసర గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున వడగళ్లు పడ్డాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈదురుగాలులతో కుండపోతగా వర్షం పడింది. 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ పరిణామాలతో అరకు వాసులు బెంబేలెత్తిపోయారు. రేకుల ఇళ్లల్లోని వా రు ప్రాణభీతితో సన్షేడ్ల కింద తల దాచుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏకధాటిగా ఈదురుగాలులతో వాన కురిసింది. పెద్దపెద్ద శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దాంతో ఏం జరుగుతుందో ఏమోనని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మూడు దశాబ్దాలుగా ఈ స్థాయిలో వడగళ్లు పడడం ఏనాడూ చూడలేదని పెద్దలు చెప్పారు. అరకులోయలోని కొండవీధి, స్టేట్‌బ్యాంక్, రజకవీధిలలో వడగళ్లు సుమారు అడుగు ఎత్తున పేరుకుపోవడంతో కాలు పెట్టడానికి కూడా కష్టంగా మారింది. అవి కరగడానికి రెండు గంటల సమయం పట్టవచ్చని స్థానికులు అంటున్నారు. కుండపోతగా పడిన వర్షం నీరు, వడగళ్ల కారణంగా కొండవీధిలోని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వాన తగ్గుముఖం పట్టాక వాటిని తొలగించే పనిలో పడ్డారు. వడగళ్లు పేరుకుపోయి అరకులోయ పట్టణం, పరిసర ప్రాంతాలు కాశ్మీర్‌ను తలపించాయి. కనుచూపు మేరా కమ్మేసిన వడగళ్ల వల్ల నేలంతా తెల్లని దుప్పటి పరిచినట్టు కనిపించింది. ఈ వర్షానికి టమాటా, క్యాబేజీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అలాగే మామిడి పిందెలలో సహా మొత్తం రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంధకారంలో అరకులోయ : వడగళ్లు, ఈదురుగాలులకు అరకులోయ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు కొమ్మలు పడి తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖపట్నం-అరకు ఘాట్‌రోడ్డులో ప్రయాణికులు, ద్విచక్రవాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. అరకు మెయిన్‌రోడ్డులో నడవడానికి పాదచారులు అష్టకష్టాలకు గురయ్యారు. పిడుగు పాటుకి 70మేకలు మృతి: ఒకరికి అస్వస్థత అనంతగిరి: పిడుగులు పడి మండలంలోని కోనాపురం పంచాయతీ కితలంగిలో 70 మేకలు చనిపోయాయి. ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామ సమీపంలో కిల్లోఅప్పన్న అనే గిరిజనుడు మేకలను కొండనుంచి ఇంటికి తోలుకొస్తుండగా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం పడింది. సమీపంలోని చింత చెట్టు కిందికి వాటిని తీసుకెళ్లాడు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగుపడి మేకలన్నీ చనిపోయాయి. కాపరి అప్పన్న పిడుగు శబ్ధానికి కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వచ్చేసరికి అతడు స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు.