అరుకులో 9న జరిగే ఆదివాసీ దినోత్సవం | Day 9 of the Adivasi festival in aruku | Sakshi
Sakshi News home page

అరుకులో 9న జరిగే ఆదివాసీ దినోత్సవం

Published Sat, Aug 6 2016 11:46 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

అరుకులో 9న జరిగే ఆదివాసీ దినోత్సవం - Sakshi

అరుకులో 9న జరిగే ఆదివాసీ దినోత్సవం

పెదవాల్తేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు ఆరుకు పర్యటన ఖరాౖరైనట్టు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ఈనెల 9వతేదీన విశాఖకు చేరుకుంటారు. అరుకుతోపాటు పలు కార్యక్రమాలులో సిఎం పాల్గొంటారు. ఆరోజు ఉదయం 11.30గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు కు బెంగళూరు నుంచి చేరుకుని, 12.30గంటలకు హెలికాప్టర్‌లో అరుకు చేరుకుంటారని కలెక్టర్‌తెలిపారు. తొలిత ఆధునీకరించిన  పద్మాపురం ప్రారంభిస్తారు.అనంతరం హరిత రిసార్టులో గోష్టి సమావేశ మందిరంలో పెదలబుడు ప్రజలతో ముఖాముఖి లో పాల్గొంటారని చెప్పారు, అక్కడి నుంఇచ ఎన్టీఆర్‌గార్డెన్స్‌ చే రుకుని  పంచాయితీరాజ్‌ ,గ్రామీణ నీటి సరఫరా ,గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివద్ది పనులు ప్రారంభోత్సవం చేస్తారు. శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సమాజంలో ఆదివాసీల పాత్ర వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు  అంశాలుంటాయన్నారు. ఆదివాసీ సంస్కతినిప్రతిబింబించే సాంస్కతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చే యనున్నట్లు పేర్కొన్నారు.  
సిఎం పర్యటనపై జిల్లా అధికారులతో కలెక్టర్‌సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా నఅన్ని శాఖల  అధికారులు సమన్వయంతో పనిచేసి  సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పెదలబుడు గ్రామస్థులతోముఖాముఖీ పంచాయతీ పరిధిలో 22 గ్రామాల ప్రతినిధులు, మండలస్థాయి అధికారులంతా పాల్గొనాల్సి వుంటుందన్నారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి 12 నుంచి 15వేల మంది గిరిజనులు హాజరయ్యే అవకాశం వుందని భావిస్తూ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. సి ఎం పర్యటనలో భాగంగా ఎన్టీ ఆర్‌ మైదానం లో పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏపీడీ ఆర్‌పి ,గ్రామీణ ఉపాధిహామీ ,నబార్డు, సి ఆర్‌ ఆర్‌ నిధులతో గిరిజన ప్రాంతాలలో చూ.38.36 కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన లకు ఏర్పాట్లు చేస్తున్నామని  ఆశాఖ ఎస్‌ఈ గజేంద్ర వివరించారు. పి ఎంజీ ఎస్‌ వై నిధులతో పాడేరు ఏజన్సీలో రూ.29.14కోట్ల తో నిర్మించిన  10రోడ్లను కూడా సి ఎం చేతుల మీదుగా ప్రారంభిస్తారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో ఏజన్సీ ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ.14.30కోట్ల వ్యయంతో చేపట్టనున్న పథకాలను శంకుస్థాపన చేసుందకు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ ఈ ప్రభాకరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నమని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ చెప్పారు. 
అరకు నుంచి తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 5.30గంటలకు చేరుకుని అక్కడ పలు కార్యక్రమాలు పాల్గొంటారని తెలిపారు. నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగర పోలీసులకు సమకూరుస్తున్న జీపిఎస్‌అనుసంధానం చేసిన 25 మోటరు సైకిల్‌ ప్రారంభం ,బ్రిక్స్‌ సదస్సు నిర్వహణ లో భాగంగా రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం విజయనగరం కలెక్టర్‌ ఆధ్వర్యం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసిత రైతులు మాట్లాడుతారని తెలిపారు. ఎయిర్‌పోర్టులలో కార్యక్రమాలు ఆర్‌డివో సమన్వయం చేస్తారని పేర్కొన్నారు. మండలాల నియమితుౖలైన నోడల్‌ అధికారులంతా వచ్చే గురువారం నుంచి తమకు కేటాయించిన మండాలలోగ్రామ సందర్శన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో నిర్వహించాలని, అనంతరం తనకు నివేదికలు సమర్పించాలన్నారు.ఈసమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.నివాస్, జాయింట్‌ కలెక్టర్‌ –2 డి.వెంకటరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement