Arulnithi
-
కోబ్రా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలే: దర్శకుడు
డీమాంటి కాలనీ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అజయ్ జ్ఞానముత్తు. ఈ సినిమా సక్సెస్‌తో చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు. ఆ తర్వాత నయనతార- విజయ్ సేతుపతిలను హీరోహీరోయిన్లుగా పెట్టి తీసిన ఇమైకా నొడిగల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత విక్రమ్ కథానాయకుడిగా నటించిన కోబ్రా చిత్రం డిజాస్టర్‌గా మారింది. తాజాగా ఈయన డీమాంటి కాలనీ – 2 సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇది ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన డీమాంటి కాలనీకి సీక్వెల్ కావడం గమనార్హం. బీటీజీ యూనివర్సల్ సంస్థ అధినేత బాబి బాలచంద్రన్ సమర్పణలో జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో అరుళ్‌నిధి, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన ఇందులో నటుడు అరుణ్ పాండియన్, నటి మీనాక్షి గోవిందరాజన్, ముత్తుకుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ హారర్, థ్రిల్లర్ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని వీఆర్ మాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. తన గత చిత్రం కోబ్రా ప్లాప్ అయిందని, అయితే ఎందుకది ఫ్లాప్ అయిందో అర్థం కాక నిరాశతో ఉన్నప్పుడు నటుడు అరుళ్ నిధి వచ్చి జరిగినదాన్ని మర్చిపోండి మనం మళ్లీ సినిమా చేద్దామని భుజం తట్టి ప్రోత్సహించారన్నాడు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన తన వెన్నంటే ఉన్నారన్నాడు. ఇలాంటి మంచి వ్యక్తులు తన చుట్టూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రం ద్వారా తన తండ్రిని నిర్మాతను చేయాలన్న కోరిక నెరవేరిందన్నాడు. చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. -
ఆ దర్శకుడితో నటించడానికి భయమేసింది: యంగ్ హీరో
దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడానికి భయపడ్డానని యువ నటుడు అరుళ్ నిధి చెప్పారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం తిరువిన్ కురుల్. దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి ఆద్మిక నాయకిగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా హరీశ్ప్రభు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా.. ఇందులో నటుడు అరుళ్‌నిధి మూగ పాత్రలో నటించడం విశేషం. అంతేకాకుండా చెవులు కూడా సరిగా పని చేయవు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఆయన తెలుపుతూ ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు భారతీరాజా తన తండ్రిగా నటించారన్నారు. ఆయన్ని తొలిసారి షూటింగ్‌లోనే చూశానని తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించినా, ఆయనది పిల్లాడి మనస్తత్వం అని అన్నారు. భారతీరాజాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఇది ఎక్కువగా ఆస్పత్రిలో జరిగే సన్నివేశాలతో కూడిన కథా చిత్రమని చెప్పారు. చిత్రంలో ఈగో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. విలన్లు, పోరాటాలు అంటూ చిత్రం కుటుంబ నేపథ్యంలో భావోద్రేకాలతో సాగుతుందని తెలిపారు. తాను ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కథే కారణం అన్నారు. బృందావనం తరువాత తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం ఇదేనని నటుడ అరుళ్‌నిధి పేర్కొన్నారు. -
ఓటీటీలో ‘రేయికి వేయి కళ్లు’ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం ఓటీటీ వినియోగం ఎంతలా పెరిగిందో అందరికీ తెలుసు. ఏ భాషైనా సరే మంచి సినిమా అయితే చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ‘రేయికి వేయి కళ్లు’ పేరిట తెలుగులో రానున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 30 ఈ చిత్రం ఆహాలో సందడి చేయనుంది. డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్. 'రేయికి వేయి కళ్లు' అనే సినిమాతో ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమిళంలో విజయవంతంగా యాభై రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేక్షుకులు, విమర్శకులు సైతం ఈ సినిమాలోని ట్విస్టులకు ఫిదా అయిపోయారు. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది. ‘రేయికి వేయి కళ్లు’ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రధానబలం. రివర్స్ ఆర్డర్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. ఒక్కోసారి ఈ సినిమాను చూస్తుంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోమెంటో సినిమా గుర్తుకొస్తుంది. డైరెక్టర్ మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ ఆసక్తిగా సాగింది. ఈ సినిమా కథ ఒక సీరియల్ మర్డర్ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అదే ఈ సినిమాలో హైలెట్. Get ready for an edge of your seat thriller 🔥 The story unfolds on September 30.@arulnithitamil @Mahima_Nambiar @ajmal_amir @vidya_actresss @sujavarunee @chayasingh16 @actorjohnvijay pic.twitter.com/Xq8fENo1cj — ahavideoin (@ahavideoIN) September 25, 2022 -
'16 ఏళ్లుగా చేధించలేని కేసు'.. ఆసక్తిని రేకెత్తిస్తున్న డైరీ చిత్రం
తమిళసినిమా: అరుళ్‌నిధి వరుస చిత్రాల్లో నటిస్తూ విజయాలను అందుకుంటున్నారు. గతంలో ఆయన నటించిన ది బ్లాక్, డెజావు చిత్రాలు ప్రేక్షకాదరణను పొందాయి. తాజాగా అరుళ్ కథానాయకుడిగా నటించిన చిత్రం డైరీ. ఫైవ్‌స్టార్ ఫిలిమ్స్ పతాకంపై కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రానికి ఇన్నిసై పాండియన్ దర్శకత్వం వహించారు. అరుళ్ నిధి ఇందులో పోలీసు అధికారిగా నటించారు. ట్రైనీ పోలీసులకు కేసులను పై అధికారి అప్పగించడంతో చిత్ర కథ ప్రారంభమవుతుంది. పెండింగ్‌లోని కేసులను పరిష్కరించే బాధ్యతలను ఆ అధికారి ట్రైన్ పోలీసులకు అప్పగిస్తారు. అలా గత 16 ఏళ్లుగా చేధించలేని కేసును హీరో అరుళ్‌నిధి చేపడుతారు. దానిని ఆయన ఎలా చేధించాడు అన్నదే డైరీ చిత్ర కథ. పలు ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ చిత్రంలో అనేక అనూహ్య సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. భూత, భవిష్యత్తు కాలాలు మన పక్కనే ఉంటాయి. అయితే అవి ఎవరి కంటికి కనిపించవు. అలా కనిపిస్తే ఏమౌతుందన్నదే డైరీ చిత్ర కథ. యాక్షన్‌తో కూడిన ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో కూడిన కథను దర్శకుడు హార్రర్‌ను జోడించి మరింత ఆసక్తిని రేకెత్తించేలా చేశాడు. అరుళ్‌నిధి పాత్రను ఆయన గత చిత్రాలకు భిన్నంగా రూపొందించారు. అరుళ్‌నిధి అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ ఆసక్తిగానూ, ఉద్రేక భరితంగా తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. -
‘డేజావు’కి గుమ్మడికాయ కొట్టారు
డేజావు చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. నటుడు అరుళ్‌నిధి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డేజావు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు వెర్షన్లలో తీస్తున్నారు. ఈ చిత్రానికి పీజీ ముత్తయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అరవింద్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి జపాన్ సంగీతాన్ని, పీజీ ముత్తయ్య ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గురువారం పూర్తి చేసుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
కల్యాణ వైభోగమే..
కుల, మత బేధాలకు అతీతంగా, తిథి, నక్షత్రం, మంచి ముహూర్తం, మంత్రోచ్ఛారణలు లేకుండా స్వయం మర్యాద పూర్వక వివాహం కరుణ ఇంట మిన్నంటింది. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మనవడు, నటుడు అరుల్ నిధి వివాహానికి రాజకీయ పక్షాలు, సినీ తారలు తరలువచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తమ శుభాకాంక్షల్ని తెలియజేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ కరుణానిధి కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి, చెన్నై:డీఎంకే అధినేత ఎం కరుణానిధి కుమారుడు ముక్కా తమిళరసు తనయుడు అరుల్ నిధి సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరుల్ నిధి వివాహాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి కన్నదాసన్ కుమార్తె కీర్తనతో జరిపేందుకు నిశ్చయించారు. ఈ వివాహంతో రాజకీయ నాగరికతను చాటుకునే విధంగా అన్ని పార్టీల నాయకుల ఆహ్వానం పలికారు. స్వయంగా పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ అందరి నేతల ఇళ్ల మెట్లు ఎక్కారు. కల్యాణ..కమనీయం డీఎంకే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అన్నా అరివాలయంలో సోమవారం ఈ వివాహం జరిగింది. డీఎంకే అధినేత కరుణానిధి అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ నేతృత్వం లో జరిగిన ఈ వివాహ వేడుకకు డీఎంకే కుటుంబం తరలి వచ్చింది. పార్టీ బహిష్కరణతో కుటుంబ వేడుకలకు దూరంగా ఉన్న పెద్ద కుమారుడు ఎంకే అళగిరి ఈ వివాహ వేడుకకు తన సతీమణి గాంధీ అళగిరితో కలిసి హాజరయ్యారు. తల్లి రాజాత్తి అమ్మాల్‌తో కలసి ఎంపీ కనిమొళి వివాహానికి వచ్చారు. అందర్నీ స్టాలిన్, ముక్కా తమిళరసులు సాదరంగా ఆహ్వానించారు. వివాహ వేదికపై కరుణానిధి, అన్భళగన్తో కలసి ఎండీఎంకే నేత వైగో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌లు ఆశీనులయ్యారు. తరలి వచ్చిన నేతలు కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత నల్లకన్ను, పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి, వీసీకే నేత తిరుమావళవన్, ఎంజీఆర్కళగం నేత ఆర్ఎం వీరప్పన్, పెరుందలైవర్ కట్చి నేత ఎన్ఆర్ ధనపాలన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, దేశీయ లీగ్ నేత తిరుప్పూర్ అల్తాఫ్, కాంగ్రెస్ నేతలు డీఎంకే మాజీ మంత్రులు, జిల్లాల కార్యదర్శులు, నటుడు విజయ్, ఎస్వీ శేఖర్, పలువురు నటీమణులు, తదితరులు వచ్చారు. ఆశీస్సులు వరుడు అరుల్ నిధి, వధువు కీర్తనను ఆశీర్వదిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్ ద్వారా, సందేశాల ద్వారా తమ ఆశీస్సుల్ని, శుభాకాంక్షల్ని అందించారు. ఆదివారం రాత్రి జరిగిన రిసెప్షన్లో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ నేత ఇలగణేషన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణి, పీఎంకే నేత రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి రాందాసు ,నాయకులు జీకే మణి, ఏకే మూర్తి, తమిళ మానిల కాంగ్రెస్ నేతలు జీకే వాసన్, జ్ఞాన దేశికన్, కాంగ్రెస్ నేతలు తిరునావుక్కరసు, వసంతకుమార్, నారాయణ స్వామి, వైద్యలింగం, తంగబాలు, కృష్ణ స్వామి, కుమరి ఆనందన్, డీఎండీకే అధినేత విజయకాంత్ బావమరిది, యువజన నేత సుదీష్లు, ఎంఎంకే అధ్యక్షుడు జవహరుల్లా తరలి వచ్చిన తమ ఆశీస్సులు అందించారు. రజనీ రాక సూపర్‌స్టార్ రజనీ కాంత్ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గీత రచయిత వైరముత్తు, నటుడు శివకుమార్, కార్తీ, ప్రభు కుటుంబం, నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు, ఆమె భర్త సుందర్ సీ, నటుడు విశాల్ కుటుంబం, విజయకుమార్ కుటుంబం, సత్యరాజ్, పార్తీబన్, దర్శకుడు భారతీ రాజ, కేఎస్ రవికుమార్, తదితర సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అనారోగ్యంతో... ఈ వివాహ వేడుకలో వధూవరుల్ని ఆశీర్వదిస్తూ, కరుణాని ధి ప్రసంగించారు. తనకు అనారోగ్యంగా ఉందని, ఇది వయోభారంతో వచ్చింది మాత్రం కాదన్నారు. శ్రమ పెరగడం, విశ్రాంతి కరువు కావడంతో ఈ పరిస్థితిగా పేర్కొన్నారు. తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విచ్చిన్నం ఎవరి తరం కాదు ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ ఈ వివాహ వేడుకను చూస్తుంటే 44 ఏళ్ల క్రితం జరిగిన ఘటన గుర్తుకు వస్తోందన్నారు. తన వివాహానికి హాజరు కాలేని పరిస్థితి నెలకొనడంతో, చివరకు కళింగపట్నంలోని తన ఇంటికి వచ్చి మరీ ఆశీర్వదించి, విశ్రాంతి తీసుకున్న సమయంలో అన్నయ్య(కరుణానిధి) చెప్పిన కొన్ని వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయని వివరించారు. త్యాగాలకు ప్రతీక ద్రవిడ ఇయక్కం అని వ్యాఖ్యానించారు. ఈ ద్రవిడ ఇయక్కంను విచ్చిన్నం చేయడం ఎవరి తరం కాదన్న విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేస్తున్నాని పేర్కొన్నారు.