దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడానికి భయపడ్డానని యువ నటుడు అరుళ్ నిధి చెప్పారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం తిరువిన్ కురుల్. దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి ఆద్మిక నాయకిగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా హరీశ్‌ప్రభు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.
కాగా.. ఇందులో నటుడు అరుళ్‌నిధి మూగ పాత్రలో నటించడం విశేషం. అంతేకాకుండా చెవులు కూడా సరిగా పని చేయవు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఆయన తెలుపుతూ ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు భారతీరాజా తన తండ్రిగా నటించారన్నారు.
ఆయన్ని తొలిసారి షూటింగ్‌లోనే చూశానని తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించినా, ఆయనది పిల్లాడి మనస్తత్వం అని అన్నారు. భారతీరాజాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఇది ఎక్కువగా ఆస్పత్రిలో జరిగే సన్నివేశాలతో కూడిన కథా చిత్రమని చెప్పారు. చిత్రంలో ఈగో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. విలన్లు, పోరాటాలు అంటూ చిత్రం కుటుంబ నేపథ్యంలో భావోద్రేకాలతో సాగుతుందని తెలిపారు. తాను ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కథే కారణం అన్నారు. బృందావనం తరువాత తన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ఇదేనని నటుడ అరుళ్‌నిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment