Reyiki Veyi Kallu Movie Released In OTT, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

ఓటీటీలో  ‘రేయికి వేయి కళ్లు’ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Sep 27 2022 5:05 PM | Last Updated on Tue, Sep 27 2022 6:17 PM

Reyiki Veyi Kallu Movie Release On OTT AHA - Sakshi

ప్రస్తుతం ఓటీటీ వినియోగం ఎంతలా పెరిగిందో అందరికీ తెలుసు. ఏ భాషైనా సరే మంచి సినిమా అయితే చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు.  ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ‘రేయికి వేయి కళ్లు’ పేరిట తెలుగులో రానున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 30 ఈ చిత్రం ఆహాలో సందడి చేయనుంది.

డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్.  'రేయికి వేయి కళ్లు' అనే సినిమాతో ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమిళంలో విజయవంతంగా యాభై రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేక్షుకులు, విమర్శకులు సైతం ఈ సినిమాలోని ట్విస్టులకు ఫిదా అయిపోయారు. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది.

‘రేయికి వేయి కళ్లు’ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రధానబలం. రివర్స్ ఆర్డర్‌ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. ఒక్కోసారి ఈ సినిమాను చూస్తుంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోమెంటో సినిమా గుర్తుకొస్తుంది. డైరెక్టర్ మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ ఆసక్తిగా సాగింది. ఈ సినిమా కథ ఒక సీరియల్ మర్డర్‌ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అదే ఈ సినిమాలో హైలెట్. 

Get ready for an edge of your seat thriller 🔥
The story unfolds on September 30.@arulnithitamil @Mahima_Nambiar @ajmal_amir @vidya_actresss @sujavarunee @chayasingh16 @actorjohnvijay pic.twitter.com/Xq8fENo1cj

— ahavideoin (@ahavideoIN) September 25, 2022

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement