Arun Pandey
-
ఇక ధోని ఎక్కువ సమయం దానికే కేటాయిస్తాడు
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత ధోని ఎక్కువ సమయం ఆర్మీతో గడుపుతారని ఆయన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే తెలిపారు. ధోని రిటైర్మెంట్ నిర్ణయం వల్ల తన బ్రాండ్ వాల్యూ తగ్గుతుందనే వాదనను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా అరుణ్ పాండే మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచ కప్ తర్వాత ధోని రిటైర్మెంట్ గురించి ప్రకటన వస్తుందని నాకు తెలుసు. కానీ గత నెలలో అది 2022కి వాయిదా పడుతూ నిర్ణయం వెలువడింది. అయితే ఇంత అకస్మాత్తుగా ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను ఊహించలేదు. ఎందుకంటే ధోని ఇప్పటికే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ వాయిదా పడటం కూడా ధోని మీద ప్రభావం చూపించిందనుకుంటాను. ప్రస్తుతం అతడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నాడు. అందుకే ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు’ అన్నారు పాండే. (ఆ ఐదు నిర్ణయాలు.. ధోని ఏంటో చెప్తాయి) ఆగస్టు 15 ఆర్మీకి ఎంతో ప్రత్యేకం అందుకే ధోని ఆ రోజు తన నిర్ణయాన్ని వెల్లడించాడన్నారు అరుణ్ పాండే. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందారు ధోని. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమి తరువాత, అతను పారాచూట్ రెజిమెంట్‌తో కలిసి ఒక నెలకు పైగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఇక మీదట ధోని ఆర్మీతో ఎక్కువ సమయం గడుపతాడన్నారు పాండే. అంతేకాక వాణిజ్య కార్యక్రమాలకు, ఇతర కమిట్మెంట్లకు కూడా సమయం కేటాయిస్తాడని తెలిపారు. త్వరలోనే వీటి గురించి పూర్తి స్థాయిలో చర్చించి.. ముదుకు వెళ్తామన్నారు. (ధోనితో ఉన్న వీడియో షేర్ చేసిన యువీ) చాలా సందర్భాల్లో అథ్లెట్ బ్రాండ్ విలువ పదవీ విరమణ తర్వాత తగ్గుతుంది. కానీ ధోని విషయంలో అలా జరగదన్నారు పాండే. ‘ప్రపంచ కప్(జూలై 2019) నుంచి మేం పది కొత్త బ్రాండ్లతో సైన్ అప్ చేశాం. అవి కూడా లాంగ్ టర్మ్ అసైన్మెంట్లు. ధోని అంటే క్రికెట్ మాత్రమే కాదు యూత్ ఐకాన్. అతని విజయాలు వ్యక్తిగతమైనవి కావు.. అవి జట్టుకు, దేశానికి సంబంధించినవి. అందువల్లే ధోని విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు’ అన్నారు పాండే. ధోని మరో 2,3 ఐపీఎల్ సీజన్లలో ఆడతాడన్నారు పాండే. -
‘ధోనికి ఇప్పుడే ఆ ఆలోచన లేదు’
ముంబై : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనే లేదని అతడి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే స్పష్టం చేశాడు. ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అరుణ్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శుక్రవారం అరుణ్ మాట్లాడుతూ.. ‘ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన ధోనికి లేదు. అతడు వ్యక్తిగతంగా కంటే జట్టు ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ ఓ గొప్ప ఆటగాడి భవిష్యత్‌పై ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం’అంటూ పేర్కొన్నాడు. ఇక ఆదివారం వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకుపెడతారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో అతడిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ప్రపంచకప్‌లో బెస్ట్ ఫినిషర్‌గా విఫలమైన ధోనిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. -
మరో వారసురాలి ఎంట్రీ!
తమిళసినిమా: సాధారణంగా సినీ వారసులు నటులే అయ్యి ఉంటారు. నటీమణుల వారసత్వం తక్కువే. అయితే అది ఇంతకుముందు సంగతి. ఇప్పుడు వారసత్వ నటీమణుల సంఖ్య అధికం అవుతోంది. తాజాగా ఓ సీనియర్ నటుడి వారసురాలు కథానాయకిగా రంగప్రవేశం చేసింది. అరుణ్‌పాండియన్ ఈ పేరు తమిళసినిమాకు సుపరిచితం. కథానాయకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పలు చిత్రాలు చేసిన అరుణ్‌పాండియన్ వారసురాలు కథానాయకిగా రంగప్రవేశం చేసింది. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారిలో మూడో కూతురు కీర్తీపాండియన్. ఈమె ఇప్పటికే స్టేజీ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. తమిళం, ఆంగ్లం భాషల్లో ఇప్పుటికి 20కి పైగా నాటకాలాడింది. అంతే కాదు చిత్ర నిర్మాణరంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన తండ్రికి కుడిభుజంగా వ్యవహరించింది. అరుణ్‌పాండియన్ తమిళ చిత్రాలను సింగపూర్ వంటి విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. కాగా కీర్తీ పాండియన్కిప్పుడు రంగస్థలం నుంచి వెండితెరకు ప్రమోషన్ వచ్చింది. అవును ఈమె హీరోయిన్గా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. ఎదిర్‌నీశ్చల్, కాక్కీసట్టై చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన హరీష్‌రామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కనా చిత్రం ఫేమ్ దర్శన్ హీరోగా నటిస్తున్నారు. దీని గురించి కీర్తీ ఏమంటుందో చూద్దాం. గత 5 ఏళ్లుగా నాన్న వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నాను. సింగపూర్‌లో చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. అయితే నాకు నటన అంటే చాలా ఆసక్తి. గత మూడేళ్లుగా నాటకాల్లో నటిస్తున్నాను. నటనను నేర్చుకున్న తరువాతనే సినిమాల్లోకి రావాలని భావించాను. ఇంతకుముందు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడంతో అంగీకరించలేదు. నా నటనా ప్రతిభను నిరూపించుకోవాలనే గానీ హీరోయిన్ అనే పేరు కోసం నేనీ రంగంలోకి రావడంలేదు. ప్రస్తుతం నేను నటించడానికి అంగీకరించిన చిత్రం మంచి కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. సినీ రంగప్రవేశం చేసినా నాటకాల్లో నటిస్తూనే ఉంటా. నాటక రంగానికి దూరం కాలేను అని కీర్తీ పాండియన్ చెప్పింది. -
సీఈవోగా ధోనీ సడన్ సర్ ప్రైజ్
⇒ సరికొత్త అవతారంలో ధోనీ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదేంటీ.. క్రికెటర్ గా కొనసాగుతున్న మహీ కంపెనీ సీఈవోగా చేయడమేంటని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ 10 కోసం సన్నధ్దమైన పుణే సూపర్ జెయింట్స్ ఆటగాడు ఎంఎస్ ధోనీ సోమవారం ఓ కంపెనీకి ఒకరోజు సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఒకేఒక్కడు మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరోజు సీఎంగా వ్యవహరించినట్లే.. ధోనీకి ఒకరోజు సీఈవోగా చాన్స్ వచ్చింది. బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు వ్యవహరిస్తూ కనిపించిన ధోనీ.. సూట్ లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈవోగా కొత్త అవతారం ఎత్తాడు. సీఈవో కుర్చీలో ధోనీని చూసిన కంపెనీ ఉద్యోగులు షాక్ తిన్నారు. . ధోనీ స్నేహితుడు ఆ కంపెనీ కమర్షియల్ ఇంటరెస్ట్స్ మేనేజర్ అరుణ్ పాండే ఈ విషయాలను చెప్పారు. గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించాడు. సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని.. అయితే ఇప్పుడు సాధ్యమైందని పాండే వివరించారు.