Arun Pillai
-
ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు మరోసారి అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల సానుభూతి ప్రకటించారు విజయశాంతి. ఒక ఆడబిడ్డకు కష్టం రావొద్దు. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటాను అంటూ పేర్కొన్నారామె. అయితే.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత పేర్కొనడాన్ని విజయశాంతి తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు.. ఆ ఆవశ్యకత కూడా లేదు అంటూ వివరణ ఇచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అనే భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు అని పేర్కొన్నారామె. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు... ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే...… pic.twitter.com/osR7evW3M5 — VIJAYASHANTHI (@vijayashanthi_m) September 14, 2023 గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు.. బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్‌రామచంద్ర పిళ్లై మళ్లీ అప్రూవర్‌గా మారడం.. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడం.. ఆ వెంటనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం అంతా ఏడాది కాలంగా.. ఏదో టీవీ సీరియల్లాగా సాగుతోందని.. ఇవి ఈడీ నోటీసులు కావు మోదీ నోటీసులు అని, కేవలం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంతోనే మరోసారి రాజకీయం కోసం నోటీసులు పంపారంటూ కవిత స్పందించారు. తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటీసుల వ్యవహారంపై పూర్తిస్థాయి స్పందన తెలియజేస్తానని ఆమె అన్నారు. వాస్తవం కాదు: పిళ్లై లాయర్లు ఇదిలా ఉంటే.. మరోవైపు తాను అప్రూవర్‌గా మారలేదంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై తన న్యాయవాదుల నుంచి ఒక ప్రకటన విడుదల చేయించడం గమనార్హం. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద పిళ్లై ఎలాంటి వాంగ్మూలం న్యాయమూర్తి ఎదుట ఇవ్వలేదని, తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని, సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పిళ్లై తరపు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. -
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామంద్ర పిళ్లై మరోసారి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయమూర్తి ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై.. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం వచ్చారు. అయితే.. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడం ఇదేం కొత్త కాదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా మారి స్టేట్మెంట్ ఇచ్చిన పిళ్లై.. మాట మార్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలనుకొంటున్నట్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తన వద్ద రెండు పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకొన్నదని, ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించిందని వివరించారు. ఆ వాంగ్మూలాన్ని ముందు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి తాను సన్నిహితుడినంటూ ఒక కట్టుకథ అల్లుతున్నారని పేర్కొన్నారు. అయితే.. తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌గా మారి స్టేట్మెంట్ ఇవ్వడంతో.. ఈ కేసు దర్యాప్తుపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. పిళ్లై అప్రూవర్‌గా మారడం, జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారన్న ప్రచారాన్ని ఆయన లీగల్ టీం తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై అరుణ్‌రామచంద్ర పిళ్లైను ఈ ఏడాది మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ కేసులో మరో నిందితుడు సమీర్ మహేందు(ఇండో స్పిరిట్ ఎండీ) నుంచి లంచాలు తీసుకుని.. మరో నిందితుడికి ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అప్పటికే పిళ్లై కోకాపేట నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ.. వట్టినాగులపల్లి(రంగారెడ్డి) వద్ద ఆయనకు చెందిన రూ.2 కోట్ల విలువ చేసే భూమిని జప్తు చేసింది కూడా. అరెస్ట్ చేశాక.. పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. ఆయన కవిత బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పనిచేసినట్లు చెప్పింది. ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లైదే కీలక పాత్ర అని పేర్కొంది. మరోవైపు ఆగష్టులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. -
లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్ర పిళ్లైకు షాక్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్‌ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. కాగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పిళ్లై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక, అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఈ స్కామ్‌లో ఇతర విషయాల్లో పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్ 11న పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవితకు బదులు భాగస్వామిగా వ్యవహరించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ (ఎల్1) లో యాక్సెస్ వచ్చిందంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ను ఈడీ ప్రస్తావించింది. కవిత తెలంగాణ సీఎం కూతురని లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుకు పిళ్లై వివరించినట్లు తెలిపింది. మరోసారి విందులో పిళ్లై ఫోన్ ద్వారా ‘ఫేస్ టైమ్’లో సమీర్‌ను కవితతో మాట్లాడించినట్లు వివరించింది. ఈ సందర్భంగా కవిత, సమీర్‌ను అభినందించడమే కాకుండా, లిక్కర్ బిజినెస్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. కవిత, అరుణ్ పిళ్లైలు ఆప్ నేత, లిక్కర్ స్కామ్‌లో కీలకమైన విజయ్ నాయర్, దినేశ్ అరోరాలను గతేడాది ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో కలిసినట్లు పేర్కొంది. 2022లో హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను, సమీర్ కలిశారని, ఈ భేటీలో శరత్ చంద్రా రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ప్రస్తావించింది. ఇది కూడా చదవండి: సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్! -
లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆరోపిస్తున్నట్లుగా అరుణ్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి కాదని పిళ్లై తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టుకు తెలిపారు. అదేవిధంగా కుంభకోణంలో పిళ్లై పాత్ర లేదని పేర్కొన్నారు. మద్యం వ్యాపారంలో పిళ్లై సొంత సొమ్ము పెట్టుబడిగా పెట్టారని, మరెవరో సొమ్ము ఇండో స్పిరిట్స్‌లో పెట్టుబడిగా పెట్టలేదని స్పష్టం చేశారు. సొంత సొమ్ముతోనే భూములు కొనుగోలు చేశారని తెలిపారు. మద్యం పాలసీ రూపకల్పన, కిక్బ్యాక్స్లో కూడా పిళ్లై పాత్ర లేదని వివరించారు. కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ విచారించారు. ఆధారాల్లేకుండానే అరెస్టు చేశారు.. పిళ్లై తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వాంగ్మూలం రికార్డు చేసిన మూడు రోజులకే పిళ్లై దాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో అరెస్టు చేస్తామని అధికారులు బెదిరించడంతో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ సంతకం చేయాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా పిళ్లైని అరెస్టు చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, వాంగ్మూలం ఉపసంహరించుకున్నారంటూ బెయిల్ వ్యతిరేకించడం సరికాదని పేర్కొన్నారు. ఈడీ ఆరోపిస్తున్నట్లుగా పిటిషనర్ 2021, మార్చి 17 వరకూ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో లేరని, మార్చి 16నే ఖాళీ చేశారని తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి, బుచ్చిబాబులు మాత్రం మార్చి 17, 2021 వరకూ ఆ హోటల్లో ఉన్నారని తెలిపారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మార్చి 18, 2021న ఎక్సైజ్ శాఖ కార్యదర్శి డ్రాఫ్టు పాలసీ ఇచ్చారని, మార్చి16న హోటల్ ఖాళీ చేసిన పిటిషనర్ పాలసీని ఎలా ప్రింట్అవుట్ తీస్తారని ప్రశ్నించారు. కాగా తీర్పును రిజర్వు చేస్తున్నామని, ఈ నెల 8న బెయిల్‌పై నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పారు. ఇలావుండగా ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటుపై విచారణను న్యాయమూర్తి జూలై 6కు వాయిదా వేశారు. ఇది కూడా చదవండి: ఉద్యోగులకు సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్’.. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో ఉంటే బదిలీ -
కవిత అసలైన పెట్టుబడిదారు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసలైన పెట్టుబడిదారు అని.. ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్ పిళ్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ అనుబంధ చార్జిషీట్లో పేర్కొంది. రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌ల గురించి కవితకు తెలుసని పిళ్లై అంగీకరించారని తెలిపింది. సౌత్ గ్రూప్ (శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, కె.కవిత తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు)తో కలిసి మనీశ్ సిసోడియా, ఇతర ఆప్ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. లిక్కర్ విధానం కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ మంగళవారం పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జూన్ 1వ తేదీకి వాయిదా వేశారు. 278 పేజీల ఈ అనుబంధ చార్జిషీటులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును 53 సార్లు ప్రస్తావించింది. ఈడీ అనుబంధ చార్జిషీట్లో పేర్కొన్న ప్రధాన అంశాలివీ.. ► ఈ కేసుకు సంబంధించి 2022 నవంబర్ 11, 20 తేదీలతోపాటు 2023 ఫిబ్రవరి 16, మార్చి 6వ తేదీల్లో జరిగిన కార్యకలాపాల్లో కవిత తరఫు ప్రతినిధిగా ఇండో స్పిరిట్స్ (ఎల్1) భాగస్వామి అరుణ్ పిళ్లై పాల్గొన్నారు. ► 2022 ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఒబెరాయ్ మైడెన్స్‌లో విజయ్‌నాయర్, దినేశ్ అరోరాలతో కవిత, అరుణ్ పిళ్లై సమావేశమై సౌత్‌గ్రూపునకు కిక్ బ్యాక్‌ల రూపంలో చెల్లింపులపై చర్చించారు. ► కవిత తరఫున పనిచేస్తున్న వారికి కిక్‌బ్యాక్‌ల సొమ్ము చెల్లింపుకోసం ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంల తరఫున విజయ్‌నాయర్ పాలసీలో అనుకూలంగా మార్పులు చేశారని బుచ్చిబాబు వాంగ్మూలంలో వెల్లడించారు. ► మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్‌నాయర్‌తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు. ఢిల్లీ సీఎంతో మాగుంట శ్రీనివాసులురెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలోకి మాగుంట రాకను ఢిల్లీ సీఎం స్వాగతించారు. ► కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై, మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రతినిధిగా మేరకు ప్రేమ్ ఇండోస్పిరిట్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే దీనిలో 65 శాతం వాటా గురించి మాత్రం అరుణ్ పిళ్లైతోనే చర్చించానని, తానెప్పుడూ ప్రేమ్‌ను కలవలేదని సమీర్ మహేంద్రు వాంగ్మూలం ఇచ్చారు. ► అరుణ్ పిళ్లై, ఇతరులు కూడా ఇందులో అసలు పెట్టుబడిదారులు రాజకీయ సంబంధాలున్న కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్‌రెడ్డి అని పలు సందర్భాల్లో వెల్లడించారు. ► సమీర్ మహేంద్రు వాంగ్మూలం ప్రకారం.. తన వెనక ఎవరున్నారో చెప్పాలని అడగ్గా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అని సమీర్‌కు అరుణ్ పిళ్లై వెల్లడించారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందంటూ కవిత ఫేస్‌టైం యాప్‌లో సమీర్‌కు చెప్పారు. ఎల్1 దరఖాస్తు విషయంలో ఏవైనా ఇబ్బందులొస్తే ఏ సాయం కావాలన్నా అరుణ్ పిళ్లై ద్వారా తెలియజేయాలని సూచించారు. 2022 తొలినాళ్లలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతోపాటు సమీర్ మహేంద్రు, శరత్, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్పిళ్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకుతీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారు. ఈ సమయంలోనే ఇండోస్పిరిట్స్ ఎల్1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీశారు. ► ఢిల్లీలోని గౌరి అపార్ట్‌మెంట్స్‌లో భేటీ సందర్భంగా అర్జున్ పాండే, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లిలను విజయ్‌నాయర్ తనకు పరిచయం చేశారని.. వారు ఎంఎస్ రెడ్డి, కవితలకు బాగా దగ్గరవారని, మద్యం వ్యాపారంలో సాయం చేస్తారని చెప్పారని.. దినేష్ అరోరా ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ► దినేష్ అరోరా కవితతో రెండుసార్లు సమావేశమయ్యారు. ఒబెరాయ్‌లో సమావేశం సందర్భంగా అడ్వాన్స్ కిక్బ్యాక్స్ను విజయ్నాయర్కు చెల్లించడంపై చర్చించారు. ► రూ.100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండోస్పిరిట్స్‌లో వాటా ఇవ్వడంపై.. ఆమెకు, ఆప్ నేతలకు మధ్య అవగాహన/ఒప్పందం ఉందని అరుణ్ పిళ్లై తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ మేరకే తాను కవితకు ప్రాతినిధ్యం వహించానని, అవసరమైన పెట్టుబడి ఇస్తూ కాగితాలపై భాగస్వామి అయ్యారని తెలిపారు. తాను చాలా కాలంగా కవితకు స్నేహితుడినని పేర్కొన్నారు. పాలసీని అనుకూలంగా రూపొందించేలా.. ఢిలలిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేలా.. ఇందుకోసం ఆప్‌కు నిధులు సమకూర్చుకునేలా కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా బుచ్చిబాబు తన వాంగ్మూలంలో వెల్లడించారని చార్జిషీట్లో ఈడీ పేర్కొంది. ‘‘మార్చి 2021లో బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి తదితరులు విజయ్‌నాయర్, సమీర్ మహేంద్రులతో జూమ్‌లో సమావేశమై.. ఢిల్లీ మద్యం విధానంలో వ్యాపార అవకాశాలపై చర్చించారని బుచ్చిబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా పాలసీలో తానేం చేయగలనో చెప్పిన విజయ్‌నాయర్.. కవితను ఆకట్టుకొనే యత్నం చేశారని.. పాలసీని అనుకూలంగా రూపొందిస్తే ఆప్ పార్టీకి కొంత మొత్తం నిధులు సమకూర్చాలని కవితతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో మద్యం విధానం రూపకల్పనలో విజయ్‌నాయర్‌తో కలిసి అరుణ్ పిళ్లై పనిచేశారన్నారు. మార్చి 2021లో పాలసీకి సంబంధించి మంత్రుల బృందం కాపీ గురించి అడగ్గా విజయ్‌నాయర్ తనకు, పిళ్లైకి పంపారని.. పిళ్లై ఆ కాపీని తన రెండో ఫోన్లోకి కాపీ చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో ఆప్, విజయ్నాయర్కు పిళ్లై ద్వారా కవిత నిధులు సమకూర్చారని వివరించారు. కవిత, ఆప్ అగ్రనేతలకు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. సమీర్, పెర్నార్డ్ రికార్డ్‌లో కవితకు వాటాలు దక్కాయని.. కవిత సూచనల మేరకు అరుణ్ పిళ్లై తన పేరుమీదే పెట్టుబడులు పెట్టారని, వ్యాపారంలో వాటా కూడా నేరుగా కవిత ఖాతాల్లోకి రాలేదని బుచ్చిబాబు పేర్కొన్నారు. సౌత్‌గ్రూప్‌కు కిక్‌బ్యాక్‌లను క్రెడిట్ నోట్స్ ద్వారా అభిషేక్, దినేష్ అరోరాలకు అమన్ధాల్ చెల్లించారని.. కొంతభాగాన్ని మాత్రం అభిషేక్ బోయినపల్లికి నగదురూపంలో చెల్లించారని బుచ్చిబాబు వివరించారు.’’ అని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. సౌత్‌గ్రూప్ అని ఎందుకు అన్నామంటే..? ఈ కేసులో కొందరి బృందాన్ని సౌత్ గ్రూపు అని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్లో వివరించింది. దర్యాప్తు సమయంలో పలువురు వ్యక్తులు సౌత్‌గ్రూప్ అని ప్రస్తావించడం వల్లే.. ఆ గ్రూప్‌లోని ప్రతినిధుల గురించి చార్జిషీట్లో సౌలభ్యం నిమిత్తం సౌత్ గ్రూపుగా పేర్కొంటున్నామని తెలిపింది. సౌత్ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, శరత్‌రెడ్డి, కె.కవిత ప్రముఖ వ్యక్తులని తెలిపింది. ఈ సౌత్‌గ్రూపునకు ప్రతినిధులుగా అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు బదిలీ చేయడానికి విజయ్ నాయర్, దినేశ్ అరోరాలతో కలిసి అభిషేక్ బోయినపల్లి కుట్ర చేశారని పేర్కొంది. హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారు ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది. మంగళవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తారు. ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపారు. ఈ కేసులో కవితకు ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించారన్నారు. దీనిపై తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని పిళ్లై తరఫు న్యాయవాది కోరగా.. విచారణ జూన్2కు వాయిదా వేశారు.