arunamma
-
అరుణక్కా.. క్షమించు..!
చిత్తూరు, తిరుపతి రూరల్: ‘అరుణమ్మ అడుగుజాడల్లో 31 ఏళ్ల పాటు రాజకీయాల్లో నడిచా. ఆమె కష్టాల్లోనూ, పోరాటాల్లోనూ, విజయాల్లోనూ కలసి పనిచేశా. నాకు ఇష్టం లేకపోయినా కేవలం ఆమె కోసమే టీడీపీలోకి వచ్చా. అయితే టీడీపీలో స్వార్థం పెరిగిపోయింది. అవకాశవాద రాజకీయాలతో భ్రష్టు పట్టిపోతోంది. విలువలు లేని రాజకీయాలు చేస్తున్న టీడీపీలో ఉండలేను. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా’నని పాకాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నంగా నరేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పాకాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అరుణమ్మ నాయకత్వంలోనే పనిచేశామన్నారు. ఆమె దగ్గర గౌరవంగానే నాయకుడిగా ఎదిగామన్నారు. చంద్రగిరి బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నాక పార్టీలో జరుగుతున్న పరిణా మాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది కనుక ఆకాశమైనా తెచ్చి నీ అరచేతిలో పెడతామన్నంతగా అమలు సాధ్యం కానీ హామీలను అవలీలగా ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇదే పార్టీలో ఉండి తాము అవమానాలు పడలేమన్నారు. రోజుకో మాట, పూటకో పొత్తుతో రోజు రోజుకు దిగజారిపోతున్న టీడీపీలో ఆత్మాభిమానం ఉన్న నాయకులు ఉండలేరని, అందుకే ఆత్మాభిమానం ఉన్న నాయకులు టీడీపీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. -
మహిళా సర్పంచ్ ఆత్మహత్య
మహిళా సర్పంచ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం వెలుగుచూసింది. స్థానిక యాదవ వీధిలో నివాసముంటున్న అరుణమ్మ(34) వెంకటతిమ్మాపురం గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పసిపాపలతో పట్టాలపై...
ముగ్గురు కూతుళ్లతో రైలు కింద పడిన తల్లి చివరి నిమిషంలో పెద్దకుమార్తెను పక్కకు తోసేసిన ‘కన్న మనసు’ తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతి భువనగిరి: ఓ తల్లి ఇద్దరు కూతుళ్లు సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చివరి నిమిషంలో తన పెద్ద కుమార్తెను పక్కకు తోసేయడంతో ఆ చిన్నారి బతికిపోయింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా భువనగిరి శివారులోని జగ్దేవ్పూర్ రైల్వేగేట్ వద్ద జరిగింది. ప్రాణాలతో బయటపడిన చిన్నారి వనజ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు శివారు ఎంకమ్మగూడేనికి చెందిన అరుణమ్మ (35)కు కుమార్తెలు వనజ (9), మౌనిక (3), పూజ (6 నెలలు) కు ఉన్నారు. కొద్ది నెలల క్రితం భర్త చనిపోవడంతో పుట్టింటికి చేరిన అరుణమ్మ కూలీనాలీ చేసుకుని జీవిస్తోంది. ఆమెకు సోదరులు నర్సింహ, కిష్టయ్య, యాదయ్య, పెంటయ్య ఉన్నారు. ఆదివారం వారితో గొడవ పడిన అరుణమ్మ తన ముగ్గురు పిల్లలను తీసుకుని హైదరాబాద్ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి అక్కడే నిద్రపోయిన నలుగురు సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సులో భువనగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ జగ్దేవ్పూర్ గేట్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కూతుళ్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని పట్టాలపై ఆఫ్‌లైన్‌లో కూర్చుంది. విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్తున్న రైలు దగ్గరకు రాగానే ఆ తల్లి హృదయం కరిగిందో తెలియదు కానీ... తన ఒడిలోని పెద్ద కుమార్తె వనజను పక్కకు నెట్టేసింది. రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తల్లి అరుణమ్మ, మౌనిక, పూజ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిసేపటి దాకా వనజకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత రోదిస్తూ సమీపంలోని గేట్‌మన్ వద్దకు వెళ్లి ‘మా అమ్మ, చెల్లెళ్లు రైలుకింద పడి చనిపోయారు’ అని చెప్పింది. రైల్వే పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.