ASCA
-
ఆస్కా ఎన్నికల భేరి
తమిళనాడులోని తెలుగువారికి ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా)లో ఎన్నికల భేరి మోగింది. ఈనెల 29వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం రెండు ప్యానళ్లలో కసరత్తు మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆనాటి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చి మద్రాసులో స్థిరపడిన కొందరు తెలుగు ప్రముఖులు సాయంవేల కాలక్షేపానికి ఒక క్లబ్ ఉంటే బాగుంటుందని తలచారు. పలువురు సినీదిగ్గజాలు, ఇతర పెద్దలు కలుసుకుని సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆంధ్రాక్లబ్ను నెలకొల్పారు. అయితే కేవలం మగవారికే పరిమితమైన ఈ క్లబ్ కొన్నేళ్ల తరువాత ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్‌గా మారింది. ఈ మార్పు తరువాత ఆస్కాలో జరిగే కార్యక్రమాలకు కుటుంబ సమేతంగా హాజరవుతూ ఆనందించడం ప్రారంభమైంది. తొలి దశలో నామమాత్ర రుసుముతో దొరికే ఆస్కా సభ్యత్వం ఇటీవల సాధారణ కుటుంబాలకు అందని ద్రాక్షపండుగా మారింది. ఆస్కాలో సభ్యత్వం అంటే సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం నెలకొనడంతో పాలకవర్గ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రతిసారి గట్టి పోటీ అనివార్యంగా మారింది. గత ఎన్నికల్లో పల్లవ గ్రానైట్స్ అధినేత డాక్టర్ కే సుబ్బారెడ్డి ప్యానల్ మొత్తం గెలుపొంది సంచలన విజయం నమోదైంది. ఆనాటి ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీకి దిగిన సుబ్బారెడ్డిపై పోటీకి ఎవరూ సాహసించలేక పోయారు. దీంతో సుబ్బారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది, కార్యదర్శిగా ఎం చక్రవర్తి గెలుపొందగా రావి సాంబశివరావు ఓడిపోయారు. కొత్త ప్యానళ్ల కసరత్తు: ఇదిలా ఉండగా, తాజా ఎన్నికలు సైతం హోరాహోరీగా సాగే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు ప్యానళ్ల నుంచి ఎంతో పలుకుబడి కలిగిన మహాదిగ్గజాలు రంగంలోకి దిగడం ఎన్నికల్లో వేడిపుట్టిస్తోంది. గత ఎన్నికల్లో కార్యదర్శిగా గెలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం చక్రవర్తి, సంయుక్త కార్యదర్శిగా గెలుపొందిన ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి ఒక ప్యానల్ నుంచి అధక్ష, కార్యదర్శులుగా పోటీ చేస్తున్నారు. అలాగే ఆస్కా అధ్యక్షుడిగా అనేకసార్లు గెలుపొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ‘కెన్సెస్’ గ్రూపు సంస్థల చైర్మన్ నరసారెడ్డి అధ్యక్షుడిగా, గతంలో కార్యదర్శిగా పనిచేసిన రావి సాంబశివరావు కార్యదర్శిగా మరో ప్యానల్ నుంచి పోటీకి దిగుతున్నారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా ఇరు ప్యానళ్లలోని మిగతా అభ్యర్థుల కోసం శుక్రవారం రాత్రి వరకు కసరత్తు సాగింది. 29న పోలింగ్: గత పాలకవర్గ రెండేళ్ల గడువు ముగిసిపోగా తాజా ఎన్నికల కోసం ఈనెల 4వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. 9వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా శనివారం (14వ తేదీ)తో నామినేషన్ల గడువు ముగుస్తోంది. 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 19వ తేదీన పోలింగ్‌గా నిర్ణయించారు. ఆఫీస్ బేరర్స్‌గా ఆరుగురిని, కమిటీ సభ్యులుగా 9 మందిని, ఆస్కా ట్రస్ట్‌కు మరో 9 మందిని ఎన్నికల్లో ఎన్నుకోనున్నారు. -
డబ్ల్యూటీవోలో భారత్ అనుకూల తీర్పు
జెనీవా: భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల ఉక్కు ఉత్పత్తులపై అమెరికా ఏఎస్‌సీఎం ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా 300 శాతం సుంకాలను విధించడాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తప్పుబట్టింది. వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ డబ్ల్యూటీవో అప్పీలేట్ బాడీ తీర్పు వెలువరించింది. అమెరికా చర్యపై భారత్ 2012లో డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత జూలైలో డబ్ల్యూటీవో విచారణ జరిపింది. -
‘ఆస్కా’ సమరం
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని తెలుగు ప్రజలు, ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఒకచోట కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకునేందుకు 1952లో ఏర్పడిన ఆస్కా నేడు ఒక పెద్ద ప్రతిష్టాత్మక సంఘంగా ఎదిగింది. తొలిరోజుల్లో ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు 16 ఏళ్లు ఎన్నో కష్టనష్టాల కోర్చి నడిపారు. తర్వాత ఈఎస్ రెడ్డి, ఎం.ఆదిశేషయ్య, కె.నరసారెడ్డి, కొడవలూరు సుబ్బారెడ్డి తదితర ఎందరో తెలుగు ప్రముఖులు తమ వంతు జీవం పోశారు. ఆంధ్రాక్లబ్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఆస్కా కమిటీకి అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులుగా ఎన్నిక కావడమే కాదు, సాధారణ సభ్యత్వం ఉన్నా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎవరి ధీమా వారిది ఆస్కాకు హోరాహోరీగా సాగుతున్న ద్విముఖపోరులో రెండు ఫ్రంట్ల వారూ గెలుపు తమదేనంటున్నారు. ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరపున తాజా మాజీ అధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, డెమొక్రటిక్ ఫ్రంట్ తరపున మాజీ అధ్యక్షులు ఎం.ఆదిశేషయ్య అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. వేణుగోపాల్ అనే వ్యక్తి అధ్యక్షునిగా, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి కార్యదర్శిగా స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచారు. రెండు ఫ్రంట్లలోని అభిమానుల ఓట్లు, ఆ రెండింటికీ దూరంగా మెలిగే తటస్థ సభ్యుల ఓట్లను కొల్లగొట్టాలనే వ్యూహంతో రంగంలోకి దిగిన జేకే రెడ్డి సైతం గెలుపుధీమాతో ఉన్నారు. మొత్తం 4 వేల వరకు సభ్యత్వం కలిగిన ఆస్కాలో 2,759 మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆదివారం ఉదయం 9నుంచి 1గంట వరకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 8గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. భోజన విరామం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ఆస్కా చరిత్రలోనే తొలిసారిగా ఓటింగ్‌కు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఓటింగ్‌లో అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. అభివృద్ధే నినాదం: ఆదిశేషయ్య అభివృద్ధి బాటలో, అందరికీ అందుబాటులో నినాదమే నా ప్యానల్‌ను గెలిపిస్తుంది. గతంలో అధ్యక్షునిగా ఎనిమిదేళ్లు చేసిన అభివృద్ధే ఈనాటి ప్రగతికి పునాదులుగా చెప్పవచ్చు. నా హయాంలో జరిగిన సంస్కరణల వల్లే నేడు ఆస్కా కుటుంబ సభ్యులందరికీ ప్రీతిపాత్రమైంది. భవిష్యత్తులోనూ మరింత ముందుకు సాగాలన్న ఉద్దేశంతో మా ప్యానల్లో కొత్తవారికి అవకాశం కల్పించాను.