Ashok Chakra
-
పాయింట్ బ్లాంక్‌లో గన్.. భయపడని వీర మహిళ
పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ ఉన్న బయటపడని నైజం ఆమెది. తనని షూట్ చేస్తారని తెలిసిన ప్రాణం కోసం కాళ్లమీద పడకుండా ఎదురొడ్డి పోరాడిన సాహసి ఆమె. వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు అయినా మనసు మాత్రం హిమాలయ శిఖరమంతా. తాను చనిపోతున్న సమయంలోనూ ముగ్గురు చిన్నారులకు రక్షణ కవచంలా నిలిచి మరీ మృత్యువును ఆహ్వానించిన త్యాగశీలి. ఆమె ఎవరో కాదు అతిచిన్న వయసులోనే ఎంతో ధైర్యసాహసాలు చూపి ఆశోకచక్ర అవార్డును పొందిన నీరజా భనోత్. సెప్టెంబర్5, 1986 భారతదేశంలో మర్చిపోలేని ఒక సంఘటన. విచక్షణారహితంగా ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి చాలా మంది ప్రాణాలను బలిగొన్న రోజు. ఆరోజే ఒక అపురూపమైన వ్యక్తి గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి తెలిసిన రోజు. ఈ రోజు నీరజ భనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు జరిగిన సంఘటనను, ఆమె ధైర్యసాహసాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సెప్టెంబర్ 5, 1986, ముంబై నుంచి కరాచీ మీదుగా న్యూయార్క వెళ్లాల్సిన విమానం మేఘాలను చీల్చుకుంటూ ముందుకు సాగిపోతోంది. సరిగ్గా ఉదయం 4:30కి కరాచీ విమానాశ్రయంలో దిగింది. అక్కడ దిగాల్సినవాళ్లు దిగారు. ఎక్కాల్సినవాళ్లు ఎక్కారు. విమానం మళ్లీ గాల్లోకి లేవనుంది. సరిగ్గా అప్పుడే మూడు సార్లు తుపాకి పేల్చిన చప్పుడు. ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఎదురుగా ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ దుస్తులు వేసుకున్న నలుగురు సాయుధులు. తుపాకులు చూపిస్తూ అందరినీ చేతులు వెనక్కి పెట్టుకొమ్మని ఆదేశించారు. పెట్టుకున్నాక కట్టేశారు. చివరికి కెప్టెన్‌ని, కో-పెలైట్‌ని, కాక్‌పిట్ క్రూని కూడా బంధించారు. ఒకే ఒక్కరిని తప్ప. ఆమె నీరజా భనోత్. పంజాబ్‌లో పుట్టి, ఫ్లయిట్ అటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఇరవ రెండేళ్ల యువతి. హైజాకర్లు విమానం ఎక్కగానే క్రూ మెంబర్స్‌ని అలర్ట్ చేసింది నీరజ. దాంతో పైలట్లు తమ విజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్లయిట్‌ను ఎగరకుండా చేశారు. ఆ తర్వాత విమానాన్ని హైజాక్ చేయాలన్న దుండగుల పథకం ఫెయిలైంది. దాంతో వాళ్ల కోపం కట్టలు తెంచుకుంది. సైప్రస్‌కు విమానంతో సహా వెళ్లి, అక్కడ జైల్లో ఉన్న తమవారిని విడుదల చేయించాలన్న ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ ప్రతాపం ప్రయాణికుల మీద చూపించడం మొదలు పెట్టారు. కొందరిని చంపేశారు. మిగిలిన వాళ్ల పాస్‌పోర్టులు సేకరించమని నీరజకు పురమాయించారు. అయితే అందరిని సౌకర్యంగా ఉంచే ఆమె, ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలా అన్న ఆలోచనలో పడింది. ధైర్యం ఆమె నరనరాల్లో ఉంది. కొంతమంది పాస్ పోర్టులు దాచేసింది. ఉగ్రవాదులు కొందరిని హింసించబోతే అడ్డుకుంది. వాళ్లను కట్టడి చేసేందుకు పదిహేడు గంటలపాటు ప్రయత్నించింది. కానీ చివరికి ఉగ్రవాదులు సహనం కోల్పో యారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. దాంతో ఎమర్జెన్సీ ద్వారం గుండా ప్రయాణికుల్ని తప్పించే ప్రయత్నం మొదలుపెట్టింది నీరజ. ఆ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టేశారు. అందుకు శిక్షగా ఆమె ప్రాణాలనే తీసేసుకున్నారు. నీరజ మరణం అందర్నీ కలచి వేసింది. ఆ రోజు ప్రాణాలతో బయటపడిన వాళ్లంతా ఇప్పటికీ నీరజను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఉగ్రవాదులు ఫ్లయిట్ ఎక్కేటప్పటికి ఎంట్రన్స్ దగ్గర ఉన్న నీరజకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోలేదని చెబుతుంటారు. అందుకే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సోనమ్ కపూర్ హీరోయిన్గా ‘నీర్జా’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆరోజు జరిగిన ప్రతి సంఘటనను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నీరజ ధైర్య సాహసాలను కొనియాడారు. ఎంతో మందికి నీరజ ఆదర్శంగా నిలిచారు. (యూనిఫామ్‌లో.. శాంతి పావురం!) -
లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీకి అశొక్చక్ర
-
అహ్మద్ వనీకి ‘అశోక చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్‌నాయక్ నజీర్ అహ్మద్ వనీ(38)కి కేంద్రం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2018, నవంబర్ 25న షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ వనీ ప్రాణాలు కోల్పోయారు. శరీరంలోకి బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నప్పటికీ ఓ లష్కరే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాతే ఆయన నేలకొరిగారు. ఈ నేపథ్యంలో వనీ చూపిన ధైర్యసాహసాలకు గానూ శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వనీ భార్య మహజబీన్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 2004లో వనీ ఆర్మీలోని ‘జమ్మూకశ్మీర్ 162 ఇన్ఫాంట్రీ బెటాలియన్’లో చేరారు. ఉగ్రవాదులపై పోరాటంలో చూపిన తెగువకు గానూ 2007, 2018లో సేనామెడల్‌ను అందుకున్నారు. కుల్గామ్ జిల్లాలోని ఛెకీ అష్ముజీ గ్రామానికి చెందిన వనీకి భార్య మహజబీన్తో పాటు కుమారులు అథర్, షహీద్ ఉన్నారు. ఆయనకు డ్యూటీనే అత్యుత్తమం నజీర్ వనీ కుటుంబాన్ని అమితంగా ప్రేమించేవారని ఆయన భార్య, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహజబీన్ తెలిపారు. వనీ ధైర్యవంతుడైన సైనికుడనీ, తన రాష్ట్రంలో శాంతి కోసం పరితపించేవాడని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితాంతం వనీ పలు ప్రమాదాలను ఎదుర్కొన్నాడనీ, చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడని జవాన్లు అన్నారు. -
ఒడిశా పోలీసుకు అశోకచక్ర
న్యూఢిల్లీ: నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదివారం వెల్లడించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు. నాడు నక్సల్స్ వీరంగం.. 2008, ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో వీరంగం సృష్టించారు. నయాగఢ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రం, సమీపంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు, నయాగడ్ ఔట్‌పోస్ట్, గంజాం జిల్లాలోని ఒక ఔట్‌పోస్ట్, పోలీస్ స్టేషన్లపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన నక్సలైట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని 1200కు పైగా అధునాతన ఆయుధాలను కొల్లగొట్టారు. వారిని నిలువరించే క్రమంలో 14 మంది పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఆ తరువాత మావోయిస్టులు పోలీసుల వాహనాల్లోనే సమీపంలోని గంజాం, ఫూల్బాని అడవుల్లోకి పారిపోయారు. అనంతరం, ఎస్ఓజీ, ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బృందాలు.. మావోయిస్టులు దాక్కున్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. సత్పతి నేతృత్వంలోని బృందం మావోలపై దాడిని తీవ్రతరం చేసింది. కానీ నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాల ముందు భద్రతా దళాలు నిలవలేకపోయాయి. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సత్పతి మరణించారు. -
గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి భావోద్వేగం
-
గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రపతి అవార్డుల ప్రదానం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులతో పోరులో అసువులు బాసిన కార్పొరల్ ‘జ్యోతి ప్రకాష్ నిరాలా’కు ప్రకటించిన అశోక్ చక్ర అవార్డును అందించిన అనంతరం ఆయన కొద్దిసేపు ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడ వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. అమరుడు జ్యోతి ప్రకాష్ తరపున ఆయన భార్య సుష్మానంద్ రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ చక్ర శౌర్య పతకాన్ని అందుకున్నారు. ఆమె వెంట జ్యోతి ప్రకాష్ తల్లి మాలతీదేవి కూడా ఉన్నారు. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మంది అధికారులకు రాష్ట్రపతి సాహస పురస్కారాలు లభించాయి.. వీటిలో ఒక కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ్ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు కూడా రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిరాలాకు ‘అశోక్ చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన వైమానిక దళం గరుడ్ కమాండో జ్యోతి ప్రకాశ్ నిరాలాకు కేంద్రం ‘అశోక్ చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మందికి రాష్ట్రపతి సాహస పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఒక కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ్ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించారు. 2017 నవంబరులో కశ్మీర్‌లోని బందిపొర జిల్లా చందర్గెర్లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు గరుడ్ ప్రత్యేక దళానికి చెందిన ప్రకాశ్‌తోపాటు మరికొందరు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులు దాగున్న సంగతి తెలిసిన గరుడ్ దళం ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టింది. కార్పొరల్ ప్రకాశ్ మాత్రం ప్రమాదాన్ని లెక్కచేయకుండా స్థావరం అతి సమీపంలోకి వెళ్లి ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిరాలా తుదిశ్వాస విడిచారు. కాగా, సీఆర్పీఎఫ్కు చెందిన ఇద్దరు కమాండోలకు కేంద్రం శౌర్యచక్ర పురస్కారం ప్రకటించింది. జార్ఖండ్‌లోని లతేహార్లో ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టటంతోపాటు ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకోవటంలో అసిస్టెంట్ కమాండెంట్ జఖార్తోపాటు ఆయన బృందంలోని సబ్ ఇన్స్పెక్టర్ రియాజ్ ఆలం కీలకంగా వ్యవహరించారు. -
రిమ్స్‌లో దేశ చిత్రపటానికి అవమానం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో మంగళవారం స్వాతంత్య్ర వేడుకల్లో దేశ చిత్రపటానికి అవమానం జరిగింది. జాతీయ పతాకంలోని మూడు రంగులతో వేసిన భారత దేశ చిత్రపటంపై నిలబడి రిమ్స్ డైరెక్టర్ అశోక్ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.జాతీయ పతాకం రంగుల్లో అశోక్ చక్రం చిత్రపటంపై నిలుచున్న డైరెక్టర్ తీరు అక్కడున్న వారిని విస్మయపర్చింది. -
నా కూతురు, కొడుకు కూడా...
సైన్యంలో చేరాలని కోరిక అశోక్చక్ర అవార్డు గ్రహీత హవల్దార్ హంగ్పన్ దాదా భార్య లోవాంగ్ న్యూఢిల్లీ: దేశం కోసం తన భార్త ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందని, అయితే, తన కూతురు, కుమారుడు కూడా సైన్యంలో చేరాలని కోరుకుంటున్నానని అశోక్చక్ర అవార్డు గ్రహీత, అస్సాం రెజిమెంట్‌కు చెందిన దివంగత హవల్దార్ హంగ్పన్ దాదా భార్య చాసెన్ లోవాంగ్ అన్నారు. తన పిల్లలు సైన్యంలో చేరి తండ్రి మాదిరిగా దైర్యసాహసాలను ప్రదర్శించాలని ఆమె కోరుకుంటోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. గత మే 26న హంగపన్ దాదా జమ్ము, కశ్మీర్లో టెర్రరిస్టులతో హోరాహోరీ పోరాడి ముగ్గురిని హతమార్చి తాను అసువులు బాసిన విషయం తెలిసిందే. టెర్రరిస్టులను ఎదుర్కోవడంలో దాదా ప్రదర్శించిన దైర్యసాహసాలకుగాను ఆయనకు అశోక్చక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తన భర్త దైర్యసాహసాలకు అత్యున్నత పురస్కారం రావడం ఆనందంగా ఉందని, అదే సందర్భంలో బాధగా కూడా ఉందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లలు కూడా సైన్యం చేరాలని తన భర్త తరచూ అనేవారని ఆమె గుర్తు చేశారు. విష సర్పాల కంటే ఉగ్రవాదులు ప్రమాదకారులని వ్యాఖ్యానించారు. -
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు
-
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు
-
మంచు వర్షంలో రిపబ్లిక్ డే వేడుకలు
-
మంచువర్షంలో రిపబ్లిక్ డే వేడుకలు
విపరీతమైన మంచు వర్షం నడుమ దేశరాజధాని నగరం న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. కాసేపటి తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంచు దాదాపు వర్షంలా కురుస్తుండటంతో ముఖ్య అతిథులతో పాటు దాదాపు వేడుకలకు హాజరైనవాళ్లంతా గొడుగులు పట్టుకునో, తలపై పుస్తకాలు పెట్టుకునో ఉండక తప్పలేదు. పెరేడ్ మార్గం కూడా మొత్తం మంచుతో తడిసిపోయింది. అనంతరం అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను దివంగత సైనికాధికారుల భార్యలకు అందించారు. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందూ ముకుంద్‌కు అశోకచక్రను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. అనంతరం దివంగత నాయక్ నీరజ్‌కుమార్ సింగ్ భార్య పరమేశ్వరీ దేవికి కూడా అశోకచక్రను బహూకరించారు.