అశ్విన్ 1.. అశ్విన్ 3
దుబాయ్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానం కోల్పోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. బుధవారం విడుదల చేసిన బౌలర్ల ర్యాంకింగ్ జాబితాలో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ మళ్లీ అగ్రస్థానం దక్కించుకోగా, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రెండోర్యాంక్తో సరిపెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌లో స్టెయిన్ 8 వికెట్ల పడగొట్టడంతో ర్యాంక్ మెరుగుపడింది. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాండ్ నాలుగు, శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ ఐదు స్థానాల్లో నిలిచారు. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ రెండు, ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ మూడు స్థానాల్లో నిలిచారు. కాగా బ్యాట్స్‌మెన్ జాబితాలో పెద్దగా మార్పుల్లేవు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫస్ట్ ర్యాంక్ కాపాడుకోగా, జో రూట్, కేన్ విలియమ్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత ఆటగాడు రహానె ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.