asia cup tourny
-
‘ఆసియా కప్ వేదికను మారిస్తే.. టోర్నీలో పాక్ ఆడదు.. అంతేకాదు..’
ఆసియాకప్-2023 షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ వేదికగా జరగాల్సింది. ఈ క్రమంలో భారత జట్టు ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వెళ్లనుంది అని ఊహాగానాలు వినిపించాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఊహాగానాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా తోసిపుచ్చారు. వచ్చే ఏడాది ఆసియాకప్ తటస్థ వేదికపై జరుగుతుందని ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఈ టోర్నీ నిర్వహణపై వివాదం మొదలైంది. ఇక మరోసారి ఆసియాకప్ నిర్వహణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా కీలక వాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది తమ దేశంలో ఆసియాకప్‌ను నిర్వహించకపోతే.. ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటుంది అని రమీజ్ రాజా తెలిపారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో రమీజ్ మాట్లాడుతూ.. "మాకు టోర్నీని నిర్వహించే అతిథ్య హక్కులు ఇవ్వకపోతే.. మేము కావాలని వేడుకోము. ఎందుకంటే అతిథ్య హక్కులు పారదర్శకంగా మేము సంపాందించుకున్నాం. పాక్‌లో ఆడేందుకు భారత జట్టు రావడం రాకపోవడం వారి ఇష్టం. కానీ ఆసియాకప్‌ను తటస్థ వేదికపై నిర్వహిస్తే.. మేము టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. భారత్ ఆసియాకప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వస్తే.. మా జట్టు ప్రపంచకప్‌లో ఆడేందుకు భారత్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ వాళ్లు రాకుంటే.. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ భాగం కాదు. పాకిస్తాన్ టోర్నీలో లేకపోతే ఎవరు చూడరు. గత కొంత కాలంగా మా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో కూడా ఆడాము" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిటన్ దాస్ -
మహిళల ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఆసియా కప్ మహిళల పుట్‌బాల్ టోర్నీ’ ఆతిథ్య హక్కులు 41 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కాయి. 2022లో నిర్వహించనున్న ఈ టోర్నీకి భారత్ వేదికగా నిలువనుందని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) శుక్రవారం ప్రకటించింది. ‘ఏఎఫ్సీ మహిళల పుట్‌బాల్ కమిటీ సిఫార్సుల మేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కు కట్టబెడుతున్నాం’ అని ఏఎఫ్సీ కార్యదర్శి డాటో విండ్సర్ జాన్ తెలపారు. భారత్ చివరిసారి 1979లో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఈ అవకాశమిచ్చిన ఎఎఫ్‌సీకి ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మహిళల ఫుట్‌బాల్ అభివృద్ధికి, ఔత్సాహిక ఫుట్‌బాలర్లను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. 12 జట్లు తలపడనున్న ఈ టోర్నీలో ఆతిథ్య దేశం హోదాలో భారత్ నేరుగా అర్హత పొందుతుంది. 2023లో జరుగనున్న ‘ఫిఫా’ మహిళల ప్రపంచకప్ టోర్నీకి ఇదే అఖరి క్వాలిఫికేషన్ ఈవెంట్ కావడం గమనార్హం. -
ధోని అండ ఉందిగా!
దుబాయ్: ఆసియా కప్ టోర్నీకి విరాట్ కోహ్లి దూరమైనా... అత్యంత అనుభవజ్ఞుడు మహేంద్ర సింగ్ ధోని అండతో భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తుందని బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు విశ్వాసం వ్యక్తం చేశాడు. గతంలోనూ ధోని తమను నడిపించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ‘కోహ్లి లేకపోవడం లోటే. అయితే విజయాలు సాధించగల నైపుణ్యం ఈ జట్టుకు ఉంది. ధోని కెప్టెన్‌గా పని చేశాడు. జట్టులో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా అండగా నిలిచేందుకు అతను సిద్ధంగా ఉంటాడు. వ్యక్తిగతంగా చూసినా ఈ సీజన్లో నేను మళ్లీ కోలుకొని బాగా ఆడేందుకు అతను ఎంతో సహకరించాడు’ అని రాయుడు పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన తర్వాత కూడా యో యో టెస్టులో విఫలం కావడంతో స్థానం కోల్పోయిన రాయుడు... ఇప్పుడు యో యోలో పాస్ అయి మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ‘ఇంగ్లండ్ టూర్‌కు దూరం కావడం సహజంగానే అసహనానికి గురి చేసింది. అయితే ఆసియా కప్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఈసారి ఐపీఎల్లో చాలా బాగా ఆడాను. ఫిట్‌గా ఉన్నంత వరకు వయసు అడ్డంకి కాబోదు’ అని 32 ఏళ్లు రాయుడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆసియా కప్‌పైనే అందరి దృష్టి ఉందని, వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ గురించి, మిడిలార్డర్లో తన స్థానం గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదని అతను స్పష్టం చేశాడు. ‘మిడిలార్డర్లో పోటీ ఉందని భావించడం లేదు. నా సత్తా నిరూపించుకునేందుకు దీనిని మంచి అవకాశంగా భావిస్తున్నా. అయితే ఇలా ఆలోచించి నాపై ఒత్తిడి పెంచుకోను. నేనే కాదు జట్టులో ఎవరికీ ప్రస్తుతం వరల్డ్ కప్ గురించి ఆలోచన లేదు’ అని రాయుడు చెప్పాడు. -
ఫుట్‌బాల్ ఆసియా కప్–2019కు భారత్ అర్హత
ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2019 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ అర్హత సాధించింది. మకావుతో బెంగళూరులో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలిచింది. భారత్ తరఫున రౌలిన్ బోర్జెస్ (28వ ని.లో), కెప్టెన్ సునీల్ చెత్రి (60వ ని.లో), జెజె లాల్‌పెకులువా (90వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. 70వ నిమిషంలో మకావు ఆటగాడు లామ్ కా సెంగ్ సెల్ఫ్ గోల్ సాధించగా... 37వ నిమిషంలో నికొలస్ తరావు మకావుకు తొలి గోల్ అందించాడు. 2019 ఆసియా కప్ యూఏఈలో జరుగుతుంది. 2011 తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్ మరోసారి అర్హత పొందింది. -
ఆసియాకప్ అండర్ -19 విజేత భారత్
-
ఆసియాకప్ అండర్ -19 విజేత భారత్
షార్జా: ఆసియా కప్ జూనియర్ భారత్ ఆటగాళ్లు మెరిశారు. తన జైత్రయాత్రను కరడవరకూ కొనసాగిస్తూ ఆసియా కప్ అండర్-19 విజేతగా అవతరించింది. పాకిస్తాన్ తో శనివారమిక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ విసిరిన 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు చతికిలబడ్డారు. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తానీ క్రికెటర్లు నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైయ్యారు. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరంబించిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ ఆటగాళ్లలో బైన్స్ (47) పరుగులతో శుభారంభానివ్వగా, విజయ్ జోల్ (100), సంజూ శ్యాంసన్ (100) పరుగులతో రాణించడంతో భారత్ మూడొందల పరుగుల మైలురాయిని దాటింది. -
ఆసియా కప్ నుంచి వైదొలగనున్నపాకిస్తాన్!
కరాచీ:వచ్చేఏడాది బంగ్లాదేశ్‌లో జరుగనున్న ఆసియా కప్ టోర్నీ, ప్రపంచ ట్వంటీ 20 మ్యాచ్ ల నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. పాకిస్తాన్ ప్రజలను కించపరిచే విధంగా బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు సాగుతుండటంతో పాకిస్తాన్ ఆ రెండు ప్రధాన రెండు టోర్నీలకు దూరంగా ఉండనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రతినిధి పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. ఆసియా కప్ టోర్నీ, ప్రపంచ ట్వంటీ 20లు రెండు టోర్నీలు బంగ్లాదేశ్ లో జరుగుతుండటమే కారణంగా తెలిపారు. బంగ్లాదేశ్ లో పాకిస్థానీల మనోభావాలకు వ్యతిరేకంగా కార్యకలపాలు సాగుతుండటంతో టోర్నీలు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాగా, దీనిపై ఐసీసీ జనవరి నెలలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.