ASIs
-
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
అమ్మాయిలు... అదరగొట్టేందుకు...
మహిళల క్రికెట్లో మళ్లీ పరుగుల పండగొచ్చింది... కరీబియన్ దీవుల్లో ధమాకాకు రంగం సిద్ధమైంది... పది దేశాల ప్రాతినిధ్యంతో శుక్రవారం నుంచే టి20 ప్రపంచ కప్.పదహారు రోజుల పాటు మహా సంగ్రామం. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ దుమ్మురేపుతుందా? పెద్దన్న ఆస్ట్రేలియా అదరగొ డుతుందా? వన్డే జగజ్జేత ఇంగ్లండ్ సంచలనం రేపుతుందా? కివీస్ ఈసారైనా కొల్లగొడుతుందా? టీమిండియా తడాఖా చూపుతుందా? ఇంతకూ ధనాధన్ ఆటలో దశ తిరిగేదెవరిది? ప్రొవిడెన్స్ (గయానా) మహిళల క్రికెట్లో వన్డే ప్రపంచ సమరం ముగిసిన 15 నెలలకే పొట్టి ఫార్మాట్లో జగజ్జేత స్థానానికి అమీతుమి. శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు జరిగే ఈ టోర్నీకి వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది ఆరో ప్రపంచ కప్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత తమ దీవుల్లో జరుగనున్న పోరులో కరీబియన్లు డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగిడుతుండటం విశేషం. గతంలో ఏ జట్టు సాధించని ఘనత ఇది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియాను 2016లో సంచలనాత్మక రీతిలో ఓడించి తొలిసారిగా ఒడిసిపట్టిన ట్రోఫీని సొంతగడ్డపై నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలని కంగారూలు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ విజేత’ హోదాను టి20ల్లోనైనా దక్కించుకోవాలని టీమిండియా లెక్కలు వేసుకుంటోంది. మిగిలినవాటిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రమాదకరమైనవి. ఆ ఐదారే... పేరుకు 10 జట్లు పోటీకి దిగుతున్నా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్‌లను మాత్రమే సెమీఫైనల్ చేరే సత్తా ఉన్నవిగా అంచనా వేస్తున్నారు.దక్షిణాఫ్రికా మహిళల జట్టు ప్రభావ వంతంగా లేదు. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్లను ద్వితీయ శ్రేణి వాటిగానే పరిగణిస్తున్నారు. సంచలనాలు నమోదైతే తప్ప ఇవి ముందడుగు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా నాలుగో సెమీస్ స్థానానికి వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ నెలకొననుంది. అయితే, ధనాధన్ ఆటలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి... ఏ జట్టునూ కచ్చితమైన ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి. గ్రూప్ నుంచి రెండేసి జట్లు... జట్లను ‘ఎ’, ‘బి’ గ్రూపులుగా వర్గీకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ లెక్కన లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. విజేతకు 2 పాయింట్లు, మ్యాచ్ టై, లేదా రద్దయితే ఒక పాయింట్ ఇస్తారు. పట్టికలో 1, 2లో స్థానాల్లో నిలిచిన జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
ఎందుకెళ్లిందో..!
ఈ విద్యార్థిని పేరు బండి మాబుచాన్.. 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల క్రితం స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఈ బాలిక ఇంత వరకూ ఇంటికి రాలేదు.. మీ పాప మా వద్ద ఉందంటూ రెండు మూడు చోట్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. ఎంతో సంతోషంగా వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడికి వెళ్లాక నిరాశ ఎదురవుతోంది.. తీరా అక్కడికి వెళ్లిచూస్తే నిన్ననే పాప ఇక్కడి నుంచి వెళ్లిపోయిందంటూ వారు చెప్పడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తమ కుమార్తె ఎక్కడ ఉందో.. ఏం తింటుందో అని నెలరోజుల నుంచి తల్లిదండ్రులు అన్న పానీయాలు ముట్టుకోకుండా ఇంట్లో పడిపోయారు. ⇒ బడికెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాని బాలిక ⇒ నెలరోజులుగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ⇒ ఆచూకీ కోసం రెండు జిల్లాల పోలీసుల గాలింపు ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణం వివేకానంద కాలనీకి చెందిన బండి చిన్న దస్తగిరి బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి మాబుచాన్, మాబుషరీఫ్ అనే పిల్లలున్నారు. మాబుచాన్ కొర్రపాడు రోడ్డులోని టీవీఆర్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. గత నెల 27న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి విచారించారు. అయితే ఆ రోజు విద్యార్థిని స్కూల్‌కు రాలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో ఆ రోజంతా తల్లిదండ్రులు కుమార్తె కోసం గాలించారు. కర్నూలులో ప్రత్యక్షం.. ఇంటి నుంచి వెళ్లిన మాబుచాన్ కర్నూలులో 28న ప్రత్యక్షమైంది. ఆమె కర్నూలుకు వెళ్లే సమయంలో బస్సులో అదే సీటులో ఉన్న ప్రయాణికులు పరిచయమయ్యారు. బస్టాండ్‌లో దిగే సరికి రాత్రి కావడంతో మాబుచాన్ను చూసి వారు జాలిపడ్డారు. దీంతో సమీపంలో ఉన్న పెద్దపాడు చిల్డ్రన్స్ హోంకు తీసుకొని వెళ్లారు. వారు హోం నిర్వాహకులతో మాట్లాడి వదలి వెళ్లారు. బాలికతో మాట్లాడిన హోం నిర్వాహకులు 29న ప్రొద్దుటూరులోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు 30న అక్కడికి వెళ్లారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారని విషయం తెలుసుకున్న మాబుచాన్ 29న రాత్రి హోం నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వెళ్లి నిరాశతో వెనుతిరిగి వచ్చారు. ఈ మేరకు చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు కె.నాగలాపురం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మళ్లీ పోరుమామిళ్లలో ప్రత్యక్షం.. కొన్ని రోజులపాటు ఎవ్వరికి కనబడకుండా వెళ్లిన బాలిక డిసెంబర్ 8న పోరుమామిళ్లలోని మదర్ థెరీసా ఫౌండేషన్‌కు వెళ్లింది. నాలుగు రోజులపాటు బాలిక అక్కడే ఉండిపోయింది. ఫౌండేషన్ నిర్వాహకుడు చింతా రవిప్రకాష్‌రెడ్డి టూ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి ప్రొద్దుటూరు అమ్మాయి తప్పి పోయినట్లు కేసు నమోదైందా అని అడిగారు. అయితే తల్లిదండ్రులు అప్పటి వరకూ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. అందువల్ల ఎస్ఐ అదృశ్యంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపి, బాలిక ఫొటోను వాట్సప్‌లో పంపమని చెప్పారు. దీంతో రవిప్రకాష్‌రెడ్డి మాబుచాన్ ఫొటోను వాట్సప్ ద్యారా పంపించారు. అయితే 12న ఉదయం బాలిక తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్టేషన్‌కు వెళ్లి తమ కుమార్తె కనిపించలేదని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తన వద్ద ఉన్న ఫొటోను వారికి చూపించగా తమ కుమార్తేనని చెప్పారు. దీంతో ఎస్ఐ వెంటనే ఫోన్ చేయగా నిన్ననే పాప ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయిందని చెప్పారు. అయినప్పటికీ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లను పోరుమామిళ్లకు పంపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ తెలియలేదు. విద్యార్థిని పాఠశాలలో హైదరాబాద్ ఎంత దూరం, తిరుపతికి ఎలా వెళ్లాలి.. టికెట్ ఎంత అవుతుంది అని స్నేహితులతో తరచూ చెబుతుండేదని ఎస్ఐ తెలిపారు. కాగా కె.నాగలాపురం పోలీస్టేషన్ నుంచి శనివారం ఏఎస్ఐలు ఈశ్వరయ్య, మహ్మద్ఆలీలు టూ టౌన్‌కు వచ్చారు. వారు ఎస్ఐతో బాలిక అదృశ్యంపై మాట్లాడారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే 94407 96938 అనే నెంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్ఐ కోరారు.