Aspirin
-
సవాల్ విసురుతున్న గుండెపోట్లు.. 30 శాతం పెరిగిన కేసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కోవిడ్ అనంతరం గుండెపోటు మరణాలు పెనుసవాల్ విసురుతున్నాయి. కోవిడ్–19 బారినపడి పెద్దగా ప్రభావం చూపించని వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. కోవిడ్‌కు ముందు గుండెపోటు వస్తే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరడం లేదా అవసరాన్ని బట్టి స్టెంట్స్ వేయడం, బైపాస్ సర్జరీ వంటి చికిత్సలు చేసేందుకు అవకాశం ఉండేది. గుండెపోటు వచ్చినా బయటపడేందుకు కొంత సమయం ఉండేది. కోవిడ్ తరువాత ఆ అవకాశం ఇవ్వడం లేదు. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ముందు సగటు మరణాలతో పోలిస్తే కోవిడ్ తరువాత మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. యూరప్‌లో కోవిడ్ ముందు మరణాల సగటుతో పోలిస్తే.. 6 నుంచి 16 శాతం అధికంగా మరణాలు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గుండెపోటు మరణాలే అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల 20 నుంచి 44 ఏళ్ల వారిలో గుండె జబ్బులు 30 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని అమెరికా లాస్ ఏంజెలిస్ కౌంటీ అధికారులు ప్రకటించడం గమనార్హం. విఖ్యాత వైద్య జర్నల్ ‘ది లాన్సెట్’, ‘ది ఎకనామిస్ట్’ పత్రికల నివేదికల ప్రకారం.. కోవిడ్‌కు ముందు మూడేళ్లతో పోలిస్తే.. కోవిడ్ తరువాత మూడేళ్లు (2020, 2021, 2022 సంవత్సరాలు) ప్రపంచవ్యాప్తంగా 2.50 కోట్ల మంది అధికంగా మృతి చెందారు. ఇందులో 70 లక్షల మంది కోవిడ్‌తో మరణించగా.. కోటీ80 లక్షల మంది కోవిడ్ సమయంలో ఇతర వైద్య చికిత్సలు అందక మృత్యువాతపడ్డారు. ఏస్పిరిన్తో చెక్ పెట్టొచ్చు రక్తపోటు, డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సహా పలు ఆరోగ్య సమస్యలకు ఏస్పిరిన్ చెక్ పెడుతోంది. గుండెపోటు నివారణ, గుండెపోటుకి గురయ్యే అవకాశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) ఎక్కువగా ఉన్న వారికి దీర్ఘకాలం పాటు ఏస్పిరిన్ 75 ఎంజీ వినియోగించడం సత్ఫలితాలను ఇచ్చింది. గుండెకు రక్త సరఫరా తక్కువ కావడంతో గుండె నొప్పి (ఇస్కీమియా), స్టెంట్, బైపాస్ సర్జరీ, గుండెపోటుకు గురైన వారు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారికి మళ్లీ గుండెపోటు రాకుండా ఏస్పిరిన్ 75 ఎంజీ రోజుకు ఒకటి చొప్పున వినియోగించటం ప్రామాణిక వైద్యం. డిస్ప్రిన్ , అనాసిన్ పేరిట అందుబాటులో ఉండే మాత్రల్లో 325 ఎంజీ ఏస్పిరిన్ ఉంటుంది. కడుపులో అల్సర్లు, రక్తస్రావం ఇబ్బందులు ఉన్నవారు దీనిని వినియోగించకూడదు. గుండెపోటు ప్రమాదం (రిస్క్ ఫ్యాక్టర్స్) లేని వారికి ఏస్పిరిన్ శ్రేయస్కరం కాదు. మోస్తరు నుంచి అధిక కోవిడ్ నుంచి కోలుకున్న వారు 75 ఎంజీ ఏస్పిరిన్ మాత్ర భోజనం తర్వాత కనీసం రెండేళ్లు వాడాలి. కోవిడ్ తర్వాత గుండెపోటుకు గురైన ప్రతి నలుగురిలో ఒకరికి రక్తనాళాలలో అవరోధం లేకపోయినా ఆ సమస్య వస్తోంది. ఈ సమస్యను ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు గుర్తించలేకపోతున్నాయి. – డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ (వైఎస్సార్సీపీ వైద్య విభాగం జోనల్ అధ్యక్షుడు, కాకినాడ) -
‘ఆ మూడు మాత్రలతో కరోనా కట్టడి..ప్రయోగాత్మకంగా రుజువు’
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కరోనాను తరిమేసేందుకు ఆస్ప్రిన్, మిథైల్‌ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్‌లు చాలని కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు యనమదల మురళీకృష్ణ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ విషయం రుజువైందంటూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 60 మంది కోవిడ్ బాధితులకు వారం పాటు ఆస్ప్రిన్ 150 ఎం.జీ. రోజుకొకటి, మిథైల్‌ప్రెడ్నిసోలాన్ 10 ఎం.జీ. ఉదయం, రాత్రి, అలాగే అజిత్రోమైసిన్ 250 ఎంజీ ఉదయం, రాత్రి ఇచ్చి వైద్యం అందిస్తే.. 59 మంది కేవలం వారంలో పూర్తిగా కోలుకున్నట్టు తెలిపారు. వారి సాచ్యురేషన్ స్థాయి 93 శాతం పైనే కొనసాగిందని పేర్కొన్నారు. తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న పారాసిట్మాల్, ఐవిర్‌మెక్ట్ర్‌న్, హైడ్రాక్సీక్లోరోక్వినోన్, డాక్సీసైక్లిన్ తీసుకున్న 60 మందిలో 8 మంది ఆరోగ్యం దిగజారి ఆస్పత్రి పాలైనట్టు వెల్లడించారు. తాను ప్రతిపాదించిన మూడు మాత్రలతో కోలుకున్న వారిలో నిస్సత్తువ నామమాత్రానికే పరిమితం కాగా, తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న మందులు వాడిన వారిలో దీర్ఘకాలిన నిస్సత్తువ, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టు తెలిపారు. తన పరిశోధనల సారాంశాన్ని అధ్యయన పత్రాల రూపంలో ఈ నెల 17, 18 తేదీల్లో అమెరికాలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆన్ డిసీజెస్’లో సమర్పించినట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తన అధ్యయనాన్ని కోయలిస్ గ్రూప్ స్కోపస్ ఇండెక్స్ అనే ప్రామాణిక పరిశోధనల డేటా బేస్‌లో ప్రచురిస్తారని మురళీకృష్ణ వెల్లడించారు. -
ఆస్పిరిన్ రొమ్ముక్యాన్సర్‌తో పోరాడుతుందా?
ఆస్పిరిన్ లాంటి సాధారణ నొప్పి నివారణ మాత్ర రొమ్ము క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన క్యాన్సర్లతో పోరాడుతుందా? అంశంపైనే పరిశోధకులు దృష్టిసారించారు. చాలా సులువుగా, చవకగా లభ్యమయ్యే ఆస్పిరిన్ వంటి తేలికపాటి నొప్పి నివారణ మాత్రను ఇతర క్యాన్సర్ నిరోధక ఇమ్యూనోథెరపీ మందులతో కలిపి ఇవ్వడం ద్వారా ప్రమాదకరమైన రొమ్ముక్యాన్సర్‌తో పాటు మరో 18 వేర్వేరు రకాల క్యాన్సర్లతో పోరాడవచ్చా అనే అంశంపై పరిశీలించినప్పుడు... దాదాపు 20 శాతం మేరకు అదనంగా రోగుల ప్రాణాలు నిలపవచ్చనే ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు ఈ దిశగా పరిశోధనలు ముమ్మరమయ్యాయి. కేవలం రోగనిరోధక శక్తి పెంచే ఇమ్యూనోలాజికల్ మందులను మాత్రమే ఇవ్వడం కంటే వాటిని ఆస్పిరిన్‌తో కలిపి ఇచ్చినప్పుడు మరింత మెరుగైన ఫలితాలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రొమ్ముక్యాన్సర్‌తో బాధపడే కొంతమంది మహిళలకు వారు కీమోథెరపీ లేదా శస్త్రచికిత్స చేయించుకునే ముందు అవేల్యుమాబ్ వంటి ఇమ్యూనాలజీ మందుతో పాటు ఆస్పిరిన్ కూడా ఇచ్చారు. దాదాపు వీళ్లంతా ప్రాథమికంగా జబ్బు నయం కాని... తదుపరి దశకు చేరిన మహిళలే. అంటే వాళ్లలో జబ్బు కేవలం రొమ్ముకు పరిమితం కాకుండా... ఇతర అవయవాలకు పాకిందన్నమాట. మాంఛెస్టర్‌లోని క్రిస్టీ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు చెందిన డాక్టర్ యానీ ఆర్మ్‌స్ట్రాంగ్ నేతృత్వంలో జరిగిన ఈ ప్రయత్నంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. దాంతో ప్రస్తుతం ఈ అధ్యయనాలను మరింతగా విస్తృతం చేస్తూ చాలామందిపై ట్రయల్స్ నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘‘మా ట్రయల్స్‌లో రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు వ్యాధినిరోధకశక్తిని సమకూర్చే మందులతో పాటు ఆస్పిరిన్ వంటి తేలికపాటి యాంటీఇన్ఫ్లమేటరీ మందును ప్రయోగించి చూసినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. చాలా తేలిగ్గా లభ్యమయ్యే ఆస్పిరిన్... ఇమ్యూనోథెరపీని మరింత ప్రభావవంతంగా జరిగేలా చేస్తున్నట్లు తేలింది. ఇది చాలా చవక కూడా కావడంతో ఈ ఫలితాలు మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపించాయి’’ అంటున్నారు డాక్టర్ యానీ ఆర్మ్‌స్ట్రాంగ్. ఇవి భవిష్యత్తులో ట్రిపుల్నెగెటివ్ రొమ్ముక్యాన్సర్ మహిళలకు ఓ ఆశారేఖగా పరిణమిస్తాయా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధిస్తున్నారు. చదవండి : ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -
కోవిడ్ చికిత్స.. ఆస్పిరిన్‌తో మెరుగైన ఫలితాలు
లండన్: ప్రపంచ దేశాలన్ని కోవిడ్ -19 కి వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూకే శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పెయిన్ కిల్లర్ ఆస్పిరిన్‌తో కోవిడ్‌ని కంట్రోల్ చేయవచ్చని తెలిపారు. తాము నిర్వహించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని.. త్వరలోనే దీన్ని నిరూపిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వైరస్ బాడిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ యూకేలోని అతిపెద్ద ట్రయల్స్‌లో భాగంగా ఆస్పిరిన్ కోవిడ్ సోకినవారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుందో లేదో అంచనా వేసేందుకు గాను ప్రయోగం నిర్వహించారు. సాధారణంగా ఆస్పిరిన్ని రక్తాన్ని పల్చబర్చడానికి ఉపయోగిస్తారు. కో చీఫ్ ఇన్వెస్టిగేటర్ పీటర్ హోర్బి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. "ఇది (ఆస్పిరిన్) ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. ఇది సురక్షితమైనది, చవకైనది, విస్తృతంగా అందుబాటులో ఉంది" అని తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన రోగులకు హైపర్-రియాక్టివ్ ప్లేట్లెట్స్ వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. దానివల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో యూకే శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరీక్షలు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించాయి. (చదవండి: కరోనా కట్టడికి అద్భుత వ్యాక్సిన్) రికవరీ ట్రయల్స్ వెబ్సైట్ ప్రకారం, ఆస్పిరిన్ యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్‌గానే కాక రక్తాన్ని గడ్డకట్టించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పరీక్షల్లో భాగంగా కనీసం 2 వేల మంది రోగులను ఎంపిక చేసి వారికి ప్రతి రోజు 150 మిల్లీగ్రామ్స్ ఆస్పిరిన్ ఇచ్చారు. ఇక వీరందరిని సాధారణ చికిత్స పొందుతున్న మరో 2000 మంది కోవిడ్ రోగులతో పోల్చినప్పుడు ఆస్పిరిన్ వాడిన వారిలో మెరుగైన ఫలితాలు గమనించారు. రాయిటర్స్ ప్రకారం, ప్రతి రోజు చిన్న మొత్తంలో ఆస్పిరిన్ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించవచ్చు అని తెలిపింది. అయితే ఎక్కువ కాలం తీసుకుంటే మూత్రపిండాల దెబ్బతినే ప్రమాదం ఉంది అని నివేదిక తెలిపింది. ఆస్పిరిన్ కాకుండా, రికవరీ ట్రయల్స్‌లో సాధారణ యాంటీ బయాటిక్ అజిథ్రోమైసిన్, రెజెనెరాన్ యాంటీబాడీ కాక్టెయిల్ కూడా ఉన్నాయి. ఈ ఔషధాల కాంబినేషన్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ -19 చికిత్సలో ఉపయోగించారు. -
‘కరోనా బ్యాక్టీరియా.. అస్పిరిన్‌తో తగ్గుతుంది’
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి సోషల్‌మీడియాలో ఫేక్ న్యూస్‌కు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. సారా, ఆవు పంచకం తాగితే కరోనా రాదని చెప్పడంతో జనాలు ఎగబడిన వైనం చూశాం. అలానే ఫలానా కషాయాలు తాగినా, వేప చెట్టుకు నీళ్లు పోయడం వంటి పూజలు చేసినా కరోనా బారిన పడరనే వార్తలు తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ఓ వైపు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఫేక్ న్యూస్ కట్టడి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి నిత్యం ఏదో ఒక కొత్త వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా కరోనాకు సంబంధించి మరో ఫేక్ న్యూస్ వీడియో తెగ ప్రచారం అవుతోంది.(ఫేక్ న్యూస్: నటి ఆవేదన) Claim- A widely circulated video on social media claims that #Covid19 is a bacteria & which can be treated with aspirin#PIBFactCheck- This is #Fake. Coronavirus is a virus and there is no specific medicinal cure available yet. pic.twitter.com/ESPzEZ6WgT — PIB Fact Check (@PIBFactCheck) June 4, 2020 కరోనా అనేది వైరస్ కాదని.. బ్యాక్టీరియా అని.. అస్పిరిన్‌తో కోవిడ్ భరతం పట్టవచ్చని ఈ వీడియో సారాంశం. 5జీ ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వలన కరోనా వ్యాపిస్తుందని.. అస్పిరిన్ తీసుకుంటే తగ్గిపోతుందని వీడియో వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది. కరోనా అనేది వైరస్ అని.. దానికి ఇంతవరకు ఎలాంటి మందు తయారు చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం శానిటైజర్‌ను ఎక్కువగా వాడితే.. చర్మ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనే వార్త ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 70శాతం అల్కహాల్ ఉన్న శానిటైజర్‌ను వాడితే ఎలాంటి ప్రమాదం లేదని.. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఇది ఎంతో ముఖ్యమని పీఐబీ స్పష్టం చేసింది.(ఎందరినో రక్షించి.. బలయ్యాడు) -
కేన్సర్ చికిత్సలో తలనొప్పి మాత్ర...
తలనొప్పితోపాటు మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలకు వాడే ఆస్ప్రిన్ కొన్ని రకాల కేన్సర్ల చికిత్సకూ ఉపయోగపడుతుందని అంటున్నారు. శాస్త్రవేత్తలు. ఇప్పటి జరిగిన దాదాపు 71 అధ్యయనాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని ఇందులో భాగంగా ఆస్ప్రిన్ తీసుకునే 12 లక్షల మందిని, తీసుకోని నాలుగు లక్షల మందిలో ఎవరు ఎక్కువ కాలం జీవించాలో పరిశీలించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త పీటల్ ఎల్వుడ్ తెలిపారు. కార్డిఫ్ యూనివర్శిటీకి చెందిన ఈ శాస్త్రవేత్త అంచనా ప్రకారం.. కేన్సర్ వ్యాధి సోకినప్పటికీ ఆస్ప్రిన్ తీసుకునే వారు దాదాపు 30 శాతం మంది ఎక్కువ కాలం జీవిస్తారు. అతి తక్కువ పరిమాణంలో ఆస్ప్రిన్ తీసుకోవడం గుండెజబ్బులను నివారిస్తుందని, గుండెపోటు, కేన్సర్ల నివారణకూ ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలుసు. అయితే కేన్సర్ విషయంలో ఇది అదనపు చికిత్సగానూ ఉపయోగపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పేవు, కడుపు, రొమ్ము, ప్రొస్టేట్ కేన్సర్ల విషయంలో జరిగిన పలు అధ్యయనాలు ఆస్ప్రిన్ ప్రయోజనాల గురించి తెలిపాయని చెప్పారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఈ పరిశీలనలను ధ్రుపరచుకోవాల్సి ఉందని, ఆ తరువాతే ఆస్ప్రిన్‌ను కేన్సర్‌కు ఓ మందుగా వైద్యులు పరిగణించేందుకు అవకాశముందని వివరించారు. -
ఆస్ప్రిన్‌తో ఉపయోగం అంతంతే..
లండన్ : గుండె పోటుకు గురైన వారిలో రక్తాన్ని పలుచన చేసే ఆస్ర్పిన్ మాత్ర ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలినా, 70 ఏళ్లు పైబడినవారిలో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వడం లేదని, దీన్ని వాడటం ద్వారా శరీరంలోపల బ్లీడింగ్‌కు దారితీస్తోందని తాజా అథ్యయనం పేర్కొంది. ఆస్ర్పిన్ పర్యవసానాలపై అమెరికా, ఆస్ర్టేలియాలో 70 ఏళ్లు పైబడిన 19,114 మందిపై ఐదేళ్ల పాటు అథ్యయనం చేపట్టారు. వీరిలో సగం మందికి రోజూ తక్కువ మోతాదులో ఆస్ర్పిన్ ఇవ్వగా వారిలో గుండె సమస్యలను తగ్గించడం, లేదా ఇతర ప్రయోజనం ఏమీ కనిపించలేదని గుర్తించారు. ఆస్ర్పిన్ను అధికంగా తీసుకున్నవారిలో మాత్రం పొత్తికడుపులో బ్లీడింగ్ వంటి సమస్యలను గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యవంతులైన వయోవృద్ధులకు ఆస్ర్పిన్తో ఎలాంటి అదనపు ప్రయోజనాలు చేకూరవని దీర్ఘకాలం వీటిని వాడటం వల్ల ఎలాంటి ఫలితం ఉండబోదని గుర్తించామని మొనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ మెక్నీల్ తెలిపారు. వైద్యుల సలహా లేకుండా తమకు తాముగా ఆస్ర్పిన్ తీసుకోవడం సరైంది కాదని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ రూత్వెల్ హెచ్చరించారు. అయితే గుండెపోటు, స్ర్టోక్‌కు గురైన వారు ఆస్ర్పిన్ తీసుకోవడానికి అథ్యయన ఫలితాలు వర్తించవని పరిశోధకులు స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా తక్కువ మోతాదులో ఆస్ర్పిన్ను తీసుకుంటున్నవారు ఒక్కసారిగా దీన్ని నిలిపివేస్తే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, వైద్యుల సూచనతోనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
ఆస్పిరిన్‌తో కేన్సర్‌కు చెక్!
పరిపరి శోధన జ్వరాలకు, నొప్పులకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ వల్ల కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆరేళ్ల పాటు ప్రతిరోజూ ఆస్పిరిన్ వాడే వారికి కేన్సర్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు హార్వర్డ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. ముఖ్యంగా పేగులకు వచ్చే కేన్సర్‌పై ఆస్పిరిన్ ప్రభావం గణనీయంగా ఉందని, ఆస్పిరిన్ వాడకం వల్ల పేగు కేన్సర్ సోకే అవకాశాలు ఇరవై శాతం మేరకు తగ్గినట్లు వారి పరిశోధనల్లో తేలింది. కారుచౌకగా దొరికే ఆస్పిరిన్ టాబ్లెట్లను రొజుకొకటి చొప్పున దీర్ఘకాలికంగా వాడినట్లయితే చాలా రకాల కేన్సర్ల నుంచి నివారణ పొందే అవకాశాలు ఉంటాయని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. -
గుండె గురించి గుప్పెడు విషయాలు
మనిషి గుండె కొట్టుకోవలసిన వేగం నిమిషానికి 72 సార్లు అయినప్పటికీ అది ఆ వ్యక్తి చేస్తున్న పనిని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి - నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి గుండె స్పందనలు నిమిషానికి 90- 100 మధ్యన ఉన్నా దాన్ని నార్మల్‌గానే పరిగణించవచ్చు. ఎప్పుడైతే గుండె వేగం నిమిషానికి 100 కంటే ఎక్కువగా ఉందో దాన్ని టాకికార్డియా అని, అది 60 కంటే తక్కువగా ఉంటే దాన్ని బ్రాడీకార్డియా అని పరిగణించాలి. ఏదైనా ప్రత్యేకసందర్భం (ఉదాహరణకు మెట్లపై వేగంగా పరుగెత్తుతున్నప్పుడు)లో గుండె స్పందన పెరిగితే దాన్ని నార్మల్‌గానే పరిగణించాలి. ఆందోళనకు గురైనప్పుడు కూడా గుండెవేగం నిమిషానికి 100 దాటవచ్చు. అయితే ఈ నార్మల్ రేంజ్లో కాకుండా ఎప్పుడూ అబ్నార్మల్ రేంజ్లో ఉండేవారు మాత్రం డాక్టర్‌ను కలిసి తగు సలహా తీసుకోవాలి. ఒక ఆస్పిరిన్ మాత్ర... జీవితాన్ని రక్షిస్తుంది... ఒక ఆస్పిరిన్ మాత్ర జీవితాన్ని రక్షిస్తుంది. ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలచబార్చే గుణం ఉంది. గుండెపోటు రావడం అంటే... ప్రధానంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఎక్కడైనా అడ్డంకి (బ్లాక్) ఉండటం వల్ల, దానికారణంగా గుండెకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఈ పరిణామం వల్ల గుండెకండరం చచ్చుబడిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే గుండెపోటు లక్షణాలు (ఎడమ పక్క భుజం లేదా చేయి లాగినట్లుగా ఉండటం, గుండె / ఛాతీలో నొప్పి, చెమటలు పట్టడం వంటివి) కనిపించినప్పుడు ఒక ఆస్పిరిన్ మాత్ర అందుబాటులో ఉంచుకుని, అలాంటి లక్షణాలు కనిపించగానే టక్కున నోట్లో వేసుకోవాలి. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ సలహా మీద క్రమం తప్పకుండా స్టాటిన్స్ అనే మందులు వాడాలి. స్టాటిన్స్ వాడేవారూ ఈ విషయాలు తెలుసా? స్టాటిన్స్ అన్నవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించే మాత్రలు. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీదే కాకుండా ప్రతి మనిషి తాలూకు జన్యుపరమైన కారణాల వల్ల కూడా కావచ్చు. అయితే ఇలాంటివారు ఆహారనియమాలు ఏవీ పాటించనట్లయితే కొలెస్ట్రాల్ పాళ్లు మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనప్పటికీ, మున్ముందు దానివల్ల గుండెజబ్బులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అనే ఒకరకం కొవ్వుపదార్థం ఉత్పత్తి కాకుండా నివారించే మందులే స్టాటిన్స్. ఇవి శరీరంపై పెద్దగా సైడ్ఎఫెక్ట్స్ చూపకుండానే గుండెకు మరింత లాభం చేకూరుస్తాయి. గుండెపోటు రిస్క్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఈ మందులను క్రమం తప్పకుండా వాడుతున్నంతకాలమే వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. వీటిని మానేస్తే వీటివల్ల శరీరానికి కలిగే రక్షణ తొలగిపోతుంది. అందుకే ఒకసారి స్టాటిన్స్ మొదలుపెట్టినవారు వాటిని మానకుండా డాక్టర్ సలహా మేరకు వాటిని ఎప్పటికీ వాడుతుండటమే మంచిది. మరి అవి వాడుతున్నప్పుడు రక్తసిక్త గాయమైతే..? ఆస్పిరిన్ లేదా ఇతర రక్తాన్ని పలచబార్చే మందులు వాడేవారికి ఒక సందేహం ఉంటుంది. అదేమిటంటే... గుండె ఆపరేషన్ అయ్యాక మళ్లీ జబ్బు రాకుండా ఉండటానికి కార్డియాలజిస్ట్ సలహా మేరకు జీవితాంతం ఆస్పిరిన్, స్టాటిన్ వంటి మాత్రలు వాడాల్సి ఉంటుంది కదా... మరి అవి వాడే క్రమంలో ఏదైనా రక్తస్రావం జరిగేలా దెబ్బతగిలితే ఎలా... అన్నదే వారి ఆందోళన. ఆస్పిరిన్ లేదా ఇతర రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం వల్ల గాయం అయినప్పుడు రక్తస్రావం అయిపోతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. కొందరిలో గుండె, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉండటం లేదా గుండె కవాటం మార్పిడి చికిత్స చేసినట్లయితే వారికి ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ (ఎసిట్రోమ్, వార్‌ఫేరిన్) కూడా ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే రక్తస్రావం కాకుండా, దెబ్బలేమీ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భాల్లోనే రక్తస్రావం జరిగి, ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే దెబ్బతగిలి, రక్తస్రావం అవుతుంటే కంగారుపడకుండా శుభ్రమైన బట్టతో దాన్ని అదిమిపట్టి వెంటనే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలి. - నిర్వహణ: యాసీన్ నడక ఎంతో మేలు... గుండెజబ్బులను నివారించడానికి లేదా గుండె జబ్బును కనుగొన్న తర్వాత దానిని అదుపులో పెట్టుకోడానికైనా నడక మంచి వ్యాయామం. అయితే ఆరుబయట లేదా ట్రెడ్‌మిల్‌పై నడవడం మంచిది. అయితే నడిచేవారు ఒక ప్రాథమిక నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేగంతో తక్కువ దూరాలు నడవటం కంటే...గుండెజబ్బులు ఉన్నవారు తక్కువ వేగంతో ఎక్కువ సమయం నడిస్తే మంచిది. మామూలుగా ఆరోగ్యం కోసం నడిచేవారు ఉదయం వేళ వాకింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటే సాయంత్రం కూడా నడవచ్చు. అయితే ఒకవేళ గుండెజబ్బు నిర్ధారణ అయినవారు మాత్రం ఉదయం వేళ నడవడం మేలు. సాయంత్రాలు నడిచేవారు మాత్రం వాకింగ్ చేయడానికి ముందు మితంగా ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా ఆహారం తీసుకుని వాకింగ్ చేయకూడదని గుర్తుంచుకోవాలి.