Assam man
-
వీడియో: నాణేలతో స్కూటర్ కొనుగోలు.. ఎన్ని వేలో తెలుసా?
అదో బైక్ షోరూం.. వర్కర్లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన భుజాన ఓ సంచి వేసుకుని షోరూమ్‌కి వచ్చాడు. తనకు ఓ స్కూటర్ కావాలని అక్కడున్న వారిని కోరాడు. దీంతో, అక్కడున్న స్కూటర్లను చూసి ఒకదాన్ని ఓకే చేసుకున్నారు. అయితే, డబ్బులు చెల్లించే సమయంలో అతడు తన వద్ద ఉన్న 10 రూపాయల నాణేలను ఇవ్వడంతో అక్కడున్న వారు ఒకింత ఆశ్చర్యానికి లోనైనా.. అతడి కోరికను చూసి అభినందించారు. ఏకంగా రూ. 90వేలకు సరిపడే 10 రూపాయల నాణేలను లెక్కించి స్కూటర్‌ను అతడికి అప్పగించారు. వివరాల ప్రకారం.. బైక్ కొనుక్కోవడం ప్రతి సామాన్యుడి కల. దాని కోసం కొంతమంది అప్పు చేసి కొంటారు. మరికొందరు డబ్బులను జమ చేసుకుని కొనుగోలు చేస్తారు. అయితే, అసోంకు చెందిన వ్యక్తి మాత్రం ఐదారేళ్లుగా ద్విచక్రవాహనం కొనేందుకు నాణేలు పోగేశాడు. మెుత్తం రూ.90 వేలు కూడబెట్టి.. చివరికి తనకు ఇష్టమైన ద్విచక్ర వాహనాన్ని కొని ఇంటికి తీసుకెళ్లాడు. #WATCH | Assam: Md Saidul Hoque, a resident of the Sipajhar area in Darrang district purchased a scooter with a sack full of coins he saved. pic.twitter.com/ePU69SHYZO — ANI (@ANI) March 22, 2023 అసోంలోని దరంగ్ జిల్లాలో సిపజార్‌కు చెందిన మహమ్మద్ సైదుల్ హక్ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. చిన్న షాప్ నడుపుకునే సైదుల్కు స్కూటర్ కొనాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. దీంతో, తనకు ఇష్టమైన బైక్ కోసం ఐదారేళ్లుగా డబ్బును జమ చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రతీ రోజు అతడు రూ.10 నాణేలను పోగు చేశాడు. ఇలా 90వేల రూపాయలు పొదుపు చేశాడు. ఇన్ని రోజులు జమ చేసిన నాణేలను కొన్ని డబ్బాల్లో ఓ సంచిలో వేసుకుని షోరూమ్‌కు వెళ్లాడు. అనంతరం, బైక్‌ను కొనుగోలు చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సైదుల్ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. "I run a small shop in Boragaon area and it was my dream to buy a scooter. I started to collect coins 5-6 years ago. Finally, I have fulfilled my dream. I am really happy now," said Md Saidul Hoque pic.twitter.com/Vj4HsOqI3v — ANI (@ANI) March 22, 2023 అయితే, అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు తన డ్రీమ్ బైక్(కేటీఎం) కోసం చిల్లరను జమచేశారు. రూ.2.85 లక్షలకు సరిపడే రూపాయి కాయిన్స్ పొదుపు చేసి బైక్ కొనుగోలు చేశారు. అలాగే, తమిళనాడులోని సేలాం జిల్లాకు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను జమ చేసి కారును కొనుగోలు చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఇది కూడా చదవండి: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. షాకింగ్ వీడియో -
బైక్‌పై శివ-పార్వతుల వేష ధారణలో నిరసన.. అరెస్ట్!
డిస్పూర్: దేశంలో పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. అలా.. పెట్రోల్ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై చిన్న నాటకం ప్రదర్శించి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన బిరించి బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. బోరా.. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బిరించి బోరాను అరెస్ట్ చేసి నగావ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శివపార్వతుల నాటకంలో ఏముంది? ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా.. వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా.. కోయాక్టర్ పరిశిమిత పార్వతిగా బైక్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు. ఇదీ చదవండి: జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు -
బ్లాడర్‌లో కేబుల్ : నిజం తెలిస్తే షాక్!
మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనకు నిదర్శనమైన ఉదంతం ఒకటి అసోంలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని మూత్రాశయంలో మొబైల్ హెడ్ ఫోన్ వైర్ ను చూసి విస్తుపోయారు. చివరికి ఆ కేబుల్ ను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే అసోంకు చెందిన రోగి (30) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పొరపాటున హెడ్‌ఫోన్ కేబుల్‌ను మింగేశానని చెప్పాడు. దీంతో మల పరీక్ష, ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు, ఫలితం లేకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయినా జీర్ణాశయంలో కేబుల్ జాడ దొరకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించారు. ఇక్కడే డాక్టర్లకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్‌ను గుర్తించారు. అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని తేలిందని సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు. “యురేత్రల్ సౌండింగ్'' అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని, ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత నొప్పితో తమ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇలా అబద్ధం చెబుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తన పాతికేళ్ల చరిత్రలో ఆపరేషన్ టేబుల్ మీద ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ సంగతి ముందే చెప్పి ఉంటే.. ఆపరేషన్ లేకుండానే కేబుల్‌ను తొలగించేవారిమని చెప్పారు. -
తమ్ముడి కోసం అస్సాం నుంచి ఆంధ్రాకి..
నెల్లిమర్ల విజయనగరం : ఊరు కాని ఊరు. భాష తెలియని ప్రాంతం. ఆచారాలు.. సంప్రదాయాలు.. అన్నీ భిన్నమైన ప్రాంతం. తోడబుట్టిన వాడి కోసం ఓ అక్క అన్వేషించింది. రాష్ట్రాలు దాటి తరలి వచ్చింది. సోదరుడి ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరైంది. తమ్ముడు కనిపిస్తే చెప్పండని ఫొటోలు చూపించింది. గుండెల్ని పిండేసే ఈ దృశ్యానికి నెల్లిమర్ల పోలీసు స్టేషన్ వేదికైంది.అసోం రాష్ట్రానికి చెందిన పూర్ణ సింగ్లామా అనే వ్యక్తి అసోం-గౌహతి రైలులో ప్రయాణిస్తుండగా జూన్ నెల 15న నెల్లిమర్ల-చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో మార్గ మధ్యంలో తప్పిపోయాడు. మూడు రోజుల తరువాత నెల్లిమర్లలో కొండపేట గ్రామానికి చెందిన నడిపేన లోకేష్ అనే యువకుడికి తారసపడ్డాడు. ఆయన మొబైల్‌ను అడిగి అసోంలోని తన అక్క లబ్బాకు ఫోన్ చేశాడు. అప్పటికే తప్పిపోయిన తమ్ముడి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఈ ఫోన్ కాల్ కొంత ఊరటనిచ్చింది. తమ్ముడు క్షేమంగానే ఉన్నాడని.. ఇక ఇంటికి వచ్చేస్తాడని భావించారు. తమ్ముడి ఆచూకీ కోసం తరచూ ఫోన్ చేస్తుండటంతో విసుగు చెందిన లోకేష్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. రోజులు గడుస్తున్నా తమ్ముడి ఆచూకీ తెలియకపోవడం.. లోకేష్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఫోన్ నంబర్ లొకేషన్ ఆధారంగా బుధవారం నెల్లిమర్లకు వచ్చారు. నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫోన్ చేసిన యువకుడిని పిలిపించారు. కొండపేటకు చెందిన లోకేష్ మాట్లాడుతూ ఒక వ్యక్తి తన మొబైల్ అడిగి ఫోన్ చేశాడని.. తరువాత వెళ్లిపోయాడని.. అంతకుమించి వివరాలు తెలియవని సమాధానమిచ్చాడు. దీంతో పూర్ణ సింగ్లామా అక్క, ఇతర కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. రైల్వే జీఆర్పీని సంప్రదించమని నెల్లిమర్ల ఎస్ఐ ఉపేంద్రరావు సూచించారు. చేసేది లేక పూర్ణ సింగ్లామా అక్క లబ్బా వెంట తెచ్చుకున్న తమ్ముడి ఫొటోను పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారికి చూపిస్తూ ఆచూకీ తెలిస్తే తెలపండని తమ భాషలో ప్రాధేయపడింది. కంటతడి పెడుతూ నెల్లిమర్ల పట్టణం మొత్తం తిరిగి గోడలకు తన తమ్ముడి ముఖ చిత్రాలను స్వయంగా అంటించింది. ఆచూకీ తెలిస్తే 9957971910 నంబర్‌కు తెలియజేయాలని కోరింది. తమ్ముడి ఆచూకీ కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన అక్క ఆరాటాన్ని చూసిన వారంతా చలించిపోయారు. -
భూమి కోసం బలిదానం
అస్సాంలో వ్యవసాయ ఉద్యమకారుడి ఆత్మాహుతి ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం గువాహటి: ఓ వ్యవసాయ ఉద్యమకారుడు ఆత్మాహుతికి పాల్పడటంతో అస్సాం ఆందోళనలతో అట్టుడికింది. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ ఉద్యమకారుడు ప్రణబ్ బోరో (45) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) ఆధ్వర్యంలో సోమవారం రైతులు రాష్ట్ర సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ప్రణబ్ బోరో ఆత్మాహుతియత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బోరోను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. వంద శాతం కాలిన గాయాలతో బోరో సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడని వైద్యులు చెప్పారు. బోరో ఆత్మాహుతి వార్తతో అస్సాం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులు నేషనల్ హైవే 37 సహా రహదారుల దిగ్బంధం, రైల్ రోకోలకు దిగారు. జోర్హత్, శివసాగర్, మోరిగావోన్, సోనిత్పూర్ జిల్లాల్లో కేఎంఎస్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. దీంతో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుతి ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. కేఎంఎస్ఎస్ డిమాండ్ ఆమోదయోగ్యం కాదని.. చొరబాటుదారులకు భూమి పట్టాలు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. రాహుల్ ర్యాలీపై ప్రభావం ప్రణబ్ బోరో ఆత్మాహుతితో కేఎంఎస్ఎస్ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వమే బోరో ఆత్మాహుతికి కారణమని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం అస్సాంలో పర్యటించనున్నారు. కేఎంఎస్ఎస్ బంద్ ప్రభావం రాహుల్ పర్యటనపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామని అఖిల్ ప్రకటించారు.