Assam Rifles battalion
-
అరుణాచల్ ప్రదేశ్‌లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’
న్యూఢిల్లీ: చైనా ఒక గ్రామాన్ని ఏకంగా భారత భూభాగంలోనే నిర్మించి, అభివృద్ధి చేసిందంటూ అమెరికా ఇటీవల తన అంతర్గత నివేదికలో పేర్కొనడంపై భారత భద్రతా వర్గాలు ఒక స్పష్టతనిచ్చాయి. భారత్–చైనా సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని వివాదాస్పద ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది. ఈ గ్రామం ఉన్న భూభాగం దాదాపు ఆరు దశాబ్దాలుగా చైనా అధీనంలోనే ఉందని భారత భద్రతా దళాల్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘ఆ ప్రాంతంలోని భారత అస్సాం రైఫిల్స్ పోస్ట్‌ను 1959లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించుకుంది. దీనిని లాంగ్జూ ఘటనగా పేర్కొంటారు. అప్పటి నుంచీ ఆ ప్రాంతం చైనా ఆక్రమణలో ఉంది’ అని భారత సైనిక వర్గాలు తెలిపాయి. -
మణిపూర్‌లో 11 మంది తీవ్రవాదులు అరెస్ట్
మణిపూర్‌లో భద్రతదళాలు వివిధ ప్రాంతాలల్లో నిర్వహించిన కూంబింగ్ అపరేషన్లలో 11 మంది తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఇంఫాల్ సరిహద్దులోని భారత్-మయన్మార్ సరిహద్దు దాటుతున్న ఐదుగురు తీవ్రవాదులను 24వ అసోం రైఫిల్ బెటాలియన్‌కు చెందిన సైనికులు అరెస్ట్ చేశారని చెప్పారు.వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి ఎం.16 రైఫిల్స్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిన్న సాయంత్రం ఉర్కల్ జిల్లాలోని అసంగ్ కులెన్ ప్రాంతంలో యూనైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ముగ్గురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కంగ్లీపక్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు తీవ్రవాదులను తబొల్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే కూకి నేషనల్ ఆర్మీకి చెందిన తీవ్రవాదిని చురాచంద్పూర్ జిల్లాలో అరెస్ట్ చేసి, అతని వద్ద పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన్టుల వివరించారు. వారందరిని ఇంఫాల్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు అసోం పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.