మణిపూర్లో 11 మంది తీవ్రవాదులు అరెస్ట్ | Eleven militants arrested in Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్లో 11 మంది తీవ్రవాదులు అరెస్ట్

Published Wed, Dec 4 2013 1:12 PM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

Eleven militants arrested in Manipur

మణిపూర్లో భద్రతదళాలు వివిధ ప్రాంతాలల్లో నిర్వహించిన కూంబింగ్ అపరేషన్లలో 11 మంది తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఇంఫాల్ సరిహద్దులోని భారత్-మయన్మార్ సరిహద్దు దాటుతున్న ఐదుగురు తీవ్రవాదులను 24వ అసోం రైఫిల్ బెటాలియన్కు చెందిన సైనికులు అరెస్ట్ చేశారని చెప్పారు.వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి ఎం.16 రైఫిల్స్లు స్వాధీనం చేసుకున్నారు.

 

అలాగే నిన్న సాయంత్రం ఉర్కల్ జిల్లాలోని అసంగ్ కులెన్ ప్రాంతంలో యూనైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్కు చెందిన ముగ్గురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కంగ్లీపక్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు తీవ్రవాదులను తబొల్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే కూకి నేషనల్ ఆర్మీకి చెందిన తీవ్రవాదిని చురాచంద్పూర్ జిల్లాలో అరెస్ట్ చేసి, అతని వద్ద పిస్టల్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన్టుల వివరించారు. వారందరిని ఇంఫాల్ పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు అసోం పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement