Assam tour
-
ఏ అవగాహనా లేదు!
గువాహటి: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారికి పూజనీయ స్థలాల గొప్పదనంపై కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గువాహటిలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అసోంలోని కామాఖ్య ఆలయ కారిడార్ సిద్ధమయ్యాక ఈ శక్తి పీఠాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ‘‘కామాఖ్య కారిడార్ ఈశాన్య పర్యాటకానికి గేట్వేగా మారనుంది. అక్కడి పర్యాటక రంగమంతటికీ ఊపునిస్తుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘ఇలాంటి మహిమాని్వయ పూజనీయ స్థలాలెన్నో దేశవ్యాప్తంగా కొలువుదీరాయి. కానీ దశాబ్దాలపాటు దేశాన్నేలిన వారికి వాటి గొప్పదనం గురించిన అవగాహనే లేదు. పైగా వారి స్వార్థ, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనమే సిగ్గుపడే పరిస్థితులు కలి్పంచారు. తన మూలాలను, గతాన్ని విస్మరించిన ఏ దేశమూ అభివృద్ధి సాధించజాలదు. బీజేపీ పాలనలో గత పదేళ్లలో పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా గుర్తించుకుంటున్నాం. ఒక్క 2023లోనే కాశీకి ఏకంగా 8.5 కోట్ల మంది పర్యాటకులు పోటెత్తారు. ఉజ్జయినిని 5 కోట్లకు పైగా సందర్శించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన 12 రోజుల్లోనే పాతిక లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు’’ అని మోదీ వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య భారతానికి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. భక్తి పర్యాటకం వల్ల నిరుపేదలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. ‘‘బీజేపీ కార్యకర్తగా నేను అసోంలో పని చేశా. అప్పట్లో గువాహటిలో రోడ్ల దిగ్బంధం, బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడదంతా గతం’’ అన్నారు. గువాహటిలో పలు మౌలిక రంగ ప్రాజెక్టులను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రూ.498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్‌తో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఫోర్ లేన్ హైవేలు, మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తదితరాలు ఇందులో ఉన్నాయి. విపాసన.. ఒత్తిళ్లపై దివ్యాస్త్రం: మోదీ ముంబై: నిరాశలు, ఒత్తిళ్లపై విపాసన ధ్యాన పద్ధతి దివ్యాస్త్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి ప్రాచీన భారతదేశం అందించిన అత్యుత్తమ కానుకల్లో విపాసన ఒకటి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి యువతతో పాటు అన్ని వయసుల వాళ్లకూ ఇదో చక్కని మార్గం’’ అని చెప్పారు. విపాసన బోధకుడు ఎస్.ఎన్.గోయంకా శత జయంత్యుత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘విపాసన ధ్యానపద్ధతి ఒక శాస్త్రం. చక్కని వ్యక్తిత్వ వికాస మార్గం. గోయంకా తన జీవితాన్ని సమాజ సేవకు ధారపోశారన్నారు. ‘‘గోయంకా గురూజీతో నాకెంతో సాన్నిహిత్యముంది. ఆయన జీవితం బుద్ధుని స్ఫూర్తితో సాగింది. సమామూహికంగా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని ఆయన నొక్కిచెప్పేవారు. ఆయన కృషి వల్ల 80 దేశాల వాళ్లు ధ్యానం ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు’’ అని వివరించారు. ఆదివారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
తృణమూల్ బృందం నిర్బంధం
సిల్చార్/న్యూఢిల్లీ: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) తుది ముసాయిదాపై ఆందోళనల నేపథ్యంలో అస్సాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అంచనావేయడానికి గురువారం అక్కడికి వెళ్లిన తృణమూల్ బృందాన్ని పోలీసులు సిల్చార్ విమానాశ్రయంలో అడ్డుకుని నిర్బంధించారు. వారి పర్యటన శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం అధికారులు తెలిపారు. ఎన్నార్సీ జాబితాలో భారతీయుల పేర్లు గల్లంతవడంపై స్థానిక ఆడిటోరియంలో సమావేశం నిర్వహించేందుకు ఆరుగురు ఎంపీలు, పశ్చిమబెంగాల్ మంత్రి, ఎమ్మెల్యేతో కూడిన తృణమూల్ బృందం అస్సాం వెళ్లింది. విమానాశ్రయంలోనే బైఠాయింపు.. తృణమూల్ బృందం విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకుని వీఐపీల గదిలో నిర్బంధించారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ‘మహిళా సభ్యులతో సహా మా అందరిపై భౌతిక దాడి జరిగింది. ఎన్నార్సీ జాబితాలో చోటుదక్కని వారితో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాం.కానీ పోలీసులు మమ్మల్ని విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు’ అని అన్నారు. బీజేపీపై మమత మండిపాటు అస్సాంలో తమ పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మమతా బెనర్జీ స్పందించారు. దేశంలో బీజేపీ సూపర్ ఎమర్జెన్సీని అమలుచేస్తోందని మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం ప్రతినిధులను అడ్డుకున్నారని నిలదీశారు. ‘ ఎన్నార్సీ జాబితాకు సంబంధించి ఎవరినీ వేధింపులకు గురిచేయమని హోం మంత్రి రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. కానీ మా ఎంపీలను సిల్చార్ విమానాశ్రయం నుంచి అడుగు బయటపెట్టనీయలేదు. పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ తన బలంతో నిజాలను తొక్కిపెడుతోంది’ అని మమత ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో లేవనెత్తారు. అస్సాం దేశంలో భాగమేనని, అయినా ఎంపీలు అక్కడ అడుగుపెట్టకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అస్సాం ప్రభుత్వంపై శుక్రవారం సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. దేశమంతా ఎన్నార్సీ: బీజేపీ సభ్యుడు దేశమంతా ఎన్నార్సీ నిర్వహించాలని అధికార బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే లోక్‌సభలో డిమాండ్ చేశారు. పలు ఈశాన్య రాష్ట్రాలు సహా కశ్మీర్లో జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించలేదన్నారు. దూబే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. స్పీకర్ సర్దిచెప్పడంతో శాంతించాయి. మరోవైపు, దళితులపై వేధింపుల నిరోధక చట్టం, ఎన్నార్సీ అంశాలు గురువారం పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. -
కేజీబీవీలను అభివృద్ధి చేయాలి
అసోంలోని లహరి ఘాట్ కేజీబీవీని సందర్శించిన కడియం సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాల (కేజీబీవీ)ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసర ముందని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం అసోం మోరిగావ్ జిల్లా లహరిఘాట్ కస్పూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సతీమణి వినయా రాణితో కలసి సందర్శించారు. బోధన ప్రక్రియ, వసతుల కల్పనను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం సమావేశమయ్యారు. బాలికల విద్యపై కేంద్రం నియమించిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రెండో సమావేశం సందర్భంగా కడియం శనివారం గువాహటి వెళ్లారు. కేజీబీవీలను 8వ తరగతికే పరిమితం చేయకుండా 12వ తరగతి వరకు పెంచాలని, దీన్ని పూర్తిగా కేంద్ర ఆర్థిక సాయంతోనే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.