assembled unit
-
రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!
స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే మాడ్యుళ్ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ సంస్థ యోచిస్తోంది. తమిళనాడులో ప్రారంభించాలనుకుంటున్న ఈ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఒక బిలియన్ డాలర్లు(రూ.8,357 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని దేశీయంగా వాడడంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన యూనిట్ అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ చేసిన డిస్ప్లే మాడ్యూల్స్‌ను దిగుమతి చేసుకునే బదులుగా స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేయవచ్చు. దాంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, తయారీలో ఫాక్స్‌కాన్‌కు విలువ జోడిస్తుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్‌లో దాదాపు 5 శాతం రెవెన్యూ ఉత్పత్తి అయితే, డిస్ప్లే అసెంబ్లింగ్‌లో అదనంగా మరో 2-3 శాతం రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?ఫాక్స్‌కాన్ భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా అసెంబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్యలు సాగుతున్నాయి. డిస్ప్లే మాడ్యూళ్లలో ప్రధానంగా 60-65% విడిభాగాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణ కొరియా 20-25% సరఫరా చేస్తోంది. స్థానికంగా డిస్ప్లే అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైతే దిగుమతులు తగ్గి స్థానిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల టీవీల అసెంబ్లింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న మోటరోలా, నోకియా, వన్‌ప్లస్ వంటి దిగ్గజ సంస్థలు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విశేషమేమంటే ఈ కంపెనీల టీవీలు హైదరాబాద్‌లో రూపుదిద్దు కుంటున్నాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న స్కైక్వాడ్ ఇప్పటికే ప్యానాసోనిక్, లాయిడ్ వంటి ఏడు బ్రాండ్ల టీవీలను అసెంబుల్ చేస్తోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్, శంషాబాద్ వద్ద ప్లాంట్లున్నాయి. ఏటా 30 లక్షల ఎల్ఈడీ టీవీలను రూపొందించే సామర్థ్యం ఉంది. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారని కంపెనీ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో నాలుగు కొత్త బ్రాండ్లు తోడవనున్నాయని వివరించారు. రెండో దశలో రూ.1,400 కోట్లు.. స్కైక్వాడ్ భాగస్వామ్యంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ స్కైవర్త్ శంషాబాద్ వద్ద 50 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.700 కోట్లు పెట్టుబడి చేస్తున్నారు. ఇరు సంస్థలు కలిసి టీవీలతోపాటు వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను అసెంబుల్ చేస్తాయని రమీందర్ వెల్లడించారు. ‘ఆరు నెలల్లో ఈ ఉత్పత్తుల తయారీ మొదలవుతుంది. కొత్త ప్లాంటు ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. 15–20 శాతం విడిభాగాలు స్థానికంగా తయారవుతున్నాయి. దీనిని 50 శాతానికి తీసుకువెళతాం. మరో 20 దాకా అనుబంధ సంస్థలు రానున్నాయి. వీటి ద్వారా 3,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నాం. రెండవ దశలో ఇరు సంస్థలు కలిసి రూ.1,400 కోట్ల పెట్టుబడి చేయాలని భావిస్తున్నాం’అన్నారు. -
భాగ్యనగరిలో 'సెల్కాన్' యూనిట్
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్.. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద అసెంబ్లింగ్ యూనిట్ ను స్థాపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో సెల్ఫోన్ల అసెంబ్లింగ్ ప్లాంటు నెలకొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్లాంటులో ప్రస్తుతం నాలుగు లైన్లను ఏర్పాటు చేశారు. పది రోజుల్లో మరో నాలుగు లైన్లు జోడించనున్నారు. ఒక్కో లైన్లో 8 గంటల్లో 2,500 ఫోన్లు అసెంబుల్ చేయవచ్చు. తొలుత నెలకు 3 లక్షల ఫోన్లను అసెంబుల్ చేస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు 'సాక్షి' బిజినెస్ బ్యూరోకు గురువారం తెలిపారు. మొబైల్స్ హబ్‌లో ప్లాంటు ఏర్పాటయ్యే వరకు ఇక్కడే అసెంబుల్ చేస్తామని చెప్పారు. దశల వారీగా మేడ్చల్ ప్లాంటులో సామర్థ్యాన్ని పెంచుతామని వివరించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా వారం రోజుల్లో ప్లాంటును ప్రారంభింస్తామని పేర్కొన్నారు.