ఆంధ్రాభవన్‌లో బడ్జెట్‌పై సమీక్ష
తిరుపతి రూరల్ : ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో శాసనసభ అంచనాల కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం కమిటీ చైర్మన్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్ర భవన్ బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించారు. వివిధ పనులపై ఢిల్లీకి వచ్చే వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై చం ద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులను ప్రశ్నిం చారు. బడ్జెట్‌ను మరింతగా పెంచి వసతులను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఉత్తరాఖం డ్, నేపాల్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో తెలుగువారిని కాపాడేందుకు ఎంత ఖర్చు చేశారు?
ఖర్చు చేసిన నిధులకు ఆడిట్ జరిగిందా? ఆంధ్రాభవన్లోని ఉద్యోగుల డ్యూటీ రోస్టర్, ఖాళీల భర్తీకి తీసుకుంటున్న చర్యలు? కేంద్రంలో ఇప్పటి వరకు అనుమతించిన పను లు, పెండింగ్‌లో ఉన్న పనులు ఎ న్ని.. అంటూ చెవిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.