assests loss
-
హాస్టల్లో సిలిండర్ల పేలుడు: తప్పిన ముప్పు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సాంఘీక సంక్షేమ హాస్టల్లో సోమవారం సిలిండర్లు పేలాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాకపోతే రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిసింది. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం..
చింతపల్లి(నల్గొండ జిల్లా): చింతపల్లి మండలం కొక్కిరాలతండాలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారీ సైలెన్సర్ నుంచి వచ్చిన అగ్గిరవ్వ ప్రత్తికి అంటుకుని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోటగిరిలో గుడిసె దగ్ధం..రూ.2 లక్షల ఆస్తి నష్టం
నిజామాబాద్(కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని బోయగల్లీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మయ్య అనే వ్యక్తికి చెందిన గుడిసె ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యింది. పమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. వ్యక్తిగత పనుల నిమిత్తం పక్క ఊరు వెళ్లారు. పెళ్లికోసం దాచిన బంగారం, వెండినగలతో పాటు లక్ష రూపాయల నగదు బూడిదపాలైపోయింది. మంటలు ఎలా వచ్చాయనేది తెలియరాలేదు. స్థానిక వీఆర్ఓ వచ్చి పంచనామా నిర్వహించి నష్టం అంచనా వేసుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.