నిజామాబాద్(కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని బోయగల్లీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మయ్య అనే వ్యక్తికి చెందిన గుడిసె ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యింది. పమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. వ్యక్తిగత పనుల నిమిత్తం పక్క ఊరు వెళ్లారు.
పెళ్లికోసం దాచిన బంగారం, వెండినగలతో పాటు లక్ష రూపాయల నగదు బూడిదపాలైపోయింది. మంటలు ఎలా వచ్చాయనేది తెలియరాలేదు. స్థానిక వీఆర్‌ఓ వచ్చి పంచనామా నిర్వహించి నష్టం అంచనా వేసుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
కోటగిరిలో గుడిసె దగ్ధం..రూ.2 లక్షల ఆస్తి నష్టం
Published Sun, Aug 16 2015 7:44 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement