బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టుకు జయలలిత!
చెన్నై:బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. అంతే కాకుండా ప్రత్యేక కోర్టు విధించిన శిక్షపై కూడా స్టే విధించాలని ఆమె కోర్టుకు విన్నవించనున్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన వ్యూహాలపై జయలలిత తరుపు న్యాయవాదులు చర్చించారు. మంగళవారం బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయసలహాదారులు పేర్కొన్నారు.
మూడేళ్ల కన్నా ఎక్కువకాలం శిక్ష పడితే హైకోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వాలని సీనియర్ న్యాయవాది బి.కుమార్ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టుకు దసరా సెలవులు.