assets value
-
నిహారిక ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే!
-
టీచర్ల ఆస్తి ప్రకటన జీవోపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై జీవోను తెలంగాణ సర్కార్ నిలిపివేసింది. విద్యా శాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యా శాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు. చదవండి: టీచర్ల సీనియారిటీపై కసరత్తు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. -
Telangana: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. జూన్ 8న వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్, అతని సోదరుని మధ్య భూవివాదం ఉంది. ఇరువురు కూడా పెద్ద ఎత్తున పలుకుబడి ఉపయోగించి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అన్నదమ్ములు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాలు గతంలో ఉన్నప్పటికీ తాజాగా ప్రతియేటా సమర్పించాలని ఆదేశించడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరినీ దోషులుగా ఆపాదించడం కరెక్ట్ కాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. చదవండి: ('48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్ షేర్ చేస్తా') -
మీ ఆస్తులపై దర్యాప్తునకు సిద్ధమా?
- లోకేష్, చంద్రబాబులకు వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సవాల్ సాక్షి, హైదరాబాద్: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ ప్రకటించిన తన ఆస్తులతో పాటు తన తండ్రి చంద్రబాబునాయుడు, తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువపై స్వతంత్ర ఆడిటర్లు లేదా రిటైర్డు న్యాయమూర్తితో దర్యాప్తునకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు సవాల్ విసిరారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే లోకేష్ ఆస్తుల ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. తమ సవాలును స్వీకరించి దర్యాప్తునకు సిద్ధపడకపోతే లోకేష్ , చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని అనుకోవాల్సి ఉంటుందన్నారు. ‘చంద్రబాబు ఆస్తుల విలువ కేవలం రూ. 42 లక్షలని ప్రకటించారు. అలాంటి వ్యక్తి 1,125 చదరపు గజాల స్థలంలో రాజ సం ఉట్టిపడే రీతిలో ప్యాలెస్ ఎలా నిర్మిస్తున్నారు? ఎవరైనా కట్టిస్తున్నారా? ’ అని రాంబాబు డిమాండ్ చేశారు. చిత్ర విచిత్రాలెన్నో.. లోకేశ్ ప్రకటించిన ఆస్తుల్లో నమ్మడానికి వీల్లేని విచిత్రాలు అనేకం ఉన్నాయన్నారు. లోకేష్‌కు ఆయన తండ్రికి పక్కపక్కనే ఒకరికి 1,125 గజాలు, మరొకరికి 1,285 గజాల స్థలం ఉందని, అలాంటిది చంద్రబాబు స్థలం విలువ రూ. 23.20 లక్షలుగా చూపితే లోకేష్ స్థలం విలువ రూ. 2.36 కోట్లుగా చూపించారని చెప్పారు. నగరం నడిబొడ్డున లోకేష్‌కు, ఆయన తల్లికి పక్కపక్కనే ఐదేసి ఎకరాల భూమి ఉంటే నాయనమ్మ బహుమతిగా ఇచ్చింది కనుక తన భూమి విలువ చెప్పబోనని లోకేష్ అంటున్నారని, పక్కనే ఉన్న తల్లికి చెందిన భూమి విలువను మాత్రం కేవలం రూ. 71.81 లక్షలుగా చూపించారన్నారు. కరువులోనూ హెరిటేజ్‌కు భలే లాభాలు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నపుడే హెరిటేజ్‌కు లాభాలు రావడం మరో విచిత్రమని అంబటి అన్నారు. పాలూ, కూరగాయలమ్మి దేశంలో ఎవరూ వేల కోట్లు సంపాదించింది లేదన్న రాంబాబు.. బహుశా చంద్రబాబు వద్ద గల ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయి కనుకే వాటిని అమ్మి ఇంతగా సంపాదిస్తున్నారేమోనని వ్యంగ్య బాణాలు విసిరారు.