
టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై తెలంగాణ సర్కార్.. జీవో నిలిపివేసింది. విద్యాశాఖ ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై జీవోను తెలంగాణ సర్కార్ నిలిపివేసింది. విద్యా శాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యా శాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
చదవండి: టీచర్ల సీనియారిటీపై కసరత్తు
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.