aswini ponnappa
-
ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి, ఎనిమిదో సీడ్ మేఘన జక్కంపూడి–పూర్వీషా రామ్ జోడీలు శుభారంభం చేశాయి. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో ఈ జంటలు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. బుధవారం మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్‌సీడ్ అశ్విని–సిక్కి రెడ్డి ద్వయం 21–13, 13–21, 21–16తో తాన్ పెర్లీ కూంగ్‌లీ–మురళీథరన్ థినా (మలేసియా) జోడీపై గెలుపొందగా... మేఘన–పూర్వీషా జంట 21–10, 21–6తో అన్ను ధన్కర్–అనుభా కౌశిక్ (భారత్) జోడీని సులువుగా ఓడించింది. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా–రోహన్ కపూర్ జంట తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. అర్జున్–శ్లోక్ ద్వయం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ ప్రణవ్ చోప్రా–రోహన్ కపూర్ ద్వయం 18–21, 21–13, 14–21తో షోహిబుల్ ఫక్రీ–బగాస్ మౌలానా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఎనిమిదో సీడ్ అర్జున్–శ్లోక్ (భారత్) జంట 21–11, 21–8తో గౌరవ్–దీపక్ ఖత్రి (భారత్) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది. ఇతర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో వైభవ్–ప్రకాశ్ రాజ్ (భారత్) జంట 21–18, 17–21, 21–18తో అమర్– ముహమ్మద్ అమీర్ (మలేసియా) జోడీపై, విఘ్నేశ్–దీప్ (భారత్) ద్వయం 21–14, 21–19తో సెంథిల్ గోవింద్– రెహాన్ (భారత్) జోడీపై గెలుపొందాయి. మహిళల డబుల్స్ తొలిరౌండ్ ఫలితాలు: నాలుగో సీడ్ వింగ్ యుంగ్–యెంగ్ టింగ్ (హాంకాంగ్) ద్వయం 21–10, 21–13తో రియా ముఖర్జీ–అనురా ప్రభుదేశాయ్ (భారత్) జోడీపై, పూజ దండు–సంజన సంతోష్ (భారత్) ద్వయం 1–0తో రుతుపర్ణ–ఆరతి (భారత్) జోడీపై, గావో జి యావో–పెంగ్ కిన్ (చైనా) ద్వయం 21–15, 21–16తో కుహూ గార్గ్–అనౌష్క పరీఖ్ (భారత్) జంటపై గెలుపొంది ముందంజ వేశాయి. -
డబుల్స్‌లో ఆధిపత్యానికి సమయముంది!
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో భారత డబుల్స్ క్రీడాకారులు ఆధిపత్యం ప్రదర్శించాలంటే మరింత సమయం పడుతుందని బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప అభిప్రాయపడింది. డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాధిస్తోన్న పురోగతిపై ఆమె హర్షం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగం సరైన దిశలో వెళ్తోంది. ఆటగాళ్లు జతగా గొప్ప విజయాలను సాధిస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్– చిరాగ్ జంట కొరియా, ఫ్రాన్స్ సూపర్ సిరీస్‌ల్లో క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ కేటగిరీలోనూ సిక్కిరెడ్డి– ప్రణవ్ జపాన్ ఓపెన్ సెమీస్‌కు చేరారు. ఇవన్నీ చాలా గొప్ప విజయాలు. ఇవి ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్నాయి. కానీ ప్రపంచ వేదికపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించాలంటే మాత్రం భారత్‌కు ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడిప్పుడే మనం గాడిలో పడుతున్నాం’ అని అశ్విని చెప్పింది. బుధవారం ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆమె మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డితో, మిక్స్డ్ డబుల్స్‌తో సాత్విక్ సాయిరాజ్‌తో కలిసి విజేతగా నిలిచింది. గతంలో రెండు సార్లు (2009, 2013లో) గుత్తాజ్వాలతో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన అశ్వినికి ఇదే తొలి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో మూడో పతకం సాధించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. -
క్వార్టర్స్ ఫైనల్స్‌లో జ్వాల-అశ్విని ఓటమి
జకర్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ క్వార్టర్స్ ఫైనల్స్‌లో గుత్తా జ్వాల జోడీ నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్ డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ... జపనీస్ క్రీడాకారిణిల చేతిలో 23-25, 14-21 తేడాతో ఓడారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే.