పుణే, కోల్‌కతా మ్యాచ్ డ్రా
పుణే: ఐఎస్ఎల్లో ఎఫ్‌సీ పుణే సిటీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పుణే నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. 17 పాయింట్లతో కోల్‌కతా రెండో స్థానంలో ఉండగా, 13 పాయింట్లతో పుణే ఏడో స్థానంలో కొనసాగుతోంది.
11వ నిమిషంలోనే కోల్‌కతా తరఫున పోడి అద్భుత రీతిలో హెడర్ గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో ఉంచాడు. ఆ తర్వాత ప్రథమార్ధం చివర 45వ నిమిషంలో కట్సౌరనీస్ గోల్‌తో పుణే స్కోరును సమం చేసింది. ద్వితీయార్ధంలో ఇరు జట్లుపేలవ ఆటతీరును ప్రదర్శించడంతో గోల్స్ నమోదు కాలేదు. కొచ్చిలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో చెన్నైయిన్ జట్టు తలపడుతుంది.