atm broken
-
ఏటీఎంను ధ్వంసం చేసి.. చివరికి..
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలోని సీసీ పుటేజీల ఆధారంగా గుర్తుతెలియని దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీసీ పుటేజీ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సదరు వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏటీఎం పై కప్పును తొలగించి అందులోంచి డబ్బులు తీయడానికి విఫలయత్నం చేశాడు. గంట సేపు ప్రయత్నించి వెళ్లిపోయాడు. క్లూస్ టీం పోలీసులు రంగంలోకి దిగి నిందితుని వేలిముద్రలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎస్సై రమాకాంత్ కోరారు. -
ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ.. సీసీ కెమెరాలకు రంగేసి
సాక్షి, నల్గొండ: నీలగిరిలో దుండగులు తెగబడ్డారు. గుర్తు తెలియకుండా సీసీ కెమెరాలకు నల్ల రంగు వేసి.. ఏటీఎం(ఆటోమెటిక్ టెల్లర్ మిషన్)ను గ్యాస్ కట్టర్‌తో తెరిచి సుమారు రూ.14లక్షల నగదును అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డు బీటీఎస్ ప్రాంతంలో గల ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోని శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు చొరబడ్డారు. అయితే, దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా ముందు జాగ్రత్తగా ఏటీఎం వెలుపల, లోపల ఉన్న మొత్తం నాలుగింటికి నల్లరంగు వేశారు. అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం తెరిచి నగదును అపహరించుకుపోయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అంతర్ రాష్ట్ర ముఠా పనేనా ? జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే మిర్యాలగూడ రోడ్డులోని ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త ఏటీఎంను వదిలేసి పాత ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో తెరిచి చోరీకి పాల్పడిన తీరు అంతర్రాష్ట్ర ముఠా పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఉంటుందని, అది తెలిసే దుండగులు పాత ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల సేకరణ తెల్లవారుజామున బీటీఎస్ ప్రాంతంలో వాకింగ్‌కు వచ్చిన వారు గమనించడంతో ఏటీఎంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు వన్ టౌన్ సీఐ గోపి, టూటౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చోరీ జరిగిన ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి దుండగులు వేలిముద్రలు, పాదముద్రలు, తల వెంట్రుకలు తదితర కీలక ఆధారాలు సేకరించారు. అయితే, చోరీ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 5గంటల మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రోడ్డు మార్గంలో భద్రాచలానికి రాష్ట్రపతి.. ముర్ము ప్రయాణించేది ఈ కారులోనే -
కుర్రాడికి చిర్రెత్తింది!
ఇటు పోలీస్ చలాన్లు అటు నో క్యాష్ ఏటీఎంలు ►అసహనంతో ఏటీఎంల అద్దాలు ధ్వంసం ►హనం స్వాధీనం చేసుకున్న పోలీసులు ►చలాన్ సొమ్ము చెల్లించడానికి ►ఏటీఎంల చుట్టూ తిరిగినా దొరకని డబ్బు హైదరాబాద్: ఓవైపు ట్రాఫిక్ పోలీసుల చలాన్.. కట్టడానికి వెళ్తే.. వెక్కిరిస్తున్న నో క్యాష్ బోర్డులు.. అంతే.. ఓ కుర్రాడికి చిరెత్తుకొచ్చింది..2 ఏటీఎం కేంద్రాల అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఉదంతం మంగళవారం సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్స్ ప్రారంభించారు. సంతోష్‌నగర్‌కు చెందిన విద్యార్థి అమీర్ ఖాన్(21) తన వాహనంపై వస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. పీడీఏ మిషన్‌లో తనిఖీ చేసిన పోలీసులు ఆ వాహనంపై రూ.505(నాలుగు చలాన్లు) పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్ హెల్మెట్ ధరించకపోవడం, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో మరో రూ.1,300 స్పాట్లో వడ్డించారు. జరిమానా మొత్తం రూ.1,805 చెల్లించి వాహనాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. ఈ–చలాన్ ప్రతిని తీసుకున్న అమీర్ దాన్ని చెల్లించడానికి అవసరమైన డబ్బు కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏటీఎంల చుట్టూ తిరిగాడు. 20 చోట్ల ప్రయత్నించినా డబ్బు దొరకలేదు. తిరిగి ఉమెన్స్ కాలేజీ వద్దకు వచ్చిన అమీర్.. అక్కడి ఇండిక్యాష్, ఫెడరల్ బ్యాంక్ ఏటీఎంల్లోకి వెళ్లాడు. అక్కడా ‘నో క్యాష్’బోర్డు కనిపించడంతో తీవ్ర అసహనానికి గురై కాలితో వాటి అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో అమీర్ కాలికి తీవ్రగాయమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అమీర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఐదు కుట్లు వేశారు. అక్కడి నుంచి అతడిని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రజా ఆస్తుల విధ్వంసక చట్టంలోని 427 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు చలాన్ చెల్లించమంటూ వేధించడం, ఏటీఎం కేంద్రాల్లో డబ్బు లేకపోవడంతోనే తాను అసహనానికిలోనై ఏటీఎం కేంద్రాన్ని ధ్వంసం చేశానని అమీర్ మీడియాతో చెప్పాడు. కార్డు ద్వారానూ చెల్లించవచ్చు మూడు అంతకంటే ఎక్కువ ఈ–చ లాన్లు పెండింగ్‌లో ఉంటేనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. జరిమానా మొత్తాన్ని పోలీసులు నగదుగా తీసుకోరు. ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలతో పాటు ఆన్లైన్ ద్వారా చెల్లించే ఆస్కారం ఉంది. అక్కడ నగదే కాదు డెబిట్/క్రెడిట్ కార్డులు సైతం వినియోగించవచ్చు. వాహన చోదకులు ఆన్లైన్లో తనిఖీ చేసుకోవడం ద్వారా తమ వాహనంపై జారీ అయిన ఈ–చలాన్లు ఎన్నో తెలుసుకోవచ్చు. ఎప్ప టికప్పుడు వాటిని క్లియర్ చేస్తే ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ఇబ్బందులు ఉండవు. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
డబ్బులు రాలేదని.. ఏటీఎం పగలగొట్టాడు
ఏటీఎంలలోంచి డబ్బులు రాకపోవడంతో ప్రజల్లో అసహనం, అసంతృప్తి తీవ్రమవుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా ఎక్కడా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా అవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఎక్కడ తిరిగినా డబ్బు దొరక్కపోవడంతో అసహనానికి గురైన ఓ యువకుడు ఏకంగా ఏటీఎంలపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కాడు. కోఠి ఉమెన్స్ కాలేజీ బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఫెడరల్ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వచ్చిన ఓ యువకుడు ఆ ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో ఆగ్రహంతో ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో ఆగ్రహంతో దాని అద్దాలను పగులగొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి.. ఏటీఎంను పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నఅమీర్ ఖాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు ప్రశ్నించినప్పుడు అమీర్ ఖాన్ చెప్పిన విషయం మరో కొత్త వివాదానికి కారణమైంది. ట్రాఫిక్ పోలీసులు వేధించడం వల్లే తాను ఏటీఎంను ధ్వంసం చేశానని అతడు చెప్పాడు. పెండింగులో ఉన్న చలాన్ మొత్తం అప్పటికప్పుడే చెల్లించాలంటూ తన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారని, తన చేతిలో డబ్బులు లేకపోవడంతో పలు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఎన్నిచోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించానన్నాడు. -
డబ్బులు రాలేదని.. ఏటీఎం పగలగొట్టాడు