atm money
-
Hyderabad: ఏటీఎంలో భద్రపరచాల్సిన నగదుతో డ్రైవర్ పరారీ
సాక్షి, హైదరాబాద్: కెనరా బ్యాంక్ ఏటీఎం కేంద్రాల్లో డబ్బును లోడ్ చేసేందుకు వచ్చిన డ్రైవర్ అదును చూసి రూ.3 లక్షలతో ఉడాయించాడు. వాహనంలో రూ. 37 లక్షలు ఉన్నప్పటికి బ్యాక్సులను మోయలేక రూ.3 లక్షల బాక్సుతో పాటు రెండు సెక్యూరిటీ గన్లతో పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్లలో రైటర్ సేఫ్ గార్డు సంస్థ నగదును లోడ్ చేస్తుంది. ప్రతి రోజు వివిధ రూట్లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో వాహనాల్లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి నగదును లోడ్ చేస్తారు. గురువారం సిబ్బంది అశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ గార్డులు కె.వి.రామ్, చంద్రయ్యలు రూ.72 లక్షలతో డ్రైవర్ ఫారూఖ్‌తో కలిసి వాహనంలో బయలుదేరారు. అహ్మద్‌నగర్, ఎన్ఎండీసీ, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదును లోడ్ చేసి ఆయా కేంద్రాల్లో మిగిలిన బాక్సులను తీసుకుని వాహనంలో లోడ్ చేశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వచ్చారు. సిబ్బంది ఆశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కె.వి.రామ్, చంద్రయ్య లోపలికి వెళ్లి షట్టర్ వేసుకుని నగదును లోడ్ చేస్తున్నారు. సెక్యూరిటీకి చెందిన రెండు ఏయిర్ పిస్తల్‌లను వాహనంలోనే ఉంచారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఫారూఖ్ వాహనంతో ఉడాయించాడు. రాజేంద్రనగర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ రోడ్డు పక్కన వాహనాన్ని పార్కు చేసి అందులో ఉన్న ఒక బాక్సు, రెండు గన్లను తీసుకుని పరారయ్యాడు. ఒక్కడే ఉండడం, బాక్సులు పెద్దగా ఉండడంతో నగదు మొత్తం తీసుకెళ్లేందుకు అతడికి వీలు కాకపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు లోడ్‌చేసి బయటికి వచ్చిన సిబ్బంది చూడగా వాహనం కనిపించకపోవడంతో 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చదవండి: Road Accident: బస్సు, టవేరా వాహనం ఢీ.. 11 మంది దుర్మరణం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉండడంతో ఏజెన్సీ నిర్వహకుల సమాచారంతో పోలీసులు కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. వాహనంలో మిగిలిన నగదు బాక్సులు ఉండడం, ఒక్క బాక్సు మాత్రమే కనిపించకపోవడం, రెండు గన్లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు నగదును లెక్కించగా రూ.3 లక్షలు బాక్సుతో డ్రైవర్ పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల పరిశీలన... డ్రైవర్ ఫారూఖ్ ఒక్కడే నగదును దొంగలించాడా అతడికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం సెంటర్ నుంచి కిస్మత్పూర్ బ్రిడ్జీ వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతను ట్రంక్ బాక్సుతో పాటు రెండు గన్లను తీసుకువెళ్లడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డులకు చెందిన ఈ తుపాకులు బరువుగా ఉంటాయని వాటిని తీసుకువెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారన్నారు. స్థానికంగా వాటిని పడేసి ఉండవచ్చునని భావించిన పోలీసులు దాదాపు గంట సేపు గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. -
మంది సొమ్మే కదా మనకేంటి!
సాక్షి,హైదరాబాద్: ఏటీఎంలో నింపే డబ్బు బ్యాంకులది.. అంటే ప్రజల సొమ్ము. నిర్వహణలో మాత్రం అటు బ్యాంకులు, ఇటు కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా లోపభూయిష్టంగా మారిన ఏటీఎంలు అక్రమార్కులకు, నేరగాళ్లకు కల్పతరువులుగా మారుతున్నాయి. నగరంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలే దీనికి నిదర్శనం. కస్టోడియన్లు రూ.14.69 కోట్లు కాజేసిన కేసులు గడిచిన కొన్నేళ్లల్లో సిటీలో నమోదయ్యాయి. రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు రూ.23.32 లక్షలు కాజేశారంటూ ఇటీవల సీసీఎస్ పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు వీటిలో తాజాది. ఔట్ సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే బాధ్యతల్ని స్వయంగా పర్యవేక్షించట్లేదు. ఈ కాంట్రాక్టుల్ని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన నగదు భద్రపరిచే కేంద్రాల నుంచి రూ.కోట్లను తమ సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులకు ఈ కస్టోడియన్లు నేతృత్వం వహిస్తారు. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో పెడుతుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు కాంట్రాక్టు ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నాయి. సాంకేతికతకు ఆమడదూరం... ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్‌తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు. ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెబుతున్న కస్టోడియన్లు గోల్‌మాల్‌కు పాల్పడుతూ రూ.లక్షలు, రూ.కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. ఓల్డేజ్ సెక్యూరిటీ గార్డ్లు.. ఏటీఎంల భద్రత విషయంలోనూ లోపాలున్నాయి. ఇక్కడ విధుల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్క్ వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 29న చోటు చేసుకున్న ఏటీఎం సొమ్ము దోపిడీ కేసు దీనికి ఉదాహరణ. దాదాపు ప్రతి సెక్యూరిటీ గార్డు, గన్‌మె న్ ‘ఓల్డేజ్’లోనే ఉంటున్నారు. పది ఏటీఎం కేంద్రాలను పరిశీలిస్తే వాటిలో ఆరు ఏడింటిలో వృద్ధులే సెక్యూరిటీ గార్డులుగా ఉంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదును కాజేసిన కస్టోడియన్ల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. నగరంలో రూ.14.69 కోట్ల మేర కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకులు మాత్రం పట్టించుకోవట్లేదు. -
రూ. 9.58 కోట్ల భారీ చోరీ
- ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీలో గోల్‌వూల్ - ఇద్దరు ఉద్యోగులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు - పరారీలో ఉన్న నిందితులు హైదరాబాద్: ఏటీఎంలలో డబ్బులు నింపే ఉద్యోగులు ఏజెన్సీని మోసం చేసి డబ్బును అపహరించిన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపూర్ జిల్లాకు చెందిన లోకేశ్ రెడ్డి, పాతబస్తీకి చెందిన ప్రవీణ్ గత కొన్ని నెలలుగా మహేంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీలోని ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో పని చేస్తున్నారు. సుమారు 52 బ్యాంకుల ఏటీఎంలకు ఈ ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా డబ్బులు సరఫరా చేస్తారు. అయితే డబ్బులు సరఫరా చేసే ఉద్యోగం చేస్తున్న లోకేశ్‌రెడ్డి, ప్రవీణ్‌లు ఏజెన్సీలో నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు కాని ఏటీఎంలలో క్యాష్ మాత్రం వేయడం లేదు. గత కొన్ని రోజులుగా ఇదేవిధంగా చేస్తూ వస్తున్నారు. అయితే, ఏప్రిల్‌లో ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ యాజమాన్యం ఏజెన్సీని వేరేవాళ్లకు అమ్మేసింది. దీంతో లెక్కలు చూస్తున్న సమయంలో 9.98 కోట్లు మాయం అయినట్లు అందులో తేలింది. దీంతో ఆ ఏజెన్సీ మేనేజర్ నాగరాజు శనివారం స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏటీఎంలకు క్యాష్ సరఫరా చేసే లోకేశ్ రెడ్డి, ప్రవీణ్‌లపై అనుమానం ఉన్నట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఉద్యోగులు లోకేశ్ రెడ్డి, ప్రవీణ్‌లు పరారీలో ఉన్నారు. -
కళ్లల్లో కారం కొట్టి రూ.11 లక్షలు లూటీ
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్ బ్యాంక్ అధికారి ఇంట్లో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. అధికారి రాంప్రసాద్ కళ్లల్లో కారం కొట్టి ఏటీఎంలో ఉంచేందుకు దాచిన రూ.11 లక్షలు దోచుకెళ్లారు. పల్సర్ బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. ఇల్లు అద్దెకు ఉందా అంటూ వారు తమింట్లోకి చొరబడ్డారని, లేదని చెప్పేలోపే తన కంట్లో కారం చల్లారని చెప్పాడు. తర్వాత ఇంట్లోకి చొరబడి డబ్బు ఎత్తుకుపోయారని వివరించాడు. వారిని పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వాపోయాడు. అయితే కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న రాంప్రసాద్ వ్యహారశైలిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి మాటలకు పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సెక్యూరిటీ గార్డు, వ్యాన్ డ్రైవర్ బయటే ఉన్నప్పటికీ దొంగలను పట్టుకోలేకపోయారు. దొంగలు పారిపోయిన తర్వాతే రాంప్రసాద్ కేకలు పెట్టడంతో అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.