ATM theft arrest
-
బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టురట్టు
గన్నవరం: బంగ్లాదేశ్‌కు చెందిన దొంగల ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా శుక్రవారం మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్ వాసులు ఆరుగురు ఈ నెల 5న జయంతిపూర్ బోర్డర్ వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి రైలులో ఈ నెల 10న విజయవాడ చేరుకున్నారు. ఏటీఎంల్లో చోరీ నిమిత్తం మాచవరం డౌన్, రామ్‌గోపాల్ థియేటర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 14న గోవాకు మకాం మార్చారు. అక్కడ హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్ ఏటీఎంలను ఎత్తుకుపోయి రూ.15 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్లీ చేరుకుని బంగారం కొనుగోలు చేశారు. ఈ నెల 19న విజయవాడకు చేరుకున్నారు. 21న గన్నవరంలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్ ఆటోను అపహరించి హైవే పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం చోరీకి యత్నించారు. బీట్ కానిస్టేబుల్ మణింద్రకుమార్, హోంగార్డు నాగరాజు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడిచేసి పరారయ్యేందుకు యత్నించారు. మణీంద్ర ఇతర సిబ్బంది సహాయంతో ముఠాలోని నదీమ్‌ఖాన్, మహమ్మద్ జహంగీర్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.3 లక్షల నగదు, 32 కాసుల బంగారం, ట్రక్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నేరస్తులు సైమన్, బాద్షా, శరణ్‌సింగ్ సుమన్, కోకోన్ ముల్లా పరారీలో ఉన్నారు. మణీంద్ర ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఎంబసీ అధికారులకు సమాచారమిచ్చారు. మిగిలిన వారు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణీంద్ర, నాగరాజు, వీరికి సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్, సీఐ శివాజీ, ఎస్ఐలు శ్రీనివాస్, రమేష్‌బాబుకు ఎస్పీ రివార్డులను అందజేశారు. ఇదీ చదవండి: 30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం -
ఏటీఎంలో చోరీ.. గంటలోనే దొంగ పట్టివేత!
చందానగర్: ఏటీఎంలో డబ్బులు కాజేసి పారిపోయిన దొంగను చందానగర్ పోలీసులు ఒక్క గంటలోనే పట్టుకొని.. రూ.6 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ క్యాస్ట్రో కథనం ప్రకారం... శేరిలింగంపల్లి నల్లగండ్ల అపర్ణ జెనిత్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో ఏటీఎం బాక్స్‌ను బద్దలకొట్టి అందులోని నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు చందానగర్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చుట్టు పక్కల గాలించగా నల్లగండ్ల హూడా లేఅవుట్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడిని అదుపులో తీసుకొని సోదా చేయగా, రూ. 6.50 లక్షల నగదు ఉన్న బ్యాగ్ దొరికింది. పోలీసులు తమ దైన శైలిలో విచారించగా ఏటీఎంలో దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. నిందితుడి పేరు రాజు అని, ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ నల్లగండ్లలో నివాసముంటున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఏటీఎంలో చోరీకి ఉపయోగించిన పరికరాలు, రూ. 6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం -
‘ఏటీఎం’ మోసగాడి అరెస్ట్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాలో ఏటీఎంలకు వచ్చే వారిని ఏమార్చి, కార్డులను తారుమారు చేసి వారి డబ్బులను కాజేస్తున్న ఓ మోసగాడిని శనివారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో చెరకు రసం వ్యాపారి సింద కృష్ణ ఈనెల 12న ఐబీ చౌరస్తాలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. కానీ, డబ్బులు రాకపోవడంతో కృష్ణ వెనుదిరుగుతుండగా వెనకాలే ఉన్న ఓ వ్యక్తి తాను డ్రా చేసి ఇస్తానంటూ కృష్ణ ఏటీఎం తీసుకున్నాడు. ఇతను కూడా డబ్బులు రావడం లేదని చెప్పి కృష్ణకు ఏటీఎం వాపసిచ్చాడు. కానీ, ఆ వ్యక్తి కృష్ణకు అసలు ఏటీఎం కాకుండా, తన వద్ద ఉన్న మరో నకిలీ ఏటీఎంను ఇచ్చాడు. ఏటీఎం దగ్గరి నుంచి కృష్ణ వెళ్లిపోగానే, ఆ వ్యక్తి తన దగ్గరున్న కృష్ణ అసలు ఏటీఎం కార్డు ద్వారా రూ.14,500లను డ్రా చేసుకుని ఉడాయించాడు. తన సెల్‌కు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించిన కృష్ణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా డబ్బులు కాజేసిన వ్యక్తిని బెల్లంపల్లి ఓసీపీ–కేకే–2లో నివాసముండే ఉంటున్న గంధం మహేందర్‌గా పోలీసులు గుర్తించారు. మోసపోయిన కృష్ణకు నిందితుడు ఇచ్చిన ఏటీఎం కార్డు వివరాల ఆధారంగా విచారించి, శనివారం బస్టాండ్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు మహేందర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు. ఇతని నుంచి రూ.14,500 నగదుతోపాటు, మరో 3 డమ్మీ ఏటీఎం కార్డులను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై మారుతితోపాటు సిబ్బంది జైచందర్, సత్యం పాల్గొన్నారు. -
ఏటీఎం క్లోనింగ్ ముఠా అరెస్టు
వారంతా బాగా చదువుకున్నారు. వారి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సులువుగా డబ్బు సంపాధించాలని భావించారు. సెక్యూరిటీ లేని ఏటీఎంలను టారెŠగ్ట్గా చేసుకుని క్లోనింగ్ పరికరాలను ఏర్పాటుచేసి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఈ ముఠాను పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12,12,619 నగదు, క్లోనింగ్‌కు ఉపయోగించే ౖస్కైమర్, కార్డు రీడర్లు, డాటా మేనేజర్ సాఫ్ట్వేర్, మైక్రో సీసీ కెమెరాలు, డమ్మీ ఏటీఎం కార్డులు, ఇన్నోవా కారును సీజ్ చేశారు. పలమనేరు : ఏటీఎం నుంచి నగదును నిమిషాల్లో మాయం చేసే చెన్నైకి చెందిన ముఠాలోని ఐదుగురిని పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు శని వారం పలమనేరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత అక్టోబరు 20వ తేదీ నుంచి 22 వరకు 22 మంది ఎస్బీఐ ఖాతాదారులకు చెందిన ఏటీఎం కార్డులు వారివద్దే ఉండగా నగదు మాయమైంది. దీనిపై పోలీసులకు పిర్యాదులందాయి. డీఎస్పీ చౌడేశ్వరి కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఐడీపార్టీ పోలీసులతో కలిసి పలమనేరులో అమర్చిన సీసీటీవీ పుటేజీలు, కాల్‌డేటా ద్వారా నేరస్తులను గుర్తించారు. సెల్‌టవర్ లొకేషన్ ద్వారా వీరి కదలికలను పసిగట్టారు. శనివారం పలమనేరు ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద దుండగులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమిళనాడు రాష్ట్రం కనత్తూరుకు చెం దిన నిరంజన్(37), మొహిద్దీన్(25), మాఘపూర్‌కు చెందిన ఎంఎస్కే రక్షిత్ అలియాస్ శ్యామ్(28), శాలిగ్రంకు చెందిన సురేష్(26), క్రిష్ణగిరికి చెందిన తమిళరసన్(25)గా తేలింది. వీరితో పాటు శ్రీలంకకు చెందిన ఆల్ఫ్రెడ్ బాలకుమార్, ముంబయికి చెందిన ఉమేష్ ప్రమేయం ఉందని గుర్తించారు. వీరు పలమనేరులోని ఎస్బీఐ ఏటీఎంతో బాటు తమిళనాడులోనూ ఇలాంటి చోరీలు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఎలా నేరం చేశారంటే దండగులు సెక్యూరిటీలేని ఏటీఎంలలోకి ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని విప్పి అందులో స్కైమర్ అనే యంత్రాన్ని అమర్చుతారు. ఇందులో కార్డు రైడర్ ఉంటుంది. ఏటీఎం పిన్ కనిపించేలా క్యాబిన్లో ఓ మైక్రోసీసీ కెమెరాను ఏర్పాటు చేస్తారు. స్కైమర్ ద్వారా ఏటీఎం కార్డు డేటా వీరి ల్యాప్‌ట్యాప్‌లకు చేరుతుంది. వీరి వద్ద ఉన్న డూప్లికేట్ ఏటీఎం కార్డులకు ఖాతాదారుల వివరాలను జోడించి సీసీ కెమెరాలో కనిపించిన ఏటీఎం పిన్ ద్వారా స్వైపింగ్ మిషన్లతో నగదును డ్రా చేస్తారు. రాష్ట్రంలో మొదటి క్లోనింగ్ కేస్.... దేశంలో ఢిల్లీలో గతేదాడి ఇదే తరహా క్రైమ్ జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో జరిగింది. మన రాష్ట్రంలో మాత్రం ఇదే తొలి కేసు. ఎస్సీ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ వెంకట్వేర్లు ఐడీ పార్టీతో కలిసి కేసును సవాల్‌గా తీసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో ముఠాను పట్టుకుని రికార్డు సృష్టించారు. దీంతో ఎస్పీ వీరిని మెచ్చుకున్నారు. కేసు ఛేదించడంలో కృషి చేసిన దేవ, జయక్రిష్ణ, శీన, ప్రకాష్, ఎల్లçప్ప, పయణి, శివ, అల్లాఉద్దీన్, ప్రకాష్‌కు రివార్డులను అందించారు. సాక్షి కథనం నిజమైంది ఈ చోరీలకు సంబందించి సాక్షి దినపత్రికలో అక్టోబరు 29న పలమనేరులో ఏటీఎం క్లోనింగ్ అన్న శీర్షికన కథనం ప్రచరితమైంది. అందులో చెప్పినట్టు చెన్నైకి చెందిన ముఠానే ఇందుకు పాల్పడడం గమనార్హం. కథనంలో ఎలా చోరీ చేశారని వచ్చిందో అదే తరహాలో చోరీ చేసినట్టు పోలీసులు తెలపడం విశేషం. పరారీలో కీలక వ్యక్తులు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారేకాక మరో ఇద్దరు కీలకమైన నిందుతులు ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా క్లోనింగ్ చేశాక డమ్మీ ఏటీఎం కార్డులను వీరు ఎక్కడి నుంచి తెచ్చారనేది తేలాల్సి ఉంది. శ్రీలంకు చెందిన ఆల్ఫ్రెడ్, ముంబయికి చెందిన ఉమేష్ బయటి దేశాల నుంచే వీటిని సంపాదించినట్టు తెలుస్తోంది. వీరురువురూ చిక్కితే మరింత సమాచారం లభిస్తుందని ఎస్పీ తెలిపారు. -
ఏటీఎంలో సొమ్ము దొంగిలించి ... జూదంలో పెట్టాడు
ఏటీఎంలో సొమ్ము కొల్లగోట్టాడు. ఆ సొమ్మును సులభంగా రెట్టింపు చేయాలనుకున్నాడో ఏమో తీసుకువెళ్లి జూదంలో పెట్టాడు. జూదంలో ఆ సొమ్ముంతా పోయింది. వివరాలు....చెన్నై నగరంలోని గూడువాంజేరి పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం సెంటర్లోకి ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి ఓ దొంగ చొరబడి జిలెటెన్ స్టిక్స్‌తో పేల్చాడు. ఆ ఏటీఎంలో నగదు చోరీపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా తిరుచ్చి జిల్లా మిసిరితాలుకా కుత్తనాంబట్టి గ్రామం ఉత్తర వీధికి చెందిన కుమార్(25)కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు... నిందితుడు కుమార మడిపాక్కంలో ఉన్నట్లు గుర్తించి చెంగల్పట్టు డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలోని అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని సమయపురం ఇన్స్పెక్టర్ మనోహరన్ ఆధ్వర్యంలో నిందితుడు కుమారును విచారించారు. ఆ విచారణలో కుమార్ పలు అసక్తికరమైన విషయాలు పోలీసులకు వెల్లడించాడు. గతంలో తిరుప్పూర్ ఏటీఎం పేల్చివేత ఘటనలో తనకు సంబంధం ఉన్నట్లు కుమార్ పోలీసులకు వెల్లడించాడు. అలాగే గత మార్చిలో తిరుచ్చి టోల్‌గేట్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం కేంద్రాన్ని కూడా ఇదే విధంగా పేల్చివేసి రూ. 25 లక్షలు దోచుకున్నానని తెలిపాడు. ఆ నగదులో సగం సొమ్మును పుదుచ్చేరిలోని ఒక క్లబ్లో జూదం ఆడి పొగొట్టుకున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో విలాసాలు చేసిటనట్లు పోలీసుల విచారణలో వివరించాడు. నిందితుడు కుమార్ తల్లి మంగై ముసిరి పంచాయతీ యూనియన్ అన్నాడీఎంకే కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమె రెండో కుమారుడైన కుమార్ ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఆ క్రమంలో కొన్ని రోజుల క్రితం చెన్నై చేరుకున్నాడు. అనేక చిత్రాల్లో సహాయక నటుడిగా నటించాడు. ఆ తర్వాత సినిమాలు లేకపోవడంతో ఏటీఏంలో సొమ్ము దొంగిలించడమే పనిగా పెట్టుకున్నాడు.