వారంతా బాగా చదువుకున్నారు. వారి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సులువుగా డబ్బు సంపాధించాలని భావించారు. సెక్యూరిటీ లేని ఏటీఎంలను టారెŠగ్‌ట్‌గా చేసుకుని క్లోనింగ్ పరికరాలను ఏర్పాటుచేసి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఈ ముఠాను పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12,12,619 నగదు, క్లోనింగ్‌కు ఉపయోగించే ౖస్కైమర్, కార్డు రీడర్లు, డాటా మేనేజర్ సాఫ్ట్‌వేర్, మైక్రో సీసీ కెమెరాలు, డమ్మీ ఏటీఎం కార్డులు, ఇన్నోవా కారును సీజ్ చేశారు.
పలమనేరు : ఏటీఎం నుంచి నగదును నిమిషాల్లో మాయం చేసే చెన్నైకి చెందిన ముఠాలోని ఐదుగురిని పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు శని వారం పలమనేరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత అక్టోబరు 20వ తేదీ నుంచి 22 వరకు 22 మంది ఎస్‌బీఐ ఖాతాదారులకు చెందిన ఏటీఎం కార్డులు వారివద్దే ఉండగా నగదు మాయమైంది. దీనిపై పోలీసులకు పిర్యాదులందాయి. డీఎస్పీ చౌడేశ్వరి కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఐడీపార్టీ పోలీసులతో కలిసి పలమనేరులో అమర్చిన సీసీటీవీ పుటేజీలు, కాల్‌డేటా ద్వారా నేరస్తులను గుర్తించారు. సెల్‌టవర్ లొకేషన్ ద్వారా వీరి కదలికలను పసిగట్టారు. శనివారం పలమనేరు ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద దుండగులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమిళనాడు రాష్ట్రం కనత్తూరుకు చెం దిన నిరంజన్(37), మొహిద్దీన్(25), మాఘపూర్‌కు చెందిన ఎంఎస్‌కే రక్షిత్ అలియాస్ శ్యామ్(28), శాలిగ్రంకు చెందిన సురేష్(26), క్రిష్ణగిరికి చెందిన తమిళరసన్(25)గా తేలింది. వీరితో పాటు శ్రీలంకకు చెందిన ఆల్‌ఫ్రెడ్ బాలకుమార్, ముంబయికి చెందిన ఉమేష్ ప్రమేయం ఉందని గుర్తించారు. వీరు పలమనేరులోని ఎస్‌బీఐ ఏటీఎంతో బాటు తమిళనాడులోనూ ఇలాంటి చోరీలు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
ఎలా నేరం చేశారంటే
దండగులు సెక్యూరిటీలేని ఏటీఎంలలోకి ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని విప్పి అందులో స్కైమర్ అనే యంత్రాన్ని అమర్చుతారు. ఇందులో కార్డు రైడర్ ఉంటుంది. ఏటీఎం పిన్ కనిపించేలా క్యాబిన్‌లో ఓ మైక్రోసీసీ కెమెరాను ఏర్పాటు చేస్తారు. స్కైమర్ ద్వారా ఏటీఎం కార్డు డేటా వీరి ల్యాప్‌ట్యాప్‌లకు చేరుతుంది. వీరి వద్ద ఉన్న డూప్లికేట్ ఏటీఎం కార్డులకు ఖాతాదారుల వివరాలను జోడించి సీసీ కెమెరాలో కనిపించిన ఏటీఎం పిన్ ద్వారా స్వైపింగ్ మిషన్లతో నగదును డ్రా చేస్తారు.
రాష్ట్రంలో మొదటి క్లోనింగ్ కేస్....
దేశంలో ఢిల్లీలో గతేదాడి ఇదే తరహా క్రైమ్ జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో జరిగింది. మన రాష్ట్రంలో మాత్రం ఇదే తొలి కేసు. ఎస్సీ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ వెంకట్వేర్లు ఐడీ పార్టీతో కలిసి కేసును సవాల్‌గా తీసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో ముఠాను పట్టుకుని రికార్డు సృష్టించారు. దీంతో ఎస్పీ వీరిని మెచ్చుకున్నారు. కేసు ఛేదించడంలో కృషి చేసిన దేవ, జయక్రిష్ణ, శీన, ప్రకాష్, ఎల్లçప్ప, పయణి, శివ, అల్లాఉద్దీన్, ప్రకాష్‌కు రివార్డులను అందించారు.
సాక్షి కథనం నిజమైంది
ఈ చోరీలకు సంబందించి సాక్షి దినపత్రికలో అక్టోబరు 29న పలమనేరులో ఏటీఎం క్లోనింగ్ అన్న శీర్షికన కథనం ప్రచరితమైంది. అందులో చెప్పినట్టు చెన్నైకి చెందిన ముఠానే ఇందుకు పాల్పడడం గమనార్హం. కథనంలో ఎలా చోరీ చేశారని వచ్చిందో అదే తరహాలో చోరీ చేసినట్టు పోలీసులు తెలపడం విశేషం.
పరారీలో కీలక వ్యక్తులు
ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారేకాక మరో ఇద్దరు కీలకమైన నిందుతులు ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా క్లోనింగ్ చేశాక డమ్మీ ఏటీఎం కార్డులను వీరు ఎక్కడి నుంచి తెచ్చారనేది తేలాల్సి ఉంది. శ్రీలంకు చెందిన ఆల్‌ఫ్రెడ్, ముంబయికి చెందిన ఉమేష్ బయటి దేశాల నుంచే వీటిని సంపాదించినట్టు తెలుస్తోంది. వీరురువురూ చిక్కితే మరింత సమాచారం లభిస్తుందని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment