5 వేలమంది పోలీసుల నియామకానికి రంగం సిద్ధం
డిప్యూటీ సీఎం చినరాజప్ప
ఆత్రేయపురం: రాష్ట్రంలో 5వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధమైందని, సంబంధిత ఫైల్ సీఎం చంద్రబాబు వద్ద ఉందని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో మండల టీడీపీ అధ్యక్షుడు ముళ్లపూడి భాస్కరరావు ఇంట జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
అరటికి గిట్టుబాటు ధర కల్పించేందుకు తన వంతు ప్రయత్నిస్తానన్నారు. ఆలమూరు వద్ద గోదావరిలో పడి మృతిచెందిన కుటుంబాలకు త్వరలో పరిహారం అందిస్తామన్నారు.